Bitcoin operators
-
సన్నీలియోన్, శిల్పాశెట్టిలను ప్రశ్నించనున్న ఈడీ
సాక్షి, ముంబయి : బిట్‌కాయిన్ కుంభకోణానికి సంబంధించి బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, ప్రముఖ వ్యాపారి రాజ్ కుంద్రాను ప్రశ్నించిన ఈడీ, ఇదే కేసులో త్వరలో శిల్పాశెట్టితో పాటు సన్నీలియోన్ సహా మరికొందరిని ప్రశ్నించవచ్చని భావిస్తున్నారు. రాజ్ కుంద్రాను ఈడీ ప్రశ్నించిన క్రమంలో హైప్రొఫైల్ సెలెబ్రిటీలు సన్నీ లియోన్, ప్రాచీ దేశాయ్, ఆరతి చభ్రియా, సోనాల్ చౌహాన్, కరిష్మా తన్నా, జరీన్ ఖాన్, నేహ ధూపియా, హ్యూమా ఖురేష్, నర్గీస్ ఫక్రీ తదితరుల పేర్లు ప్రస్తావించినట్టు తెలిసింది. ఇక రాజ్‌కుంద్రా భార్య శిల్పాశెట్టిని ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. ఈ కేసులో నిందితుడైన అమిత్ భరద్వాజ్ కంపెనీకి దుబాయ్, సింగపూర్లలో ఈ సెలబ్రిటీలు సహకరించినట్టు ఈడీ ఆరోపిస్తోంది. పూణేకు చెందిన వ్యాపారి భరద్వాజ్‌ను ఆరునెలల కిందట ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్ చేశారు. -
బిట్‌కాయిన్ ఆపరేటర్ల దుకాణాలు బంద్
న్యూఢిల్లీ: వర్చువల్ కరెన్సీల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలంటూ రిజర్వ్ బ్యాంక్ హెచ్చరించిన నేపథ్యంలో పలు బిట్‌కాయిన్ ఆపరేటర్లు దేశీయంగా తమ కార్యకలాపాలను నిలిపివేశారు. కొన్ని సంస్థలు తాత్కాలికంగానూ, మరికొన్ని నిరవధికంగాను లావాదేవీలు నిలిపివేస్తున్నట్లు తమ వెబ్సైట్లలో పేర్కొన్నాయి. బెసైల్బిట్కోడాట్ఇన్, ఐఎన్‌ఆర్‌బీటీసీ వంటి సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న కరెన్సీలకు ప్రత్యామ్నాయంగా బిట్‌కాయిన్ అనే కల్పిత కరెన్సీ ఇటీవల ప్రాచుర్యంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. సంక్లిష్టమైన కంప్యూటర్ సాఫ్ట్వేర్ వ్యవస్థ ద్వారా ఈ కరెన్సీని రూపొందిస్తున్నారు. దీనిపై ఏ నియంత్రణ సంస్థకు అధికారాలు లేవు. గడిచిన మూడేళ్లలో ఈ యూనిట్ విలువ 200 డాలర్ల నుంచి ఏకంగా 1,000 డాలర్లకు ఎగిసింది. ఈ కరెన్సీ మారకం తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుండటంతో ప్రపంచ దేశాలన్నీ కూడా దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇన్వెస్టర్లను హెచ్చరిస్తున్నాయి. ఇందులో భాగంగా దేశీయంగా ఆర్బీఐ ఈ నెల 24న బిట్కాయిన్ల విషయంలో హెచ్చరికలు జారీ చేసింది.