బిట్‌కాయిన్ ఆపరేటర్ల దుకాణాలు బంద్ | Bitcoin operators shut shop in India amid RBI warning | Sakshi
Sakshi News home page

బిట్‌కాయిన్ ఆపరేటర్ల దుకాణాలు బంద్

Published Fri, Dec 27 2013 2:04 AM | Last Updated on Sat, Sep 2 2017 1:59 AM

బిట్‌కాయిన్

బిట్‌కాయిన్

న్యూఢిల్లీ: వర్చువల్ కరెన్సీల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలంటూ రిజర్వ్ బ్యాంక్ హెచ్చరించిన నేపథ్యంలో పలు బిట్‌కాయిన్ ఆపరేటర్లు దేశీయంగా తమ కార్యకలాపాలను నిలిపివేశారు. కొన్ని సంస్థలు తాత్కాలికంగానూ, మరికొన్ని నిరవధికంగాను లావాదేవీలు నిలిపివేస్తున్నట్లు తమ వెబ్‌సైట్లలో పేర్కొన్నాయి. బెసైల్‌బిట్‌కోడాట్‌ఇన్, ఐఎన్‌ఆర్‌బీటీసీ వంటి సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న కరెన్సీలకు ప్రత్యామ్నాయంగా బిట్‌కాయిన్ అనే కల్పిత కరెన్సీ ఇటీవల ప్రాచుర్యంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. సంక్లిష్టమైన కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ వ్యవస్థ ద్వారా ఈ కరెన్సీని రూపొందిస్తున్నారు.

దీనిపై ఏ నియంత్రణ సంస్థకు అధికారాలు లేవు. గడిచిన మూడేళ్లలో ఈ యూనిట్ విలువ 200 డాలర్ల నుంచి ఏకంగా 1,000 డాలర్లకు ఎగిసింది. ఈ కరెన్సీ మారకం తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుండటంతో ప్రపంచ దేశాలన్నీ కూడా దీని విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇన్వెస్టర్లను హెచ్చరిస్తున్నాయి. ఇందులో భాగంగా దేశీయంగా ఆర్‌బీఐ ఈ నెల 24న బిట్‌కాయిన్ల విషయంలో హెచ్చరికలు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement