BJP rally
-
బెంగాల్ బంద్ హింసాత్మకం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనతోపాటు మంగళవారం జరిగిన ‘నబన్నా అభియాన్’పై పోలీసుల దాడికి నిరసనగా ప్రతిపక్ష బీజేపీ బుధవారం తలపెట్టిన 12 గంటల రాష్ట్ర బంద్ హింసాత్మకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల పోలీసులతో బీజేపీ నేతలు, కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పోలీసులపై రాళ్లు రువ్వడంతో జనాన్ని చెదరగొట్టడానికి లాఠీచార్జి చేయాల్సి వచి్చంది. బీజేపీ కార్యకర్తలు రైలు పట్టాలపై నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రాష్ట్రమంతటా ర్యాలీలు నిర్వహించారు. ఉదయం రోడ్లపై బైఠాయించిన బీజేపీ మాజీ ఎంపీలు రూపా గంగూలీ, లాకెట్ చటర్జీ, రాజ్యసభ సభ్యుడు సమిక్ భట్టాచార్య, ఎమ్మెల్యేల అగ్నిమిత్ర పాల్‌తోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్తర 24 పరగణాల జిల్లాలో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ‘బంగ్లా బంద్’కు మిశ్రమ స్పందన లభించింది. వ్యాపార, విద్యా సంస్థలు, కార్యాలయాలు పాక్షికంగా మూతపడ్డాయి. రోడ్లపై ఘర్షణలు జరుగుతాయన్న అనుమానంతో ప్రజలు చాలావరకు ఇళ్లకే పరిమితమయ్యారు. రాజధాని కోల్‌కతాలో ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించింది. బలవంతంగా దుకాణాలు మూసివేయిస్తున్న బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు బీజేపీ కార్యకర్తలపై కాల్పులు! ఉత్తర 24 పరగణాల జిల్లాలోని భాత్పారాలో ఇద్దరు బీజేపీ కార్యకర్తలపై కాల్పులు జరిగాయని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. అయితే, ఇందులో నిజం లేదని, ఆ ఇద్దరు కార్యకర్తలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని పోలీసులు చెప్పారు. ఈ దాడిలో గాయపడిన బాధితులను చికిత్స కోసం ఆసుపత్రిలో చేరి్పంచామని తెలిపారు. తమ కార్యకర్తలపై తృణమూల్ కాంగ్రెస్ నాయకులు తుపాకీతో కాల్పులు జరిపారని బీజేపీ మాజీ ఎంపీ అర్జున్ సింగ్ పేర్కొన్నారు. బంద్‌పై పిటిషన్ కొట్టివేత బీజేపీ తలపెట్టిన 12 గంటల బంగ్లా బంద్ చట్టవిరుద్ధమని ప్రకటించాలని కోరుతూ సంజయ్ దాస్ అనే లాయర్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కలకత్తా హైకోర్టు బుధవారం కొట్టివేసింది. ఇదే కోర్టులో ఇష్టారాజ్యంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేయకుండా గతంలోనే ఆయనపై నిషేధం విధించామని న్యాయస్థానం తేలి్చచెప్పింది. నిషేధం అమల్లో ఉండగా దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారించలేమని స్పష్టం చేసింది. పిటిషనర్ సంజయ్ దాస్‌కు రూ.50 వేల జరిమానా విధించింది. ఈ సొమ్మును 10 రోజుల్లోగా పశి్చమ బెంగాల్ స్టేట్ లీగల్ సరీ్వసెస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశించింది. డిమాండ్లు నెరవేర్చేదాకా ఉద్యమిస్తాం పశ్చిమ బెంగాల్లో గత 20 రోజులుగా ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. జూనియర్ డాక్టర్ హత్యకు ఖండిస్తూ వైద్యులు, వైద్య సిబ్బంది ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తమకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. వెంటనే ఆందోళనలు విరమించి, విధుల్లో చేరాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరగా జూనియర్ డాక్టర్ల ఫోరమ్ అందుకు నిరాకరించింది.నిందితుడితో సంబంధం ఉన్న ఏఎస్ఐకి పాలిగ్రాఫ్ టెస్టు జూనియర్ డాక్టర్‌పై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ రాయ్‌తో సంబంధాలున్న ఏఎస్ఐ అనూప్ దత్తాకు సీబీఐ అధికారులు బుధవారం పాలిగ్రాఫ్ టెస్టు నిర్వహించారు. ఈ కేసులో అనూప్ దత్తాను పోలీసులు ఇప్పటికే ప్రశ్నించారు. ఇప్పటిదాకా ఎనిమిది మందికి పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించారు. అనూప్ దత్తా కోల్‌కతా పోలీసు వెల్ఫేర్ కమిటీలో పనిచేస్తున్నాడు. వైద్యురాలిపై అఘాయిత్యం జరిగాక నిందితుడు సంజయ్ రాయ్ ఈ విషయాన్ని అనూప్ దత్తాకు తెలియజేసినట్లు సీబీఐ అధికారులు భావిస్తున్నారు. -
ప్రధాని మోదీ తెలంగాణ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
బుల్లెట్టుబండిపై బహిరంగసభకు సంజయ్
దండేపల్లి: లక్సెట్టిపేటలో బుధవారం జరిగిన బీజేపీ బహిరంగ సభకు హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు మండలంలోని గూడెం వద్ద నాయకులు ఘనస్వాగతం పలికారు. కరీంనగర్ నుంచి వాహనంలో వచ్చిన సంజయ్ గూడెం వద్ద పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం పార్టీ కార్యకర్తలు గూడెం నుంచి లక్సెట్టిపేట వరకు నిర్వహించిన బైక్‌ర్యాలీలో సంజయ్ బుల్లెట్ బండి నడుపుకుంటూ సభవద్దకు చేరుకున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్, మాజీ ఎంపీలు వివేక్, రాథోడ్ రమేష్, పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు మల్లారెడ్డి, మండల అధ్యక్షుడు గోపతి రాజయ్య పాల్గొన్నారు. -
ఎన్నికల ‘రూట్’లో బీజేపీ రథయాత్రలు!
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా బీజేపీ రథయాత్రలకు సిద్ధమైంది. వీలైనంత ఎక్కువ మంది ముఖ్య నేతలను భాగస్వాములను చేయడంతోపాటు.. తక్కువ సమయంలో ఎక్కువ మంది ప్రజలను కలుసుకోవడానికి రథయాత్రలే ఉత్తమమనే నిర్ణయానికి వచి్చంది. నిరీ్ణత గడువు ప్రకారం 8 నెలల్లోగా అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నందున.. రాష్ట్రంలోని 17 లోక్‌సభ, 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వివిధ రూపాల్లో పార్టీ కార్యక్రమాల వేగం పెంచాలని రాష్ట్ర నేతలను జాతీయ నాయకత్వం ఆదేశించింది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదు విడతలుగా చేపట్టిన ‘ప్రజా సంగ్రామయాత్ర’ ద్వారా ఇప్పటివరకు 56 అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ చేశారు. మిగతా 63 స్థానాల్లో పాదయాత్ర నిర్వహించేంత సమ యం లేనందున.. రథయాత్రలకు బీజేపీ మొగ్గు చూపింది. ఇందుకోసం 5 ఎన్నికల రథాలను సిద్ధం చేస్తున్నారు. ఒకే దఫాలో రాష్ట్రమంతా పూర్తయ్యేలా.. రాష్ట్రం మొత్తాన్ని ఒకే దఫా పూర్తి చేసేలా ఐదు వైపుల నుంచి ఐదు రథయాత్రలను నిర్వహించాలని బీజేపీ నేతలు నిర్ణయానికి వచ్చారు. ఈ యాత్రల రూట్లు, షెడ్యూల్‌పై చర్చించి త్వరలోనే తుదిరూపు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. వీటితోపాటు ఏప్రిల్ తొలివారంలో రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాల వారీగా కూడా రథయాత్రలు నిర్వహించనున్నారు. ప్రతి లోక్‌సభ స్థానంలో ఒక్కోరోజు ఒక్కో అసెంబ్లీ స్థానం పరిధిలో ఈ యాత్రలు సాగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వీటికి సంబంధించిన రూట్‌మ్యాప్‌లను కూడా త్వరలోనే ఖరారు చేయనున్నట్టు తెలిసింది. మొత్తంగా రాష్ట్రంలోని ఒక్కో లోక్‌సభ స్థానం పరిధిలోని రెండేసి అసెంబ్లీ సీట్లలో సంజయ్ రథయాత్ర నిర్వహించేలా తుది షెడ్యూల్ సిద్ధం చేయనున్నట్టు సమాచారం. యూపీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆరు ప్రాంతాల నుంచి ఒక్కో బృందం 11 జిల్లాల చొప్పున కవర్ చేసేలా ‘జన్‌విశ్వాస్’ రథయాత్రలను నిర్వహించారు. అదే తరహాలో తెలంగాణలోనూ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ యాత్రలలో కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, పార్టీ జాతీయ నాయకులు పాల్గొనేలా పర్యటనల షెడ్యూల్‌లను తయారు చేస్తున్నారు. సీనియర్లంతా రంగంలోకి.. కర్ణాటకతో పాటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై అధినాయకత్వం ఫుల్ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో.. రాష్ట్రంలో ఎన్నికల సమన్వయ బాధ్యతలను అమిత్‌షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్‌సింగ్, స్మృతీ ఇరానీలకు అప్పగించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇకపై వరుసగా కర్ణాటక ప్రచారంలో పాల్గొనే బీజేపీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు, ఇతర జాతీయనేతలు తెలంగాణలోనూ పర్యటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో , ఆ తర్వాత 10 ఉమ్మడి జిల్లాల్లో సభలు, ఏప్రిల్ చివర్లో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రధాని మోదీ బహిరంగసభతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నట్టు సమాచారం. బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ.. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో వెంటనే వివిధ రూపాల్లో కార్యక్రమాలను ఉధృతం చేయాలని జాతీయ నాయకత్వం ఆదేశించింది. వచ్చే ఆరు నెలల పాటు పూర్తిగా ప్రజల్లోనే ఉంటూ.. బీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టాలని రాష్ట్ర ముఖ్య నేతలకు అమిత్‌షా, నడ్డా స్పష్టం చేసినట్టు తెలిసింది. పార్టీ శ్రేణులంతా ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణ ప్రణాళికను, ఎన్నికల రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసుకోవాలని సూచించినట్టు సమాచారం. బీఆర్ఎస్ ప్రభుత్వంపై వివిధ వర్గాల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోవాలని.. రాష్ట్రంలోని ఇతర విపక్షాల తీరును ప్రజలకు వివరించి, బీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నాయమని చాటాలని స్పష్టం చేసినట్టు తెలిసింది. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో బలమైన మోదీ ›ప్రభుత్వం, నాయకత్వం ఉన్నందున ధైర్యంగా ముందుకెళ్లాలని సూచించినట్టు సమాచారం. కలిసి సాగాల్సిందే.. రాష్ట్ర నాయకత్వం మొదలు గ్రామ స్థాయి వరకు ఎలాంటి రాగద్వేషాలకు అవకాశం ఇవ్వకుండా సమష్టిగా, కచి్చతమైన కార్యాచరణ ప్రణాళికలతో ముందుకెళ్లాలని బీజేపీ అధినాయకత్వం రాష్ట్ర నేతలకు స్పష్టం చేసినట్టు తెలిసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం మిషన్–90లో భాగంగా 90 సీట్లు గెలవడమే లక్ష్యంగా అడుగులు వేయాలని పేర్కొన్నట్టు సమాచారం. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు పారీ్టకి రాజకీయంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా మారినందున.. తగిన వ్యూహాలతో, కచి్చతంగా గెలుపొందేలా ముందుకు సాగాలని దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. -
బంద్ ఎఫెక్ట్.. కామారెడ్డిలో హై టెన్షన్!
సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో బంద్ కొనసాగుతోంది. మరోవైపు.. కామారెడ్డికి వచ్చే అన్ని రూట్లను పోలీసులు బ్లాక్ చేశారు. రైతుల ర్యాలీని పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకుంటున్నారు. పోలీసు యాక్ట్ 30 అమలులో ఉందని పోలీసులు చెబుతున్నారు. ఈ క్రమంలో పలువురు రైతు జేఏసీ, కాంగ్రెస్, బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. ఇదిలా ఉండగా.. మాస్టర్ ప్లాన్‌కు నిరసనగా శుక్రవారం కామారెడ్డి నియోజకవర్గంలో బంద్ పాటించాలని రైతు ఐక్య కార్యాచారణ కమిటీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జిల్లావ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. మరోవైపు.. రైతు జేఏసీ నాయకులు విద్యాసంస్థలను మూసివేయించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సైతం జై జవాన్.. జై కిసాన్ అంటూ నినాదాల చేసుకుంటూ విద్యార్థులు బయటకు వచ్చారు. ఇదిలా ఉండగా.. జిల్లాలో బంద్ నేపథ్యంలో కామారెడ్డి బీజేపీ నియోజకవర్గ ఇంఛార్జ్ కాటిపల్లి వెంకట రమణారెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. అనంతరం, బీబీపేట పోలీసు స్టేషన్‌కు తరలించారు. మరోవైపు.. మాస్టర్ ప్లాన్ భూబాధత రైతులకు మద్దతుగా కామారెడ్డిలో బీజేపీ నేతలు బైక్ ర్యాలీ చేపట్టారు. జిల్లా కేంద్రంలో స్వచ్చందంగా వ్యాపారులు షాపులను బంద్ చేయాలని బీజేపీ నేతలు విజ్ఞప్తి చేస్తున్న చేస్తున్నారు. రైతుల భూములపై స్పష్టత ఇచ్చేవరకు ఉద్యమాన్ని ఆపేదిలేదంటున్న బీజేపీ నేతలు కామెంట్స్ చేస్తున్నారు. ఇక, రైతులకు కాంగ్రెస్ నేత షబ్బీర్ మద్దతుగా నిలిచారు. ఈ సందర్బంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. కలెక్టరేట్ దగ్గర రైతుల ఆందోళనను అవమానించారు. మాస్టర్ ప్లాన్ బాధిత రైతులకు కాంగ్రెస్ అండగా ఉంటుంది. మాస్టర్ ప్లాన్‌ను సవరిస్తామని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలి. మాస్టర్ ప్లాన్ పేరుతో ప్రభుత్వం..రైతుల భూములను లాక్కుంటోంది. రైతుల భూముల్లో ఇండస్ట్రియల్ ప్రతిపాదను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. -
హామీలు నెరవేర్చడంలో విఫలమైన ప్రభుత్వం
సాక్షి, ముంబై: మహావికాస్ ఆఘాడీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని, ఇది మాట మీద నిలబడని ప్రభుత్వమని బీజేపీ విమర్శలు గుప్పించింది. ఈ మేరకు ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ బిల్లుల అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. సాతారా, నాగ్‌పూర్, ముంబై తదితర ప్రాంతాల్లో బీజేపీ నాయకులు నిరసనలు చేపట్టారు. సాతారా జిల్లా కరాడ్‌లో నిర్వహించిన ఆందోళనలో మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రకాంత్ మాట్లాడుతూ.. 100 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామి ఇచ్చిందని, అది కూడా నిలబెట్టుకోలేదని ధ్వజమెత్తారు. లాక్డౌన్ సమయంలో ప్రజలందరికీ భారీ ఎత్తున విద్యుత్ బిల్లులు పంపించారని గుర్తుచేశారు. అయితే బిల్లుల్లో రాయితీలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, కానీ, ఇప్పుడు మాట మార్చారని దుయ్యబట్టారు. రాయితీ ఇవ్వలేమని విద్యుత్ బిల్లులు మొత్తం చెల్లించాల్సిందేనని విద్యుత్‌శాఖ మంత్రి స్పష్టం చేశారు. కానీ, ఇచ్చిన హామీల గురించి మాత్రం ఏం మాట్లాడటం లేదన్నారు. లాక్డౌన్ కాలంలో ఆర్థికంగా కుంగిపోయిన పేద ప్రజలు పెంచి ఇచ్చిన విద్యుత్ బిల్లులను ఎలా కడతారని ఆయన ప్రశ్నించారు. బిల్లులను సవరించి ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. రాయితీలు ఇవ్వనంత వరకు బీజేపీ ఆందోళన కొనసాగిస్తుందని చంద్రకాంత్ పాటిల్ హెచ్చరించారు. బంద్ ఉండగా బిల్లులా? నాగ్‌పూర్‌లో బీజేపీ చేపట్టిన ఆందోళనలో మాజీ విద్యుత్ శాఖ మంత్రి చంద్రశేఖర్ బావన్‌కులేతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహావికాస్ ఆఘాడీ ప్రభుత్వంపై నాయకులు మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. లాక్డౌన్ సమయంలో దుకాణాలు, కార్యాలయాలు, మూసి ఉన్నాయని, అయినప్పటికీ లక్షల్లో బిల్లులు పంపారని మండిపడ్డారు. వ్యాపారాలు బంద్ ఉండగా లాండ్రీ, క్షౌరశాలలు ఇతరులు విద్యుత్ బిల్లులు ఎలా కడతారంటూ నిలదీశారు. అందుకే పేద ప్రజల విద్యుత్ బిల్లులు కట్ చేసేందుకు ఎవరైనా వస్తే బీజేపీ అడ్డుకుంటుందని చంద్రశేఖర్ హెచ్చరించారు. ముంబైలో నిర్వహించిన ఆందోళనలో బీజేపీ ముంబై ఇన్చార్జీ అయిన కాందివలి మాజీ ఎమ్మెల్యే అతుల్ భాత్కలకర్ పాల్గొన్నారు. ఆయన కూడా ఆఘాడీ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా రెండు వేల ప్రాంతాల్లో ఆందోళన నిర్వహించినట్టు బీజేపీ నేతలు పేర్కొన్నారు. -
దేశంలో మరో ఎన్నికల సమరం
పాట్నా: బిహార్‌లో ఎన్నికల వేడి మొదలైంది. ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఎన్నికలకు సమాయత్తంగా ఆదివారం రాష్ట్రంలో వర్చువల్ ర్యాలీని బీజేపీ తలపెట్టింది. కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరై ప్రసంగించనున్నారు. ఈ ర్యాలీని ఫేస్బుక్ లైవ్ ద్వారా కూడా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి ర్యాలీకి సుమారు లక్ష మందికిపైగా హాజరయ్యేలా చూడాలని బీజేపీ ప్రణాళిక సిద్ధం చేసింది. అందులో భాగంగానే తలపెట్టిన ఈ వర్చువల్ ర్యాలీ ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పూరించినట్లేనని బిహార్ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ జైశ్వాల్ తెలిపారు. అయితే దీనిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. కాగా.. వర్చువల్ ర్యాలీపై ఇప్పటికే కాంగ్రెస్, ఆర్జేడీ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. దేశం మొత్తం కరోనా మహమ్మారి బారినపడి దిక్కుతోచని స్థితిలో ఉంటే బీజేపీ ఎన్నికల కోసం ఆరాటపడుతోందని విమర్శిస్తున్నారు. 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్‌లో నితీష్ కుమార్‌తో కలిసి మరోసారి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఉవిళ్లూరుతోంది. కాగా.. బిహార్‌లో బీజేపీని మొదటి నుంచి అంటిపెట్టుకొని ఉన్న లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేఎస్పీ) కూడా వలస కూలీల విషయంలో సీఎం నితీష్ పనితీరును బాహాటంగానే విమర్శించింది. ఇలాంటి పరిస్థితుల్లో అమిత్‌షా చేపట్టిన వర్చువల్ ర్యాలీ తమ కూటమి ఐక్యతను చాటిచెప్పేందుకేనని తెలుస్తోంది. అయితే గత ఎన్నికల్లో నితీష్ కుమార్ నేతృత్వంలో ఆర్జేడీ, కాంగ్రెస్, జేడీయూ పార్టీలు కూటమిగా ఎన్నికల బరిలో నిలిచి విజయం సాధించాయి. తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో జేడీయూ కూటమి నుంచి బయటకు వచ్చి బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. -
నేను కుర్చీని లెక్కచేయను : మోదీ
బనస్కాంత (గుజరాత్) : 'నేను రైతుల సంరక్షణ కోసం ఆరాటపడతాను.. నా కుర్చీ కాపాడుకునేందుకు కాదు' అని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఓ సభలో మాట్లాడుతూ 'నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తించిన సమయంలో పఠాన్, బనస్కాంత ప్రాంతానికి చెందిన కొంతమంది రైతులు వచ్చి నన్ను కలిశారు. నేను వారిని వ్యవసాయం మీద దృష్టి సారించాలని చెప్పాను. నా విధానాలు చూసి నేను ఇలాగే ముందుకు వెళ్లిపోతే ఓడిపోవడం ఖాయం అని కొంతమంది చెప్పారు. వారితో అన్నాను.. నేను నా కుర్చీని లెక్క చేయను అని.. నేను రైతులకోసం పనిచేయాలనుకుంటున్నానని, పఠాన్, బనస్కాంత రైతులకోసం పనిచేయాలనుకుంటున్నానని అన్నాను' అని మోదీ చెప్పారు. బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి మధ్య తేడా ఏమిటో గుజరాత్ ప్రజలకు తెలుసని అన్నారు. గుజరాత్లో వరదలు వచ్చిన సమయంలో బీజేపీ వాళ్ల సహాయ చర్యల్లో మునిగి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం బెంగళూరులో సేద తీరారని చెప్పారు. గుజరాత్లో 182 అసెంబ్లీ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. -
హీరో ర్యాలీలో అభిమానుల వీరంగం
పట్నా: బిహార్ అంసెబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ పాల్గొనాల్సిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో అభిమానులతో పాటు పోలీసులు, మీడియా ప్రతినిధులు గాయపడ్డారు. మంగళవారం బిహార్ షరీఫ్‌లో బీజేపీ ఎన్నికల ప్రచార సభకు అజయ్ వస్తారని ప్రచారం చేయడంతో ఆయన్ను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఉదయం 10 గంటలకు రావాల్సిన అజయ్ మధ్యాహ్నం 1 గంటల వరకు రాలేదు. దీంతో అభిమానులు బారికేడ్లు దూకి వీరంగం చేశారు. పోలీసులు వారిని అదుపు చేసేందుకు లాఠీచార్జ్ చేయగా.. అల్లరి మూకలు రాళ్లు రువ్వి బీభత్సం సృష్టించారు. ఈ సమయంలో అజయ్ దేవగన్, ఇతర బీజేపీ నేతలు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అక్కడికి వచ్చింది. అయితే ల్యాండ్ చేసేందుకు పలుమార్లు ప్రయత్నించినా.. గ్రౌండ్లో పరిస్థితులు అనుకూలించలేదు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున అజయ్ దేవగన్ ప్రచారం చేస్తున్నారు. జముయ్, లఖిసరాయ్, నవాడ జిల్లాల్లో జరిగిన ప్రచార సభల్లో ఆయన పాల్గొన్నారు.