టీవీ యాంకర్ అదిరే ఫొటోషూట్!
సినిమాల్లో అవకాశాలు లేకపోయినా.. వరుసగా టీవీ ప్రోగ్రామ్‌లు చేస్తూ తనదైన రీతిలో ప్రతిభ చాటుకుంటోంది శ్రీముఖి. ఇప్పుడు ఆమె చేతిలో బోలెడు టీవీ షోలు ఉన్నాయి. బబ్లీగా ఉంటూ పక్కింటి అమ్మాయిలా అనిపిస్తూ కామెడీ పంచులు వేస్తూ టీవీ షోల్లో అదరగొడుతోంది తను. దీనికితోడు అడపాదడపా సినిమాల్లోనూ కనిపిస్తోంది.
ఇక, శ్రీముఖి సోషల్ మీడియాలోనూ బాగా యాక్టివ్‌గా ఉంటుంది. ఫేస్బుక్లో, ట్విట్టర్లో ఉన్న ఆమె అకౌంట్లకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వారిని మురిపించడానికి ఫొటోలు, డబ్ స్మాష్ వీడియోలు, షోలోని బిట్లను పోస్టు చేస్తూ ఉంటుంది తను. ఇటీవల ఓ అందమైన ఫొటోషూట్‌తో తన అభిమానులను సర్ ప్రైజ్ చేసింది శ్రీముఖి. కంప్లీట్ బ్లాక్ అండ్ వైట్‌లో తీసిన ఈ ఫొటోల్లో చాలా అందంగా మతిపోగొట్టే సోయగాలతో అలరించింది ఈ అమ్మడు. ఆ ఫొటోలు మీకోసం.. ఓ లుక్కేయండి!