బ్లాక్ బాల్ పాయింట్ పెన్‌తోనే టెట్
నేడే పరీక్ష
సాక్షి, హైదరాబాద్: టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) పరీక్షలో బ్లాక్ బాల్ పాయింట్ పెన్నే వాడాలని టెట్ కన్వీ నర్ శేషు కుమారి సూచించారు. ఆది వారం జరగనున్న ఈ పరీక్షకు విద్యా శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1,574 కేంద్రాల్లో పరీక్ష జర గనుండగా.. 3,67,912 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు.
ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్–1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్–2 పరీక్ష జరగనుంది. పేపర్–1కు సం బంధించి ప్రశ్నపత్రం సెట్‌ను ఆదివారం ఉదయం 6 గంటలకు, పేపర్–2 ప్ర శ్నపత్రం సెట్‌ను ఉదయం 11 గంటలకు పరీక్ష కేంద్రాలకు అందించనున్నారు.