Black board
-
సస్పెన్స్ థ్రిల్లర్
తల్లాడ సాయికృష్ణ, శిరీషా రావ్, విజయ్ దేశిని ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘బ్లాక్ బోర్డ్’. తల్లాడ సాయికృష్ణ హీరోగా నటించి, దర్శకత్వం వహించారు. శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ పతాకంపై తల్లాడ శ్రీ లక్ష్మీ నిర్మాణ సారధ్యంలో తల్లాడ శ్రీనివాస్ నిర్మించారు. ‘బ్లాక్ బోర్డ్’ ట్రైలర్‌ని హీరో ప్రిన్స్ విడుదల చేసి, సినిమా మంచి విజయం సాధించాలన్నారు. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ–‘‘సాయికృష్ణని మెచ్చుకోవడం కంటే ముందు వాళ్ల నాన్నని అభినందించాలి. పిల్లల అభిప్రాయాన్ని గౌరవించి వారి భవిష్యత్ కోసం సినిమా నిర్మించడం గర్వించదగ్గ విషయం’’ అన్నారు. ‘‘పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు తల్లాడ శ్రీనివాస్. ‘‘సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన యాక్షన్ సినిమా ఇది’’ అన్నారు సాయికృష్ణ. -
దూళి పీల్చే డస్టర్..కొత్త ఆవిష్కరణ
బ్లాక్ బోర్డును తుడిచే సమయంలో తరగతి గదిలో వ్యాపించే సుద్దముక్కల ధూళితో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఇబ్బంది పడటం చూస్తూనే ఉంటాం. సుద్దముక్కల తయారీలో వాడే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, కాల్షియం కార్బొనేట్ల వల్ల వీరు ఊపిరి తిత్తులు, కళ్లకు సంబంధించిన వ్యాధుల బారిన పడుతూ ఉంటారు. దీన్ని నివారించడానికి విజ్ఞాన్ వర్సిటీ ఎంటెక్ విద్యార్థి ఆరాధ్యుల తిరుమల వాసు సరికొత్త డస్టర్‌ను రూపొందించారు. ఈ డస్టర్‌లో రోలర్, దూది వస్త్రం, మూసి ఉన్న సిలిండ్రికల్ చాంబర్, బ్రష్‌లు, బేరింగ్లు ఉంటాయి. సిలిండర్‌లో బ్రష్‌లను అమర్చి బేరింగ్ల సాయంతో దీనికి రోలర్‌ను బిగించారు. రోలర్ చుట్టూ దూది వస్త్రాన్ని చుట్టారు. దీనివల్ల బ్లాక్‌బోర్డుపై డస్టర్‌ను ఊడ్చే సమయంలో రోలర్ వృత్తాకారంలో తిరుగుతుంది. దీనికి సమాంతరంగా ఉన్న బ్రష్‌లు డస్ట్‌ను తొలగిస్తూ ఉంటాయి. దీనివల్ల డస్ట్ మొత్తం లోపలే ఉండిపోతుంది. డస్టర్ రూపొందించిన తిరుమల వాసుకు గురువారం విజ్ఞాన్ యూనివర్సిటీ క్యాంపస్‌లో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ సి. తంగరాజ్ మాట్లాడుతూ ఈ డస్టర్‌ను రూపొందించడం చాలా తేలికని, ఖరీదు కూడా మామూలు డస్టర్ కంటే తక్కువగా ఉంటుందన్నారు. ఈ డస్టర్‌కు మేధో హక్కుల కోసం దరఖాస్తు చేసినట్లు వీసీ తెలిపారు. వర్సిటీ చైర్మన్ లావు రత్తయ్య, వైస్‌చైర్మన్ శ్రీకృష్ణదేవరాయలు, రెక్టార్ బి.రామ్మూర్తి, రిజిస్ట్రార్ ఎం.ఎస్.రఘునాథన్ తదితరులు వాసుకు అభినందనలు తెలిపారు. -
త్వరలో ఎఫ్ఓపీ విధానం బ్లాక్ బోర్డుకిక గుడ్‌బై!
న్యూఢిల్లీ: ఆన్లైన్ ప్రవేశాలకు ఈ ఏడాది వచ్చిన స్పందనతో ఉక్కిరిబిక్కిరైన ఢిల్లీ విశ్వవిద్యాలయం (డీయూ) అనుబంధ స్కూల్ ఆఫ్ ఓపెన్ లెర్నింగ్ (ఎస్ఓఎల్) తన బోధనా విధానాలను మరింత మెరుగుపరుచుకోవాలని నిర్ణయించింది. పర్సనల్ కాంటాక్ట్ ప్రోగ్రాం కింద ‘ఫ్లిప్డ్ క్లాస్‌రూం టెక్నాలజీ (ఎఫ్‌సీటీ)’ని అందుబాటులోకి తీసుకురానుంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశాల మేరకు బ్లాక్ బోర్డు బోధనా విధానానికి వీలైనంతమేర స్వస్తి పలకనుంది. ‘ఫ్లిప్డ్ క్లాస్‌రూం టెక్నాలజీ’ విధానంలో విద్యార్థి తమకు అనుకూలమైన సమయంలో బోధనా తరగతులకు హాజరు కావొచ్చు. ఈ విషయమై ఎస్ఓఎల్ సంచాలకుడు సీఎస్ దూబే మాట్లాడుతూ ఆన్లైన్ ప్రవేశాలకు ఈ ఏడాది విశేష స్పందనలభించిందన్నారు. మొత్తం లక్షమంది విద్యార్థులు చేరారని, అందులో సగం మంది ఆన్లైన్ ద్వారా ప్రవేశాలు పొందినవారేనన్నారు. ఆన్లైన్ద్వారానే తాము ఎగ్జామినేషన్ అడ్మిట్ కార్డులను కూడా అందజేస్తున్నామన్నారు. ఎస్ఓఎల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు విశ్వవిద్యాలయానికి చెందిన సహవిద్యార్థుల మాదిరిగా ఎక్కువ సమయం కేటాయించలేకపోతున్నారన్నారు. వారు ఏదో ఒక పాక్షిక సమయ ఉద్యోగం చేస్తుండడమో లేదా పరిమితులు ఉండడమో జరుగుతోందన్నారు. తాము అందుబాటులోకి తీసుకురానున్న అత్యాధునిక సాంకేతిక విధానం వల్ల ఎస్ఓఎల్ విద్యార్థులు తమ తమ అధ్యయన కేంద్రాలకు వచ్చే అవసరాన్ని తగ్గించేస్తుందన్నారు. వీరంతా తమ ఇంటి వద్దనుంచే అంతర్జాలాన్ని వినియోగించుకుని వీడియో తరగతులకు హాజరవుతారన్నారు. లేదా తమకు అనుకూలమైన సమయంలో లెక్చరర్ల బోధనలను ఆలకిస్తారన్నారు. కాగా ఈ ఏడాది చివరినాటికల్లా ఆయా కోర్సులకు సంబంధించిన సామగ్రి/వీడియోలను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని ఎస్ఓఎల్ యోచిస్తోంది. అదే సమయానికల్లా ‘ఫ్లిప్డ్ క్లాస్‌రూం టెక్నాలజీ (ఎఫ్‌సీటీ)’ని అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. అయితే ఎస్ఓఎల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులందరికీ ఇంటర్నెట్ వెసులుబాటు ఉండకపోవడంగానీ లేదా వారికి దానిపై ఆసక్తి లేకపోవడంగానీ జరగకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ విధానం కింద చేరిన విద్యార్థులకు రెండు ఆప్షన్లు ఉంటాయన్నారు. వారికి సాఫ్ట్కాపీగానీ లేదా హార్డ్ కాపీనిగానీ అందజేస్తామన్నారు.ఈ అంశంపై శనివారంనాటి ఎస్ఓఎల్ పాలకమండలి సమావేశంలో చర్చ జరిగిందని, పాఠ్యపుస్తకాల కంటే విద్యార్థులకు డీవీడీలు ఇవ్వడమే ఉత ్తమమని ఆ సమావేశంలో ఉన్నతాధికారులు నిర్ణయిం చారని ఆయన వివరించారు.