Black skin
-
Dark Skin: షియాబట్టర్, అలోవీరా ఉండే మాయిశ్చరైజర్ రోజూ రాసుకుంటే!
సాధారణంగా దుస్తులు కప్పి ఉంచే భాగాలు మంచి నిగారింపుతోనూ, కప్పి ఉంచని భాగాల్లో అంటే చేతులు, ముఖం మరీ నల్లగానూ ఉండటం మామూలే. కానీ కొన్ని దుస్తులు ధరించినప్పుడు ఈ తేడా ఎక్కువగా కనిపిస్తుండటంతో యువతీ యువకులు మరీ ముఖ్యంగా టీనేజీలో ఉన్నవారు బాధపడుతుంటారు. సూర్యకాంతికి ఎక్స్పోజ్ అయ్యే భాగాలు అల్ట్రా వయొలెట్ కిరణాల కారణంగా కొద్దిగా డార్క్‌గా మారుతుంది. అయితే కొద్దిపాటి జాగ్రత్తలతో సూర్యకాంతికి ఎక్స్పోజ్ అయ్యే భాగాలు మరీ నల్లగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. సూర్యకాంతికి ఎక్స్పోజ్ అయ్యే భాగాలు తేమను కోల్పోకుండా మెరుస్తూ, మంచి నిగారింపుతో ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ►ఎండకు ఎక్స్పోజ్ అయ్యే ప్రాంతంలో చర్మానికి... షియాబట్టర్, అలోవీరా, గ్లిజరిన్ ఉండే మాయిశ్చరైజర్ పూసుకోవడం మంచిది. ►బయటికి ఎక్స్పోజ్ అయ్యే శరీర భాగాలు... అంటే ముఖం, మెడ, వీపుపైభాగం, చేతులు, కాళ్లు వంటి చోట్ల 50 ఎస్పీఎఫ్ ఉండే బ్రాడ్‌స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్‌ను ప్రతి మూడుగంటలకోసారి రాసుకుంటూ ఉండాలి. ఆరుబయట ఎండలో ఉన్నంతసేపు ఈ జాగ్రత్త తీసుకోవాలి. ►గ్లైకోలిక్ యాసిడ్ 6%, ఆర్బ్యుటిన్, కోజిక్యాసిడ్ ఉన్న క్రీములను రాత్రివేళల్లో చర్మంపై పూసుకోండి. ►ఫుల్స్లీవ్స్ దుస్తులు తొడుగుతున్నప్పుడు ఆ భాగాలు మిగతాచోట్ల కంటే ఎక్కువ నిగారింపుతోనూ, ఫెయిర్‌గానూ ఉండటం తెలిసిందే. అందుకే మామూలు సమయాల్లో వీలైనంతవరకు ఫుల్స్లీవ్స్ ధరిస్తూ... ఏదైనా ప్రత్యేకమైన సందర్భం ఉన్నప్పుడు టీ–షర్ట్స్ వేసుకుంటే... ఫుల్స్లీవ్స్ వల్ల నిగారింపుతో ఉన్న భాగాలు మెరుస్తూ ఆకర్షణీయంగా కనిపిస్తుంటాయి. ►ఈ సూచనల తర్వాత కూడా ఎండకు ఎక్స్పోజ్ అయ్యే భాగాలు, మిగతా భాగాల్లో తేడా ఇంకా ఎక్కువ డార్క్గానే ఉన్నట్లయితే ఒకసారి డర్మటాలజిస్ట్‌ను సంప్రదించడం మేలు. వారు కెమికల్ పీలింగ్ వంటి ప్రక్రియలతో ఈ తేడాను సరిచేస్తారు. చదవండి: Tomato Fever: ఒళ్లంతా దురద.. జ్వరం, అలసట.. టొమాటో ఫీవర్ అంటే? -
నేను నలుపే.. కానీ నా ఆలోచనలు తెలుపు: సీఎం
న్యూఢిల్లీ: 200 ఏళ్ల తెల్ల వారి పాలనలో మగ్గిన ఫలితమో.. లేక పాశ్చత్య సంస్కృతి మీద మోజో తెలీదు కానీ మన వారికి తెల్లని శరీర ఛాయ అంటే మహా మోజు. నల్లగా ఉన్న వారిని అంటరాని వారిగా చూస్తారు. శాస్త్ర సాంకేతికపరంగా ఎంత ఎదిగినా.. సంస్కారం పరంగా మరింత దిగజారిపోతున్నాం. ఇక నల్లని శరీర ఛాయ ఉన్న వారు ఎదుర్కొనే అవమానాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీరిలో సామాన్యుల నుంచి సెలబ్రిటీలు కూడా ఉన్నారు. తాజాగా ఈ జాబితాలోకి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేరారు. పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ఆమ్ ఆద్మీ పార్టీని ఉద్దేశించి.. నల్ల ఆంగ్లేయులు అని సంబోధించాడు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. (చదవండి: ప్రతి మహిళకు నెలకు రూ.వేయి ఇస్తాం.. సీఎం ప్రకటన) వచ్చే ఏడాది పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బరిలో దిగేందుకు ఆప్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య రాజకీయ ఆరోపణలు చేసుకుంటున్నాయి. దానిలో భాగంగా పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ బుధవారం ప్రసంగిస్తూ.. ‘‘కేజ్రీవాల్ చర్మం రంగు నలుపు. కానీ ఆయన తన ఆలోచనలు న్యాయపరమైనవని చెప్పడానికి తెగ ప్రయత్నిస్తున్నారు. 2022లో గెలవడానికి నల్ల ఆంగ్లేయులు తెగ ప్రయత్నిస్తున్నారు’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. (చదవండి: గతంలో నేనూ ఆటో డ్రైవర్‌నే.. పెండింగ్ చలాన్లు రద్దు చేస్తా: సీఎం) చన్నీ వ్యాఖ్యలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ‘‘నేను నలపు కావొచ్చు. కానీ నా ఆలోచనలు మాత్రం తెలుపు.. అంటే స్వచ్ఛంగా ఉంటాయి’’ అని తెలిపారు. తిరంగ యాత్రలో భాగంగా పఠాన్‌కోటలో పర్యటిస్తున్న కేజ్రీవాల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘నేను వారికి (కాంగ్రెస్) ఒక విషయం సూటిగా చెప్పాలనుకుంటున్నాను. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే సాధారణ దుస్తులు ధరించి, నల్లగా ఉన్న వ్యక్తి అన్ని హామీలను నెరవేరుస్తాడని తెలుపుతున్నాను. నేను తప్పుడు ప్రకటనలు, తప్పుడు వాగ్దానాలు చేయను’’ అని తెలిపారు. చదవండి: మీకు నేనున్నా.. హామీ ఇస్తున్నా: కేజ్రీవాల్ -
నల్లబడ్డ చర్మం నార్మల్‌గా మారాలంటే..!
స్కిన్ కౌన్సెలింగ్ నా వయసు 35 ఏళ్లు. ప్రతిరోజూ టూ వీలర్ మీద ఎండలో చాలా దూరం ప్రయాణం చేస్తుంటాను. ఎండకు ఎక్స్పోజ్ అవుతున్న రెండు చేతులు చాలా నల్లగా (డార్క్‌గా) అవుతున్నట్లు గుర్తించాను. అలాగే ముఖం, కాళ్లు, మెడ భాగం కూడా నల్లగా మారుతున్నాయి. దుస్తులు కప్పుతున్న భాగంలోనూ, మిగతా భాగాల్లోనూ చర్మం రంగుకు చాలా తేడా ఉంది. ఈ నలుపు తగ్గాలంటే ఏం చేయాలో చెప్పండి. - సురేశ్‌కుమార్, విశాఖపట్నం మీరు ఎండలో చాలా ఎక్కువ సేపు ప్రయాణం చేస్తుండటం వల్ల దుస్తులు కప్పి ఉంచని భాగాల్లో మీ చర్మం దెబ్బతింటోంది. ఒకేసారి కాకుండా క్రమంగా జరిగిన పరిణామమిది. మీ చర్మానికి జరిగిన నష్టాన్ని తగ్గించడానికి చేయాల్సినవి... భౌతికంగా జరిగే నష్ట నివారణ కోసం... * వీలైనంత వరకు చర్మాన్ని పూర్తిగా కప్పి ఉంచేలా దుస్తులు ధరించండి. పాదాలకు సాక్స్ ధరించండి. దీంతో నేరుగా మీకు ఎండ వల్ల కలిగే నష్టం సంభవించదు. * శరీరం ఎండకు ఎక్స్పోజ్ అయ్యే భాగాల్లో 50 కంటే ఎక్కువ ఎస్పీఎఫ్ ఉన్న సన్‌స్క్రీన్ రాయండి. మీరు బయటకు వెళ్లడానికి 20 నిమిషాల ముందు ఇది రాసుకోండి. ఇదే ప్రక్రియ ప్రతి మూడు గంటలకు ఒకసారి చేయండి. చికిత్స పరంగా చేయాల్సినవి... * డాక్టర్‌ను కలిసి ప్రతిరోజూ భోజనం తర్వాత తీసుకోవాల్సిన యాంటీఆక్సిడెంట్ ట్యాబ్లెట్లను ప్రిస్క్రయిబ్ చేయించుకోండి. వాటిని మూడు నెలలు కొనసాగించండి. * కనీసం నెల రోజుల పాటు విటమిన్-సి టాబ్లెట్లను వాడండి. శాండల్‌వుడ్ కలిగి ఉండే సబ్బులకు, క్రీమ్స్‌కు దూరంగా ఉండండి. మైల్డ్ అలోవీరా, షియాబటర్ ఉన్న షవర్ జెల్ వాడండి. ప్రతిరోజూ స్నానం తర్వాత కోకోబటర్, విటమిన్-ఈ కలిగి ఉన్న మాయిష్చరైజర్లను వాడండి. ప్రతి రోజూ రాత్రిపూట... విటమిన్-సి, విటమిన్-ఈ, లికోరైస్, కోజిక్ యాసిడ్, టెట్రా హైడ్రోకర్క్యుమిన్, అర్బ్యుటిన్ వంటి స్కిన్లెటైనింగ్ ఏజెంట్స్ కలిగి ఉన్న క్రీమ్‌ను చర్మం నల్లబారిన చోట ఒంటిపై రాసుకోవాలి. * ఒకవేళ నలుపు మరీ ఎక్కువగా ఉంటే కెమికల్ పీలింగ్ వంటి ప్రక్రియలను కనీసం 3 - 6 సెషన్లు చేయించుకోవాలి. లేదా లేజర్ టోనింగ్‌ను ఆరు సెషన్లు చేయించవచ్చు. లేదా మైక్రోడెర్మాబ్రేషన్ ప్రక్రియను ఎనిమిది సెషన్లు చేయించుకోవాలి. ఒకవేళ అప్పటికీ చర్మం రంగు మారకపోతే ఫ్రాక్షనల్ లేజర్ ప్రక్రియ చేయించుకోవచ్చు. ఈ చికిత్స ప్రక్రియలను అనుసరించాక కూడా కొంతకాలం పాటు మెయింటెనెన్స్ సెషెన్స్ కూడా అవసరమవుతాయి. కెమికల్ పీలింగ్ ప్రక్రియ ప్రతి మూడు మాసాలకు ఒకసారి, లేజర్ ప్రక్రియ ప్రతి రెండు మాసాలకు ఒకసారి చేయించుకోవాలి. ఆహారపరమైన జాగ్రత్తలు ఇవి... * మేని సంరక్షణలో ఆహారం కీలకమైన పాత్ర పోషిస్తుంది. మీ ఆహారంలో క్యారట్, బీట్రూట్, కాప్సికమ్ (ఎల్లో అండ్ రెడ్), బొప్పాయి, అవకాడో, టొమాటో, ఉసిరి వంటి పోషకాలు ఉండే ఆహారం తీసుకోవాలి. * పైన పేర్కొన్న వాటితో పాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చర్మం ఆరోగ్యానికి ఎంతైనా అవసరం. - డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ డర్మటాలజిస్ట్, త్వచ స్కిన్ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్