black widow
-
Black Widow Review: ఓటీటీలో కళ్లు చెదిరే స్పై యాక్షన్ థ్రిల్లర్.. ఎలా ఉందంటే?
టైటిల్: బ్లాక్ విడోనటీనటులు: స్కార్లెట్ జాన్సన్, ఫ్లోరెన్స్ పగ్, డేవిడ్ హార్బర్ తదితరులుదర్శకుడు: కేట్ షార్ట్ల్యాండ్నిర్మాత: కెవిన్ ఫీగేసంగీత దర్శకుడు: లోర్న్ బాల్ఫ్సినిమాటోగ్రఫీ: గాబ్రియెల్ బెరిస్టెన్ఎడిటర్: లీ ఫోల్సమ్ బోయ్డ్, మాథ్యూ ష్మిత్ఓటీటీ: డిస్నీ హాట్‌స్టార్(2021లో థియేటర్లలో రిలీజైంది)కథేంటంటే..బ్లాక్ విడో అదే పేరుతో ఉన్న మార్వెల్ కామిక్ క్యారెక్టర్ ఆధారంగా రూపొందించిన సూపర్ హీరో చిత్రం. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్, వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిచర్స్లో ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. కేట్ షార్ట్‌ల్యాండ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో స్కార్లెట్ జాన్సన్ టైటిల్ పాత్రలో నటించారు. కెప్టెన్ అమెరికా సివిల్ వార్ సంఘటనలతో ఈ చిత్రం ప్రారంభం అవుతుంది. ఈ మూవీ ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఓటీటీలో అందుబాటులో ఉంది. మరి ఈ లేడీ-ఓరియెంటెడ్ సూపర్ హీరో సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.ఎలా ఉందంటే..ఈ మూవీ అంతా కూడా అంతుకుముందు మనకు అవెంజర్స్ సిరీస్‌లాగా ఉన్న స్టోరీలానే అనిపిస్తుంది. రష్యాకు చెందిన ఓ విలన్(డేవిడ్ హార్బర్) ముఖ్యంగా అనాథ అమ్మాయిలను కిడ్నాప్ చేసి వారిని.. ఒక సైన్యంలా తయారు చేస్తాడు. తాను చెప్పినట్లు నడుచుకునేలా వాళ్ల బ్రెయిన్‌ను మారుస్తాడు. ఆ తర్వాత అమెరికాలోని రహస్యాన్ని తెలుసుకునేందుకు ఒక ఫేక్ కుటుంబాన్ని సృష్టిస్తాడు. ఆ తర్వాత ఆ కుటుంబంలోని వాళ్లను మొత్తం విడదీస్తాడు. ఆ తర్వాత ఆ ఇద్దరు పిల్లలను మళ్లీ తన సైన్యంలోనే చేర్చుకుంటాడు. ఆ తర్వాత అందులో ఉన్న స్కార్లెట్ జాన్సన్(బ్లాక్ విడో) బయటికి వచ్చి అతనితో పోరాటం చేస్తుంది. తన మిత్రులు మరికొందరితో కలిసి అతన్ని అంతం చేసేందుకు యత్నిస్తుంది. మరి అసలు అతని నుంచి అనాథ అమ్మాయిలను కాపాడిందా? ఆ విలన్‌ను అంతం చేసిందా? అనే ఆసక్తికర అంశాలు తెలియాలంటే బ్లాక్ విడో చూడాల్సిందే.ఈ స్పై థ్రిల్లర్ సినిమాలో ఫైట్ సీక్వెన్స్‌లు, విఎఫ్ఎక్స్ వర్క్స్ ఆడియన్స్‌ను మాత్రమే ఆకట్టుకుంటాయి. అక్కడక్కడా కొన్ని ట్విస్టులు కూడా ఫర్వాలేదనిపించాయి. ఒక్క ట్విస్ట్ మాత్రం సర్ప్రైజింగా ఉంటుంది. అయితే ఈ కథలో స్క్రీన్ ప్లేను అద్భుతంగా తెరకెక్కించడంలో డైరెక్టర్ కేట్ షార్ట్‌ల్యాండ్ విఫలమయ్యాడు. ఆడియన్స్‌కు ఎమోషనల్ కనెక్ట్ అయ్యే సీన్స్ ఎక్కడా కూడా కనిపించవు. విజువల్ పరంగా ఆకట్టుకున్నా.. ఎమోషనల్‌గా కనెక్ట్ కాకపోవడం పెద్ద మైనస్. దర్శకుడు కేట్ షార్ట్‌ల్యాండ్ కథను ఇంకా బాగా రాసుకుంటేనే బాగుండేది. కేవలం యాక్షన్ సీన్స్, వీఎఫ్ఎక్స్ కోసమైతే ఈ బ్లాక్ విడో మూవీని ట్రై చేయొచ్చు.ఎవరెలా చేశారంటే..బ్లాక్ విడో పాత్రలో స్కార్లెట్ జాన్సన్ యాక్షన్ సీన్స్‌లో అద్భుతంగా నటించారు. ఆమె తన సూపర్ హీరో హోదాకు న్యాయం చేశారు. ఫ్లోరెన్స్ పగ్, డేవిడ్ హార్బర్ తన పాత్రల్లో మెప్పించారు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లో మెప్పించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో పాటు సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. వీఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్, వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. -
తనకు తానే పోటీ.. ఆస్కార్ బరిలో ఏకంగా 4 మార్వెల్ చిత్రాలు
4 MCU Movies In Oscar Shortlist Under Visual Effects Category: మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) హాలీవుడల్ చిత్రాల నిర్మాణ సంస్థ అంటే అంతగా అందరికి తెలియకపోవచ్చు. కానీ ఐరన్ మ్యాన్ సిరీస్, కెప్టెన్ అమెరికా, ది అవెంజర్స్, ఎండ్ గేమ్ చిత్రాలంటే మాత్రం తెలియని వారుండరు. ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందాయి ఈ సినిమాలు. అయితే ఈ సినిమాలన్నింటిన్నీ నిర్మించిందే మార్వెల్ సంస్థ. హై బడ్జెట్లో విజువల్ వండర్స్‌తో అద్భుతాలు సృష్టించడంలో ఎక్కడా రాజీ పడలేదు ఈ సంస్థ. తాజాగా ఈ సంస్థ నిర్మించిన సూపర్ హీరో మూవీ 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' డిసెంబర్ 16 (ఇండియాలో)న విడుదలై కలెక్షెన్లతో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే ఇటీవల 94వ ఆస్కార్ అవార్డుల విభాగాలను కుదించి 10కి నిర్ణయించింది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. ఆ జాబితాలో విజువల్ ఎఫెక్ట్స్ ఒకటి. ఈ జాబితా ప్రకారం మార్వెల్ చరిత్ర సృష్టించే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఈ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఉన్న 4 సినిమాలు మార్వెల్ సంస్థ నిర్మించినవే. ఈ కేటగిరీలో మొత్తంగా షార్ట్ లిస్ట్ చేసిన 10 చిత్రాల్లో ఏకంగా 4 సినిమాలు మార్వెల్ సంస్థకు సంబంధించినవి ఉండటం విశేషం. అవి 1. బ్లాక్ విడో 2. ఎటర్నల్స్ 3. షాంగ్ చి అండ్ ది లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్ 4. స్పైడర్ మ్యాన్: నో వే హోమ్. అంటే విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో తనకు తానే పోటీ పడనుంది మార్వెల్ సంస్థ. Presenting the 94th #Oscars shortlists in 10 award categories: https://t.co/BjKbvWtXgg pic.twitter.com/YtjQzf9Ufx — The Academy (@TheAcademy) December 21, 2021 అయితే ఇప్పటివరకు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఆస్కార్ పొందిన చిత్రం 'బ్లాక్ పాంథర్' ఒక్కటే. 2018లో వచ్చిన ఈ సినిమా మూడు ఆస్కార్లను గెలుచుకుంది. రేన్ కూగ్లర్ తెరకెక్కించిన ఈ సినిమా బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ విభాగాల్లో ఆస్కార్‌ను చేజిక్కిచ్చుకుంది. సాంకేతిక విభాగంలో 2010 సంవత్సరానికి గాను ఐరన్ మ్యాన్ 2, 2012కు గాను ది అవేంజర్స్ సినిమాలు అకాడమీ అవార్డ్స్‌కు నామినేట్ అయ్యాయి. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో 2014కు సంవత్సరానికి గాను ఎంసీయూ చిత్రం 'గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ', 'కెప్టెన్ అమెరికా: ది వింటర్ సోల్జర్' సినిమాలు చివరిసారిగా నామినేట్ అయ్యాయి. మరీ ఈసారి విజువల్ ఎఫెక్ట్స్‌కు నామినేట్ అయిన మార్వెల్ 4 చిత్రాలు ఆస్కార్‌ను సాధిస్తాయో చూడాలంటే ఫిబ్రవరి వరకు ఆగాల్సిందే. ఇదీ చదవండి: ఆస్కార్ అవార్డ్స్: తుది జాబితాలో నిలిచిన 10 విభాగాలు ఇవే.. -
సినిమాల విడుదల తేదీలన్నీ తారుమారు
హాలీవుడ్లో భారీ బడ్జెట్ సినిమాలన్నింటికీ షూటింగ్ ప్రారంభించక ముందే దాదాపు విడుదల తేదీ ప్రకటిస్తుంటారు. సీజన్లు, మార్కెట్లు అన్నీ లెక్క చూసుకుని తేదీ ఫిక్స్ చేస్తారు.. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు తమ సినిమాల విడుదల తేదీలను క్యాలెండర్లో బ్లాక్ చేసుకుంటాయి... ఇక ఏ మార్పు ఉండదన్నట్టుగా. కానీ కరోనా వల్ల హాలీవుడ్ చిత్రాల విడుదల తేదీలన్నీ తారుమారయ్యాయి. ఈ అనిశ్చితి ఎందాకో తెలియక ఒక్కొక్కటిగా సినిమాలు వెనక్కి వెళ్తున్నాయి. విడుదల తేదీలకు వీలైనంత దూరం పాటిస్తున్నాయి. కొత్త సినిమాలు తెరల్ని తాకడానికి సంకోచిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు వాయిదా పడ్డాయి. తాజాగా మరికొన్ని సినిమాల విడుదల తేదీల్ని మార్చారు. ఆ కబుర్లు. కరోనా ఉన్నప్పటికీ థియేటర్స్‌ను తెరిచి ప్రేక్షకులను రప్పించాలనుకున్నాయి హాలీవుడ్ నిర్మాణ సంస్థలు. ఈ నేపథ్యంలో క్రిస్టోఫర్ నోలన్ తీసిన భారీ చిత్రం ‘టెనెట్’ను విడుదల చేశారు. కానీ ఈ సినిమా కలెక్షన్లు ఆశించినంత లేకపోవడం, పూర్తి స్థాయిగా థియేటర్స్ తెరుచుకోకపోవడంతో నిర్మాతలు వెనక్కి తగ్గారు. విడుదల తేదీలను మార్చేసుకుంటున్నాయి నిర్మాణ సంస్థలు. బ్లాక్ విడో మార్వెల్ సూపర్ హీరో సినిమాలను చూసేవాళ్లకు బ్లాక్ విడో పరిచయం అక్కర్లేదు. ‘అవెంజర్స్’ బృందంలో ఒక కీలక పాత్రధారి. తాజాగా ఈ బ్లాక్విడోకు సంబంధించిన కథతో సోలో సూపర్‌హీరో మూవీతో వస్తున్నారు హాలీవుడ్ బ్యూటీ స్కార్లెట్ జాన్సన్. ఈ సినిమా ఈ ఏడాది నవంబర్ 6న విడుదల కావాలి. కానీ బ్లాక్‌విడో ఆ రోజు రావడంలేదు. వచ్చే ఏడాది మే7న విడుదల కానుంది. వెస్ట్ సైడ్ స్టోరీ హాలీవుడ్ దర్శకధీరుడు స్టీవెన్ స్పీల్బర్గ్ మ్యూజికల్ బ్యాక్‌డ్రాప్ తప్ప దాదాపుగా అన్ని జానర్లలో సినిమాలు తెరకెక్కించారు. మొదటిసారిగా ‘వెస్ట్ సైడ్ స్టోరీ’ టైటిల్‌తో ఓ మ్యూజికల్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 18న విడుదల కావాలి. అయితే ఏకంగా ఏడాదికి వాయిదా వేశారు. వచ్చే ఏడాది డిసెంబర్ 10న థియేటర్స్‌లోకి రానుంది. డెత్ ఆన్ ది నైల్ ‘ది డెత్ ఆన్ ది నైల్’ నవల ఆధారంగా అదే పేరుతో ఓ హాలీవుడ్ చిత్రం తెరకెక్కింది. మార్గట్ రాబీ, గాల్ గాడోట్ ముఖ్య పాత్రల్లో నటించారు. హిందీ నటుడు అలీ ఫాజల్ ఓ కీలక పాత్ర చేశారు. ఈ సినిమా వచ్చే నెల అక్టోబర్ 23న విడుదల కావాలి. ఇప్పుడు డిసెంబర్ 18కి వాయిదా పడింది. ఎటర్నల్స్ – షాంగ్ చీ మార్వెల్ నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న ‘ఎటర్నల్స్, షాంగ్ చీ’ చిత్రాలు కూడా కొన్ని నెలల పాటు వాయిదా పడ్డాయి. ఏంజెలినా జోలీ, రిచర్డ్ మాడన్ ముఖ్య పాత్రల్లో నటించిన ‘ఎటర్నల్స్’ వచ్చే ఏడాది ఫి్ర» వరి12న విడుదల కావాలి. ఇప్పుడు నవంబర్ 5కి వాయిదా వేశారు. అలాగే ‘షాంగ్ చీ’ చిత్రం 2021 మే 7 నుంచి 2021 జూలై 2కి వాయిదా పడింది. మరి కొత్తగా ప్రకటించిన తేదీల్లో అయినా సినిమాలు థియేటర్లకు వస్తాయా? పరిస్థితి ఇంతే ఉంటే మళ్లీ తేదీలు అటూ ఇటూ అవుతాయా? వేచి చూడాలి. -
భారీ హీరోల టీజర్లకు యూట్యూబ్ షాక్!
నచ్చిన హీరో కొత్త సినిమా స్టార్ట్ అయినప్పటీ నుంచి విడుదలయ్యేవరకు అభిమానులు చేసే హడావుడి అంతా ఇంతా కాదు. సినిమా టీజర్, ట్రైలర్లు విడుదలైతే చాలు కొందరు వీరాభిమానులు వాటిని ఒకటికి పదిసార్లు చూస్తూ మురిసిపోతుంటారు. తమ హీరో ట్రైలర్‌కు భారీ వ్యూస్ తీసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. అలాగే వాటిని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసి.. హీరోలపై తమ అభిమానాన్ని చాటుకుంటారు. వాటికి విస్తృతమైన ప్రచారం కల్పిస్తారు. అయితే యూట్యూబ్‌లో అదేపనిగా అభిమాన హీరోల చిత్రాల టీజర్లు చూసేవారికి ఆ సంస్థ షాకిచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మార్వెల్ తెరకెక్కిస్తున్న బ్లాక్ విడో సినిమా టీజర్‌ను పదేపదే చూస్తున్న ఓ నెటిజన్‌కు యూట్యూబ్ హెచ్చరిక జారీచేసింది. మీరు ఇప్పటికే 28,763 సార్లు ఈ వీడియోను చూసినందున్న.. మరోసారి దానిని ప్రదర్శించలేకపోతున్నామని తెలిపింది. ఇందుకు సంబంధించిన స్ర్కీన్ షాట్ ఆ సంస్థ ఫేస్బుక్లో షేర్ చేసింది. ఇకపై యూట్యూబ్‌లో ఒకే వీడియోను పదేపదే చూసేవారికి ఇదేరకమైన పరిస్థతి ఎదురయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత్‌లో పెద్ద హీరోల సినిమాలకైతే కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్ వస్తుంటాయి. ఒకవేళ యూట్యూబ్ ఈ నిబంధనను అమలు చేస్తే.. పెద్ద హీరోల సినీ టీజర్లకు షాక్ తప్పదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
భర్తలను చంపి.. రూ.53 కోట్లు వెనకేసింది!
వరుసపెట్టి పెళ్లిళ్లు చేసుకోవడం.. ఆ భర్తలను హతమార్చి, వారి పేరుమీద ఉన్న బీమా సొమ్మును తీసుకోవడం అలవాటుగా మార్చుకుందో మహిళామణి. సమాగమం తర్వాత తన మగ భాగస్వామిని చంపేసే అలవాటుండే సాలీడు పేరుమీద ఇలాంటి వాళ్లను 'బ్లాక్ విడో'లుగా పిలుస్తారు. చిసాకో కకెహి (67) అనే ఈ మహిళ ఇప్పటివరకు ఆరుగురు భర్తలను ఇలా చంపింది. తాజాగా 2013 డిసెంబర్ నెలలో 75 ఏళ్ల భర్తకు విషమిచ్చి చంపింది. ఇప్పటివరకు ఇలా బీమా రూపంలో గత పదేళ్లలో ఆమె సుమారు 53 కోట్ల రూపాయలు వెనకేసుకుంది. ఇప్పుడు మరో ముసలి, బాగా డబ్బున్న వ్యక్తి ఎవరు దొరుకుతారా అని ఎదురు చూస్తోంది. తాను పెళ్లి చేసుకోవాలనుకునే వ్యక్తి ముసలివాడై ఉండాలని, ఒక్కడే నివసిస్తుండాలని కూడా మ్యారేజి బ్యూరోలకు చెబుతోంది. అతడు ఏదైనా వ్యాధితో బాధపడేవాడైతే మరింత మంచిదని కూడా చెప్పిందట. పశ్చిమ జపాన్‌లో వేర్వేరు పేర్లతో ఆమె పలు మ్యారేజి బ్యూరోలలో పేర్లు నమోదు చేయించుకుంది. క్యోటోలోని ఆమె ఇంట్లో పోలీసులు గురువారం సోదాలు చేసినప్పుడు అక్కడ సైనైడ్ ఆనవాళ్లు కనిపించాయి. తన భర్తలను చంపిన విషయాన్ని ఆమె అంగీకరించడంలేదు. జపాన్‌లో చాలా కాలంగా బ్లాక్విడోలు ఉన్నట్లు చరిత్ర ఉంది. ఇటీవలే కనే కిజిర్నా అనే మధ్య వయసు మహిళ ఒకరు తన ముగ్గురు భర్తలను చంపి వాళ్ల ఆస్తులు చేజిక్కించుకుంది.