Blueprint
-
జన్యుశాస్త్రంలో కీలక ముందడుగు.. మిస్సింగ్ భాగాల గుర్తింపు
న్యూయార్క్: సంపూర్ణ మానవ జన్యు అనుక్రమణ (జీనోమ్ సీక్వెన్సింగ్) పూర్తయినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అనేక సంవత్సరాల పరిశోధన అనంతరం మానవుల పూర్తి జన్యు బ్లూప్రింట్‌ను రూపొందించినట్లు వెల్లడించారు. నిజానికి మానవ జీనోమ్ సీక్వెన్సింగ్ రెండు దశాబ్దాల క్రితమే దాదాపు పూర్తయినా, కొన్ని మిస్సింగ్ భాగాల అన్వేషణకు ఇంత సమయం పట్టింది. మొట్ట మొదటి పూర్తి స్థాయి మానవ జీనోమ్ సీక్వెన్సింగ్ పరిశోధనను అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం గురువారం జర్నల్‌సైన్స్‌లో ప్రచురించింది. గతంలో మిస్సైన దాదాపు 8 శాతం జీనోమ్‌ను సైతం విశ్లేషించి పూర్తి జీనోమ్‌ను తయారు చేసినట్లు పరిశోధకులు తెలిపారు. మనిషిని తయారు చేసే కొన్ని జన్యువులు ఇంతకాలం జీనోమ్ డార్క్‌మేటర్‌లో ఉన్నాయని, వీటిని ఇంతవరకు మిస్సయ్యామని ప్రస్తుత పరిశోధనలో పాలుపంచుకున్న శాస్త్రవేత్త ఎవాన్ ఐష్లర్ చెప్పారు. 20ఏళ్ల తర్వాత ఎట్టకేలకు పనిపూర్తయిందన్నారు. మానవ పరిణామక్రమాన్ని అర్థం చేసుకోవడంలో, జీవశాస్త్ర విశేషాల విశ్లేషణలో జీనోమ్ పూర్తి సీక్వెన్సింగ్ ఎంతగానో ఉపయోగపడనుంది. వృద్ధాప్యం, నరాల బలహీనత వ్యాధులు, కాన్సర్, హృద్రోగాల్లాంటి పలు సమస్యలకు దీనిద్వారా పరిష్కారం లభించే మరిన్ని అవకాశాలు లభించాయని పరిశోధకుల్లో ఒకరైన కరెన్ మిగా చెప్పారు. మిగాతో కలిసి పలువురు పరిశోధకులు టీ2టీ కన్సార్టియంగా ఏర్పడి మిస్సింగ్ జీనోమ్‌ను కనుగొనే కృషి చేశారు. 2000లో తొలి ప్రకటన తొలిసారి మానవ జీనోమ్ ముసాయిదాను వైట్‌హౌస్‌లో 2000 సంవత్సరంలో ప్రకటించారు. అంతర్జాతీయ ఫండింగ్‌తో నడిచే యూఎస్ నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ సంస్థతో పాటు ప్రైవేట్ సంస్థ సెలెరా జీనోమిక్స్ సంస్థ కలిసి దీన్ని ప్రకటించాయి. మానవ జీనోమ్ 310 డీఎన్ఏ సబ్యూనిట్లతో తయారై ఉంటుంది. అడినన్, సైటోసిన్, గ్వానైన్, థైమిన్ అనే బిల్డింగ్ బ్లాక్స్ వివిధ జతల్లో కూడడం ద్వారా డీఎన్ఏ నిర్మితిని ఏర్పరుస్తాయి. డీఎన్ఏ మానవ జీవనానికి అవసరమైన ప్రోటీన్ల ఉత్పత్తిని చేస్తుంది. మనిషిలో సుమారు 30వేల జీన్స్ ఉంటాయి. ఇవి 23 గ్రూపులుగా ఏర్పతాయి. వీటినే క్రోమోజోమ్స్ అంటారు. ప్రతి కణం కేంద్రకంలో ఈ క్రోమోజోమ్స్ ఉంటాయి. జీనోమ్ మ్యాప్‌లో ఉన్న ఖాళీలు చాలా కీలకమైనవిగా గుర్తించామని మిగా చెప్పారు. ఈ ఖాళీలను ఇంతవరకు పలువురు సైంటిస్టులు పనికిరానివిగా భావించారని ఐష్లర్ చెప్పారు. కానీ వీటిలో అమూల్య సమాచారం ఉందని తాము తొలి నుంచి భావించామన్నారు. ఇందులో చాలా కీలక జన్యువులు ఉన్నాయని, ఉదాహరణకు చింపాజీతో పోలిస్తే మనిషి మెదడును మరింత క్లిష్టంగా పెద్దదిగా చేసే జన్యువుల్లాంటివి ఇందులో ఉన్నాయని చెప్పారు. వీటిని కనుగొనేందుకు క్రిప్టిక్ జెనిటిక్ లాంగ్వేజ్ ఉపయోగపడినట్లు తెలిపారు. మానవ వైవిధ్యతకు ప్రతిబింబాలైన 350మంది మనుషుల జీనోమ్‌ను సీక్వెన్సింగ్ చేసేందుకు ఇకపై టీ2టీ గ్రూప్‌తో కలిసి పనిచేస్తామన్నారు. -
ఒక్క క్లిక్‌తో పూర్తి ఆరోగ్య సమాచారం..
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా డిజిటల్ వైద్య సేవలను అందుబాటులోకి తేవాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు అంతర్జాతీయ ప్రమాణాలతో ఎల్రక్టానిక్ హెల్త్ రికార్డు వ్యవస్థను రూపొందించాలని భావిస్తుంది. తద్వారా ప్రతీ ఒక్కరి ఆరోగ్య సమాచారం ఒకే క్లిక్‌తో లభ్యమయ్యేలా ఏర్పాట్లు చేస్తుంది. దీనివల్ల దేశంలోని ప్రతీ ఒక్కరి ఆరోగ్య సమాచారం ఒకేచోట నిక్షిప్తం చేసే అవకాశముంది. అందుకోసం తాజాగా ‘నేషనల్ డిజిటల్ హెల్త్ బ్లూప్రింట్’ను అందుబాటులోకి తెచి్చంది. ఈ బ్లూప్రింట్ నివేదికను ప్రజల అవగాహన కోసం విడుదల చేసింది. జాతీయ ఆరోగ్య విధానం–2017 ప్రకారం అందరికీ ఆరోగ్యం అందించాలన్న లక్ష్యాన్ని చేరుకోవడమే ఈ డిజిటల్ హెల్త్ ఉద్దేశమని స్పష్టం చేసింది. దీనివల్ల ఎవరైనా ఆస్పత్రికి వెళితే ఆన్లైన్లో వారు అంతకు ముందు పొందిన వైద్య చికిత్సలు, పరీక్షలు అన్నీ ప్రత్యక్షమవుతాయి. ఆస్పత్రులే నమోదు చేయాలి... ప్రభుత్వ, ప్రైవేటు కార్పొరేట్ ఆస్పత్రులు తమ వద్దకు వచ్చే రోగుల వివరాలను ఇక నుంచి నేషనల్ డిజిటల్ హెల్త్ వ్యవస్థలో పొందుపరచాలి. ఈ విషయంపై త్వరలో మార్గదర్శకాలు రానున్నాయి. రోగులకు చేసిన వైద్య పరీక్షలు, అందజేసిన చికిత్సలు, వాడిన మందు లు తదితర వివరాలన్నింటినీ నమోదు చేయాలి. దేశవ్యాప్తంగా ఉన్న వెల్నెస్ సెంటర్లలోనూ ఈ ప్రక్రియ నిరంతరాయంగా చేపట్టే అవకాశముంది. వ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలను గోప్యంగా ఉంచుతారు. కేవలం చికిత్స పొందేటప్పుడు సంబంధిత డాక్టర్‌కు మాత్ర మే తెలిసేలా ఏర్పాట్లు ఉంటాయి. వ్యక్తిగత సమాచారం కాకుండా ఏ వ్యాధితో ఎంతమంది బాధపడుతున్నారో ఈ డిజిటల్ హెల్త్ సర్వీసెస్‌తో తెలుసుకోవచ్చు. నాణ్యమైన వైద్యాన్ని అందించడం, సార్వత్రిక ఆరోగ్య సేవలను పెంచడం కూడా ఈ సేవల్లో కీలకమైన అంశాలని బ్లూప్రిం ట్ వెల్లడించింది. -
అయోధ్య కోసం మెగా స్కెచ్
సాక్షి, లక్నో : లక్షల సంఖ్యలో హాజరైన భక్తులు.. జై శ్రీరామ్-భారత్ మాతాకీ జై నినాదాలు.. 1.7 లక్షల కోట్ల విద్యుత్ దీపాల వెలుగులు.. ఆకాశంలో పుష్పక విమానం(హెలికాఫ్టర్) నుంచి పూల వాన... సీతాసమేత రాముడి అవతారంలో వచ్చిన వ్యక్తులకు పూల మాలలు... వెరసి సరయు నది ఒడ్డన ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన మహా దీపోత్సవంలో కనిపించిన దృశ్యాలివి. రామ మందిర నిర్మాణ కల సాకారం హమీని కూడా మేనిఫెస్టోలో చేర్చి బీజేపీ ప్రభుత్వం ఉత్తర ప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన విషయం విదితమే. కోర్టు చిక్కులు వీడిపోగానే నిర్మాణం శరవేగంగా చేపట్టాలని ఆలోచనలో ఆదిత్యానాథ్ సర్కార్ ఉంది. అయితే గుడి నిర్మాణంతోనే ఆగిపోకుండా.. అయోధ్యను సమూలంగా మార్చేయాలన్న కొత్త ఆలోచనతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే వంద మీటర్ల ఎత్తైన రామ విగ్రహ ఏర్పాటుకు రంగం సిద్ధం చేయగా.. తాజాగా అయోధ్య అభివృద్ధి కోసం రూపొందించిన బ్లూప్రింట్ బయటకు పొక్కింది. ఇండియన్ ఎక్స్ ప్రెస్ వెలువరించిన కథనం ప్రకారం... రామాయణ మ్యూజియం, అయోధ్య నగర్ నిగమ్, అయోధ్య అనుసంధానం, ఫైజాబాద్ మున్సిపల్ బోర్డు ఏర్పాటు, సరయు మహోత్సవం, దిగంబర్ అఖడ హాల్ నిర్మాణం, సరయు నది ఒడ్డున అభివృద్ధి-5 ఘాట్ల వద్ద సోలార్ వ్యవస్థ ఏర్పాటు, అయోధ్య రోడ్ నుంచి హనుమాన్ ఘడి వద్దకు రోడ్డు నిర్మాణం, కనక్ భవన్, దశరథ్ భవన్, రామ్ జానకీ మార్గ్ పేరిట అయోధ్య-జనక్‌పూర్ మధ్య రోడ్డు, రామ్ కథ గ్యాలెరీ వీటితోపాటు క్వీన్ హియో మెమోరియల్ నిర్మాణం ఆ జాబితాలో ఉన్నాయి. ఇందుగానూ అయ్యే ఖర్చును ఇప్పుడప్పుడే అంచనా వేయటం కష్టం. రామ రాజ్యం అంటే అభివృద్ధి, పేదరికాన్ని పాలద్రోలడమేనని ఆదిత్యానాథ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయోధ్య అభివృద్ధి విషయంలో రాజకీయ విమర్శలు ఎదురైన తాను అస్సలు పట్టించుకోనని ఆయన ఇదివరకే స్పష్టం చేశారు కూడా. -
‘రాహుల్ బ్లూప్రింట్’తో కాంగ్రెస్‌కు పునరుత్తేజం
న్యూఢిల్లీ: కాంగ్రెస్‌కు పునరుత్తేజం కల్పించే బ్లూప్రింట్ రాహుల్ గాంధీ వద్ద ఉందని, వచ్చే రెండు నెలల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుందని పార్టీ సీనియర్ నాయకుడు జ్యోతిరాదిత్య సింధియా చెప్పారు. రాజకీయాల నుంచి రెండు నెలల విరామం తీసుకొని వచ్చిన ఉపాధ్యక్షుడు రాహుల్‌ను సింధియా సమర్థించారు. ‘ఆయన మనసులో బ్లూప్రింట్ ఉంది. రానున్న 1-2 నెలల్లో మార్పును మీరే చూస్తారు’ అని చెప్పారు. రాహుల్ సుదీర్ఘ విరామం తీసుకున్నప్పుడు.. పార్టీకి జవసత్వాలు కల్పించే బ్లూప్రింట్తో ఆయన తిరిగొస్తాడన్న పార్టీ నాయకుల మాటల గురించి ప్రస్తావించగా సింధియా పైవిధంగా స్పందించారు. ఒక టీవీ చానెల్ నిర్వహించిన ‘ఆప్ కీ అదాలత్’ కార్యక్రమంలో సింధియా మాట్లాడారు. వివాదాస్పద భూసేకరణ బిల్లుపై మాట్లాడుతూ, రైతుల అంగీకారం లేకుండా వారి భూమిని ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఏడాది కిందట రైతుల అంగీకారం తప్పనిసరని చెప్పిన రాజ్‌నాథ్, సుష్మాస్వరాజ్ లాంటి నాయకులు ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నారని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు దిగిపోతున్నా దేశంలో అన్ని ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని మోదీ ‘అచ్ఛే దిన్’ వచ్చాయని ఎలా చెబుతారని సింధియా నిలదీశారు. -
స్పైసెస్ పార్కు అభివృద్ధికి బ్లూప్రింట్
కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గుంటూరు జిల్లాలో స్పైసెస్ పార్కు ప్రారంభం గుంటూరు: పారిశ్రామిక వేత్తలకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా స్పైసెస్ (సుగంధ ద్రవ్యాల) పార్కును తీర్చిదిద్దేందుకు బ్లూప్రింట్‌ను తయారు చేస్తామని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం వంకాయలపాడు గ్రామంలో నిర్మించిన స్పైసెస్ పార్కును సోమవారం ఆమె ప్రారంభించి ప్రసంగించారు. 124.78 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన పార్కును పారిశ్రామిక వేత్తలు వినియోగించుకోవాలని కోరారు. ఈ పార్కులో ఏర్పాటు చేసిన ప్రాసెసింగ్ ప్లాంట్‌ను వినియోగించుకునే హక్కు ప్రతీ రైతుకు ఉందన్నారు. ఇప్పటి వరకు 18 మంది సుగంధ ద్రవ్యాల ఎగుమతిదారులకు 38 ఎకరాలను కేటాయించామని, మిగిలిన ఎగుమతిదారులు ఈ పార్కులో వ్యాపారం ప్రారంభించేందుకు ముందుకు రావాలని కోరారు. ఎగుమతులకు చైనా దేశంలోని షాంగై ఎంత ప్రసిద్ధి చెందిందో అదే విధంగా విశాఖపట్నం, భీమవరంలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తోందన్నారు. ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన కల్పిస్తాం.. తాత్కాలిక ప్రయోజనాలకు ఆశపడి మిరప రైతులు ఎరువులు, క్రిమిసంహారక మందులు ఎక్కువుగా వాడుతున్నారని, వీటి వినియోగం పట్ల రైతులకు అవగాహన కలిగించేందుకు చర్యలు తీసుకుంటామని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. దీనికోసం ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తానన్నారు. మిరపకు గిట్టుబాటు ధర కల్పించేందుకు, విదేశాలకు ఎగుమతి చేసేందుకు అనువుగా ఈ పార్కును ఏర్పాటు చేసామన్నారు. అవినీతిని ఉపేక్షించం: సీఎం తిరుపతి: ‘‘నవ్యాంధ్రప్రదేశ్‌కు పెద్దను మాత్రమే. పెత్తనం చేయను. ఉద్యోగులకు గౌరవం పెంచేందుకే 43 శాతం ఫిట్మెంట్ పెంచాం. దీంతో కార్పొరేట్ స్థాయిలో జీతాలు అందుతాయి. అదే స్థాయిలో అవినీతిని తగ్గిస్తాం. అవినీతిని ఉపేక్షించే ప్రసక్తేలేదు. నన్ను నమ్మండి.. ఉద్యోగులందరికీ మేలు చేస్తాను. రాష్ట్రాభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించండి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్యోగులను కోరారు. సోమవారం తిరుపతి మహతి కళాక్షేత్రంలో ‘నవ్యాంధ్ర నిర్మాణంలో ఉద్యోగుల భాగస్వామ్యం’పై ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర సదస్సులో ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉద్యోగులు ఏకధాటిగా 81 రోజుల పాటు యోధులుగా పోరాటం చేశారని, అందుకే వారి సేవకు గుర్తింపుగా ఆ రోజులకు ప్రత్యేక సెలవు దినాలుగా ప్రకటించామని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తారన్న అనుమానాలు వద్దని, అలాంటి వారికి భద్రత కల్పించే విషయంలో చొరవ చూపుతున్నామని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లకు పెంచటం, రైతులు, డ్వాక్రా మహిళల రుణాల మాఫీ, ఉద్యోగులకు హెల్త్‌కార్డుల మంజూరు చేశామని గుర్తు చేశారు. ఇబ్బంది పెట్టడానికే తెలంగాణ ఫిట్మెంట్ తెలంగాణ ప్రభుత్వం తనను ఇబ్బంది పెట్టేందుకు ఫిట్మెంట్ ప్రకటించిందని, అయినప్పటి కీ తాను భయపడకుండా 43 శాతం ప్రకటించానని అన్నారు. ఇతర రాష్ట్రాలకు లేని విధంగా 974 కిలోమీటర్ల మేర తీరప్రాంతం ఉందని, ఇక్కడ విస్తారంగా పోర్టులు నిర్మించి రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్‌గా మారుస్తామని పేర్కొన్నారు. ఖనిజ సంపదను వెలికి తీసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళతామన్నారు. ప్రతి ఉద్యోగికీ ఐపాడ్, ట్యాబ్‌లు అందజేస్తామని, తద్వారా ప్రభుత్వ సేవలను మరింత వేగంగా ప్రజలకు చేరవేస్తామని అన్నారు. ఉద్యోగులు కూడా సాంకేతికంగా, విజ్ఞానపరంగా సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. -
ప్రపంచస్థాయి నగరంగా ఢిల్లీ
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు - బ్లూప్రింట్ రూపకల్పనకు చొరవ - వివిధ శాఖల అధికారులతో చర్చ న్యూఢిల్లీ: దేశ జాతీయ రాజధానిని కేంద్రం ప్రభుత్వం ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దనుంది. ఈ దిశగా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు చొరవ తీసుకున్నారు. ఇందులోభాగంగా నగర సుందరీకరణ, అభివృద్ధికి ఓ బ్లూప్రింట్ రూపొందించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. కేంద్ర ప్రజాపనుల శాఖతోపాటు తన శాఖకు చెందిన ఉన్నతాధికారులతో శుక్రవారం సమావేశమైన మంత్రి ఈ అంశంపై విస్తృతంగా చర్చించారు. దీంతోపాటు మురుగునీటి పారుదలను మెరుగుపరచడం, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చేయడం వంటి అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు. రహదారులు, పాత్‌వేలు. ఖాళీ స్థలాలు, ప్రజాదరణ పొందిన స్మారకాల నిర్వహణ తదితర అంశాలను కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల విషయంలో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నగరవాసుల ఆకాంక్షలకు అనుగుణంగా దీనిని తీర్చిదిద్దాలన్నారు. భారతీయుడుగానీ లేదా విదేశాలనుంచి తొలిసారిగా ఇక్కడికి వచ్చే ప్రతిని ధుల బృందం ఈ నగరాన్ని చూసినపుడు ఎలాంటి అనుభూతి పొందుతాడనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుని తదనుగుణంగా నగరాన్ని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలను రూపొందించాలని ఆయన ఈ సందర్భంగా అధికారులకు సూచించా రు. ఇతర దేశాల్లోని నగరాలతో పోలిస్తే ఢిల్లీకి ఎన్నో స్థానంలో ఉండొచ్చనే అంశంపైనా చర్చించారు. ఇంకా ఈ సమావేశంలో ఉత్తర ఢిల్లీ, దక్షిణ, న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లకు చెందిన ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.