బీ-ఫాం ఇచ్చారు.. లెజెండ్ ఆపండి
అనంత కలెక్టర్‌కు వైఎస్సార్సీపీ లీగల్ సెల్ వినతి
అనంతపురం హిందూపురం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా సినీ నటుడు బాలకృష్ణ బీ-ఫాం అందజేశారని, ఈ పరిస్థితిలో ఆయన నటించిన ‘లెజెండ్’ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ జిల్లా కన్వీనర్ బి.నారాయణరెడ్డి, కోఆర్డినేటర్ గాండ్ల ఆదినారాయణ కలెక్టర్ లోకేష్‌కుమార్‌ను కోరారు. బుధవారం వారు కలెక్టర్‌ను ఆయన కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని కలెక్టర్.. ఎన్నికల కమిషన్ (ఢిల్లీ) దృష్టికి తీసుకెళ్లారని, వారి నుంచి ఆదేశాలు రాగానే చర్యలు తీసుకుంటామని చెప్పారని తెలిపారు