bogas voters
-
కుప్పంలో బోగస్ ఓట్లు.. బయటపడ్డ చంద్రబాబు గుట్టు
-
‘ఓట్ల కోసం దొంగల ముఠా’
సాక్షి, అమరావతి: ఎన్నికలు సమీపిస్తున్నందున ఏపీలో ఓట్ల కోసం దొంగల ముఠాలు తిరుగుతున్నాయని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 20 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని, దొంగఓట్లు చేర్చడం కోసం టీడీపీ ప్రత్యేక టీం పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. దొంగఓట్ల వ్యవహారంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదివరకే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు ఆయన గుర్తుచేశారు. సజ్జల రామకృష్ణా రెడ్డి శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం తమ పార్టీ సానూభూతిపరుల ఓట్లను తొలగిస్తోందని అన్నారు. చంద్రబాబు పాలన బాగోలేదని సర్వేలో చెప్పిన వారి ఓట్లను తీసివేస్తున్నారని ఆయన ఆరోపించారు. కులం ఆధారంగా ఏ పార్టీకి ఓటు వేస్తారని అడుగుతున్నారని, అది రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. బూత్‌కి 50 ఓట్లకు పైగా తొలగిస్తున్నట్లు తనకు అనుమానంగా ఉందని, ప్రతి ఒక్కరు తమ ఓటును చెక్ చేసుకోవాలని ఆయన సూచించారు. అడ్డదారుల్లో అధికారంలోకి రావడం కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని, డిపాజిట్లు కూడా రావాని తెలిసి ఆయన అలా వెళ్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని రైతులకు 8400 కోట్ల రుణమాఫీ ఇవ్వలేదని, ఇప్పుడు రైతులకు అన్నదాత సుఖీభవ ద్వారా 16వేలు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ఇళ్లున్నా ఈ పథకాలను ఎందుకు అమలుచేయ్యలేదని, అవకాశాలు ఉన్నచోట తమ పార్టీలోకి చేరికలు ఉంటాయని సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు. -
ఓట్ల కోసం దొంగల ముఠా: సజ్జల
-
బోగస్ ఓట్లకు బీఎల్వోలు సై
బోగస్ ఓట్లను టీడీపీ నేతలు అధికార బలంతో ఓటరు జాబితాలో చేర్చారు. తాజాగా విడుదలైన తుది ఓటర్ల జాబితాలో 14 నియోజకవర్గాల్లో కోకొల్లలుగా బోగస్ ఓట్లు దర్శనమిచ్చాయి. దీనిపై ‘సాక్షి’ ఫోకస్ కథనం. చిత్తూరు కలెక్టరేట్ : అధికార తెలుగుదేశం పార్టీ గ్రామాల్లో బీఎల్వోలను లోబర్చుకుని ఓటర్ల జాబితాలో బోగస్ ఓట్లను సృష్టించింది. ఓటర్ల పేర్లలో చిన్న చిన్న మార్పులు చేసి నకిలీ ఓట్లను జాబితాలో చేర్చేలా కుట్ర పన్నింది. అధికారంలోకి రావడానికి టీడీపీ ప్రజాప్రతినిధులు చేస్తున్న అడ్డదారి ప్రయత్నాలు విమర్శలకు తావిస్తోంది. నిబంధనల ప్రకారం ఒకరికి ఒకే ఓటు హక్కు ఉండాలి. అయితే ఎన్నికల సమయంలో దొంగ ఓట్లను వేయించేం దుకు కుట్ర చేపట్టారు. అందులో భాగంగా జిల్లాలో లేని ఓట్లను, ఒక్కొక్కరికి రెండు, మూడు చొప్పున సృష్టించారు. తాజాగా రాష్ట్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు ఓటర్ల తుది జాబితాను విడుదల చేశారు. ఆ జాబితాను పరిశీలించగా సీఎం చంద్రబాబునాయుడు, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర నాథరెడ్డి ప్రాతినిధ్యం వహించే రెండు నియోజకవర్గాలలో అధిక శాతం బోగస్ ఓట్లు దర్శనమిచ్చాయి. తుది ఓటర్ల జాబితా ప్రకారం సాక్షి క్షేత్ర స్థాయిలో పరిశీలించగా నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి. తప్పెవరిది... గతంలో తయారు చేసిన ఓటర్ల సవరణ జాబితాలో అనేక బోగస్ ఓట్లు తలెత్తిన విషయాన్ని వాస్ట్ సంస్థ గుర్తించింది. ఈ తప్పుల తడకపై రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. వీటిపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం వెంటనే బోగస్ ఓట్ల తొలగింపునకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాల ప్రకారం స్వయంగా కలెక్టర్ ప్రద్యుమ్న క్షేత్రస్థాయిలో ముమ్మర పరిశీలనలు, తనిఖీలు చేపట్టారు. ఎన్నికల సిబ్బంది క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహిం చారు. తర్వాత 13,852 అనుమానిత ఓట్లను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఆ ప్రక్రియలో అలసత్వం వహిం చిన ఏఈఆర్వో(తహసీల్దార్), ఈఆర్వో, బీఎల్వో, కంప్యూటర్ ఆపరేటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జిల్లా యంత్రాంగం కసరత్తు చేపట్టాక తాజాగా విడుదలైన తుది ఓటర్ల జాబితాలోనూ అనేకంగా బోగస్ ఓట్లు దర్శనమిచ్చాయి. ఎన్నికల ఓటర్ల ప్రక్రియ పరిశీలకుడు శ్రీనివాస్శ్రీనరేశ్ మూడుసార్లు జిల్లాలో పర్యటిం చారు. 66 మంది ఏఈఆర్వోలు, 14 మంది ఈఆర్వోలు, జాయింట్ కలెక్టర్, జిల్లా కలెక్టర్ ముసాయిదా జాబి తాను తయారు చేసి రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపారు. ఇంత మంది చేసిన కసరత్తులో తప్పులు తలెత్తడం విమర్శలకు తావిస్తోంది. తయారవ్వని పారదర్శకమైన ఓటర్ల జాబితా.. తాజాగా విడుదలైన ఓటర్ల తుది జాబితాలో బోగస్ ఓట్లు దర్శనమివ్వడంతో జిల్లా యంత్రాంగం పారదర్శకమైన ఓటర్ల జాబితాను తయారు చేయలేకపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారీకి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రద్యుమ్న తీవ్రంగా చర్యలు చేపట్టారు. క్షేత్ర స్థాయిలో కీలకంగా వ్యవహరించే బీఎల్వోలు టీడీపీ పార్టీకి అనుకూలంగా ఉన్న వారు ఉండడంతో తప్పిదాలు చోటు చేసుకున్నాయన్న ఆరోపణలున్నాయి. బీఎల్వోలు క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే ఓటర్లుగా దరఖాస్తు చేసిన వారినందరిని ఆమోదించారు. వాటిని క్షుణ్ణంగా పరిశీలించాల్సిన ఏఈఆర్వోలు, ఈఆర్వోలు తూతూ మంత్రంగా విధులు నిర్వహించారు. దీంతోనే తుది ఓటర్ల జాబితాలో బోగస్ ఓట్లు ఎక్కువగా దర్శనమిచ్చాయని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత జాబితాలో తలెత్తిన బోగస్ ఓట్లను తొలగించి, పారదర్శకమైన ఓటర్ల జాబితాను ప్రకటించాలని రాజకీయ విశ్లేషకులు డిమాండ్ చేస్తున్నారు. -
15 శాతం నకిలీ ఓట్లు.. ఇంక ఆ పార్టీల ప్రచారమెందుకు?
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో 3.6 కోట్ల మంది ఓటర్లుంటే.. అందులో 52 లక్షల 67 వేల 636 బోగస్ ఓట్లు ఉండడం దారుణమని విజయవాడ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. గతంలో కేవలం 0.5శాతం ఓట్లతో రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిందని, అలాంటిది ఇప్పుడు 15 శాతం నకిలీ ఓట్లు ఉంటే ఇక మిగిలిన ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ప్రచారాలెందుకు చేసుకోవాలని ఆయన మండిపడ్డారు. రాజకీయాన్ని ఒక వ్యాపారంలా.. దొంగ ఓట్లను పెట్టుకొని అధికారంలోకి రావాలనుకోవడం సరికాదని హితువు పలికారు. ఏపీ, తెలంగాణాలో రెండు చోట్ల దొంగ ఓట్లను రాజకీయ నాయకులు సృష్టిస్తున్నారు. రకరకాల మార్గాల్లో ఓట్లు లేని వారు కూడా ఓటు వేస్తుండడం సిగ్గుచేటు. జనచైతన్య వేదిక సర్వే ద్వారా జిల్లాల వారీగా బోగస్ ఓట్లను గుర్తించి ఎన్నికల అధికారికి పంపించడంతోపాటు కోర్టులో పిల్ వేశామని ఉండవల్లి అన్నారు. కంప్యూటర్లు లేని యుగంలో అంటే చనిపోయిన, ఇళ్ళు మారిన వారి సమాచారం సరిగా ఉండేది కాదని, కానీ కంప్యూటర్, ఆన్లైన్ యుగంలో కూడా ఇలా జరగడం దారుణమన్నారు. ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ స్పందించకుంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం వాటిల్లుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. -
పకడ్బందీగా బోగస్ ఓట్ల తొలగింపు
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్ : జిల్లాలో బోగస్ ఓటర్లను తొలగింపు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లో తహశీల్దార్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1.83 లక్షల మంది బోగస్ ఓటర్లు ఉన్నారని, ఆ పేర్లను జాబితా నుంచి ఏరివేయాలన్నారు. ఒకే ఇంట్లో 20 కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారని, వీరందరూ బోగస్ ఓటర్లేనన్న ఫిర్యాదులు ఉన్నాయని, వీటిపై సమగ్రంగా విచారణ జరపాలని సూచించారు. బూత్‌స్థాయి అధికారులు ఇంటింటికీ తిరిగి విచారించాలని, బోగస్ ఓటర్లు ఉంటే ఫారం-7లో నోటీసు ఇచ్చి తొలగించాలని వివరించారు. బాధ్యతను బీఎల్ఓలపై నెట్టకుండా తహశీల్దార్లు దృష్టి సారించాలన్నారు. ఓటర్ల సవరణ జాబితాను అప్లోడ్ చేసే కంప్యూటర్ ఆపరేటర్లపై నిఘా ఉంచాలని సూచించారు. ఆదివారాన్ని ప్రత్యేక ఓటరు నమోదు దినంగా ఎన్నికల కమిషన్ గుర్తించిందని, జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలను బీఎల్ఓలు తెరచి ఉంచాలన్నారు. ఈ నెల 23వ తేదీతో ఓటరు నమోదుకు దరఖాస్తుల స్వీకరణ పూర్తి అవుతుందని, ఆ తర్వాత దరఖాస్తులన్నిటిపై జనవరి 4వ తేదీలోగా విచారణ జరపాలన్నారు. డేటా ఎంట్రీ పూర్తి చేసి జనవరి 16న తుది ఓటర్ల జాబితాను ప్రకటించాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్వో వేణుగోపాల్‌రెడ్డి, కర్నూలు ఆర్డీఓ కూర్మానాథ్, నంద్యాల ఆర్డీఓ నరసింహులు, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి సంపత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. వీఆర్వో, వీఆర్ఏ వివరాల సేకరణ అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి వేణుగోపాల్‌రెడ్డి, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి వీఆర్వో, వీఆర్ఏ పోస్టుల వివరాలను తహశీల్దార్ల నుంచి తీసుకున్నారు. కేటగిరీ వారీగా రోస్టర్ పాయింట్ల ప్రకారం వివరాలు సేకరించారు. పార్ట్‌టైమ్ వీఆర్వోల వివరాలు తీసుకున్నారు. ఈ వివరాల ఆధారంగానే వీఆర్వో, వీఆర్ఏ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. నమోదుకు రేపు ఆఖరు కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: కొత్తగా ఓటు హక్కు పొందాలనుకునే వారు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 23 వరకు అవకాశం కల్పిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా ఈ ఆదివారాన్ని ప్రత్యేక ఓటరు నమోదు దినంగా(స్పెషల్ క్యాంపైన్ డే) ప్రకటించింది. ఈ రోజున అన్ని పోలింగ్ స్టేషన్లను బీఎల్ఓలు తెరచి ఉంచి ఓటర్ల నుంచి దరఖాస్తులు తీసుకుంటారు. ఓటరు నమోదు గడువును ఇప్పటికే పొడిగించారు. ఇకపై ఆ అవకాశం లేనందున ఉన్న రెండు రోజులను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఓటరు నమోదుకు 1.70 లక్షల దరఖాస్తులు ఇప్పటి వరకు జిల్లా మొత్తం మీద 1,70,209 మంది కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో రిజిస్ట్రేషన్ ద్వారా 87,646, మాన్యువల్‌గా 82,563 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. రెండు రోజులు గడువు ఉన్నందున మరో 50 వేల వరకు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. -
ఓటు.. చేటు!
ప్యాపిలి మండలం అలేబాదు గ్రామానికి చెందిన 65 మంది దాదాపు ఇరవై ఏళ్ల క్రితం డోన్ తదితర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వీరంతా ఇప్పటికీ అదే గ్రామంలో ఓటర్లుగా కొనసాగుతున్నారు. నివాసం ఉంటున్న ప్రాంతంలోనూ ఓటు హక్కును పొందారు. ఎన్నికల సందర్భంగా స్వగ్రామానికి వెళ్లి ఓ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేస్తున్నారు. ఇదొక ఉదాహరణ మాత్రమే. జిల్లాలో ఇలాంటి బోగస్ ఓట్లు కోకొల్లలు. కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: సాధారణ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. గెలుపుకోసం ఇప్పటి నుంచే అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఓటరు నమోదు ప్రక్రియను నాయకులు తమకు అనుకూలంగా మల్చుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయంలో కొందరు అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం విమర్శలకు తావిస్తోంది. గత నెల 18న జిల్లా అధికార యంత్రాంగం ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం పురుష ఓటర్లు 14,12,688.. మహిళా ఓటర్లు 14,27,036 మంది ఉన్నారు. అధికార లెక్కల ప్రకారమే జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,83,180 బోగస్ ఓటర్లను గుర్తించారు. వీటి తొలగింపునకు జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టినా ఎంతవరకు ఫలితాన్నిస్తుందనేది ప్రశ్నార్థకమవుతోంది. పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల గెలుపును ఈ బోగస్ ఓట్లే నిర్ణయిస్తున్నాయి. 2014లో పార్లమెంట్లు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో బోగస్ ఓటర్లను చేర్పించే ప్రక్రియ ఊపందుకుంది. కర్నూలు, డోన్, ఎమ్మిగనూరు, నంద్యాల, కోడుమూరు, ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బోగస్ ఓటర్లపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఆధారాలు చూపుతున్నా నేతల ఒత్తిళ్ల నేపథ్యంలో తొలగించేందుకు స్థానిక అధికారులు ధైర్యం చేయలేకపోతున్నారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో అధికారికంగా 4,833 మంది బోగస్ ఓటర్లు ఉండగా.. వివిధ వర్గాల సమచారం మేరకు ఈ సంఖ్య 10వేల పైమాటే. గ్రామీణ ప్రాంత ప్రజలు సైతం నగరంలో ఓటు హక్కు కలిగి ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కర్నూలు మండలం దిన్నెదేవరపాడు గ్రామానికి చెందిన వందలాది మంది కర్నూలులోని మద్దూరు నగర్, లక్ష్మినగర్లలోని 72, 73 పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కు కలిగి ఉన్నారు. 5వ వార్డులోని 4వ పేటలో 100 శాతం ముస్లింలే నివసిస్తున్నారు. ఇక్కడ 80 మంది హిందువుల పేర్లతో ఓట్లు ఉండటం గమనార్హం. 100వ పోలింగ్ కేంద్రంలో 1,020 మంది ఓటర్లు ఉంటే.. ఆ వార్డుకు సంబంధం లేని వ్యక్తుల పేర్లు 482 ఉండటం బోగస్ ఓట్లు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియజేస్తోంది. ఓ కాంగ్రెస్ నేత, మాజీ కార్పొరేటర్ ఇంట్లో 72 మంది ఓటర్లు ఉన్నారు. మరో మాజీ మేయర్ ఇంట్లో ఆరుగురు ఓటర్లు ఉండగా.. 16 బోగస్ ఓట్లు ఉన్న విషయం అధికారులకు తెలిసినా తొలగించే సాహసం చేయడం లేదు. ఎన్నికల సమయంలో వీరంతా కీలకంగా మారిపోతున్నారు. అయ్యప్పస్వామి గుడి పరిసరాలు, ఎల్బీజీ నగర్ వాసులు అదే కాలనీ లేదా పక్క పోలింగ్ కేంద్రంలో ఓటర్లుగా ఉండాలి. కానీ వీరికి ఏ మాత్రం సంబంధం లేని గౌరీ గోపాల్ ఆసుపత్రి వద్దనున్న పోలింగ్ కేంద్రంలో ఓటర్లుగా నమోదు చేయడం విమర్శలకు తావిస్తోంది. పత్తికొండ నియోజకవర్గంలో ఒక కాంగ్రెస్ నేత భారీ ఎత్తున బోగస్ ఓటర్లను చేర్పిస్తున్నట్లు జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు అందింది. జిల్లాలో ఇలాంటి ఘటనలు అనేకం ఉన్నా.. అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం.