సాక్షి, అమరావతి: ఎన్నికలు సమీపిస్తున్నందున ఏపీలో ఓట్ల కోసం దొంగల ముఠాలు తిరుగుతున్నాయని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 20 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని, దొంగఓట్లు చేర్చడం కోసం టీడీపీ ప్రత్యేక టీం పనిచేస్తోందని ఆయన ఆరోపించారు. దొంగఓట్ల వ్యవహారంపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇదివరకే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు ఆయన గుర్తుచేశారు.
సజ్జల రామకృష్ణా రెడ్డి శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం తమ పార్టీ సానూభూతిపరుల ఓట్లను తొలగిస్తోందని అన్నారు. చంద్రబాబు పాలన బాగోలేదని సర్వేలో చెప్పిన వారి ఓట్లను తీసివేస్తున్నారని ఆయన ఆరోపించారు. కులం ఆధారంగా ఏ పార్టీకి ఓటు వేస్తారని అడుగుతున్నారని, అది రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. బూత్‌కి 50 ఓట్లకు పైగా తొలగిస్తున్నట్లు తనకు అనుమానంగా ఉందని, ప్రతి ఒక్కరు తమ ఓటును చెక్ చేసుకోవాలని ఆయన సూచించారు.
అడ్డదారుల్లో అధికారంలోకి రావడం కోసం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని, డిపాజిట్లు కూడా రావాని తెలిసి ఆయన అలా వెళ్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని రైతులకు 8400 కోట్ల రుణమాఫీ ఇవ్వలేదని, ఇప్పుడు రైతులకు అన్నదాత సుఖీభవ ద్వారా 16వేలు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ఇళ్లున్నా ఈ పథకాలను ఎందుకు అమలుచేయ్యలేదని, అవకాశాలు ఉన్నచోట తమ పార్టీలోకి చేరికలు ఉంటాయని సజ్జల రామకృష్ణా రెడ్డి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment