శ్మశానంలో పరిశోధనలకు వెళ్తే..
వినియోగంలో లేని 12 శతాబ్దానికి చెందిన ఓ శ్మశాన వాటికను పరిశీలించేందుకు వెళ్లిన పరిశోధకులకు విచిత్ర అనుభవాలు ఎదురయ్యాయట. బ్రిటన్ లోని నార్త్ యార్క్ షైర్ లో గల బొల్టన్ అబ్బే శ్మశాన వాటికను 12వ శతాబ్దంలో నిర్మించారు. కొన్ని శతాబ్దాల తర్వాత దాని వినియోగాన్ని పూర్తిగా నిలిపివేశారు. కాగా, శ్మశానానికి వెళ్లిన పరిశోధకుల్లో ఒకరైన టిమ్ అట్కిన్ సన్స్ ఆ ప్రాంతం మొత్తాన్ని ఫోటోలు తీశారు.
శ్మశానంలో ఉన్న సమయంలో తమకు విచిత్ర అనుభవాలు ఎదురైనట్లు ఆయన చెప్పారు. ఎవరో తమని చూస్తున్నట్లు బృంద సభ్యులు మొత్తం అనుభూతి చెందినట్లు తెలిపారు. శ్మశానంలోకి ప్రవేశించగానే ఒక్కసారి పెద్ద మొత్తంలో గాలి, ధూళి చెలరేగినట్లు చెప్పారు. దీంతోపాటు దూరం నుంచి నక్కలు ఊళలు వేశాయడంతో తమ ఒళ్లు జలదరించినట్లు తెలిపారు.
శ్మశానం నుంచి తిరిగివచ్చిన అనంతరం అక్కడ తీసిన ఫోటోలను పరిశీలించగా.. శ్మశాన ప్రవేశ ద్వారాన్ని తీసిన చిత్రంలో ఎవరో తమ వైపు చూస్తున్నట్లు ఉందని చెప్పారు. ఆ రోజు రాత్రి మొత్తం దేశవ్యాప్తంగా వాతావరణం అల్లకల్లోలంగా మారిందని పేర్కొన్నారు.