bomb hoax
-
ఇండిగో విమానంలో ‘బాంబు’ కలకలం
పాట్నా: ఓ ప్యాసింజర్ చేసిన పని.. ప్రయాణికులతో పాటు పోలీసులను, విమాన సిబ్బందిని హడలగొట్టింది. ఇండిగో విమానంలో బాంబు కలకలం చోటు చేసుకుంది. ఢిల్లీకి చెందిన ఇండిగో విమానం(6e 2126)లో ఓ ప్రయాణికుడు తన బ్యాగులో బాంబు ఉందని చెప్పాడు. దీంతో విమానాన్ని పాట్నా జయ్ ప్రకాశ్ నారాయణ్ ఎయిర్‌పోర్టులోనే అత్యవసరంగా తనిఖీలు చేశారు. బుధవారం రాత్రి పాట్నా నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రయాణికుడు తన బ్యాగులో బాంబు ఉందని చెప్పడంతో అంతా ఉలిక్కి పడ్డారు. ప్రయాణికులందరినీ విమానం నుంచి కిందకు దించారు విమాన సిబ్బంది. ఆపై పోలీసులు బాంబు-డాగ్ స్క్వాడ్ సాయంతో అతని బ్యాగ్‌ను చెక్ చేశారు. అలాగే ప్రోటోకాల్ ప్రకారం విమానం మొత్తం తనిఖీలు చేపట్టి.. ఏం లేదని నిర్ధారించారు. బాంబు బెదిరింపునకు పాల్పడ్డ ప్రయాణికుడు తన కుటుంబంతో ప్రయాణిస్తున్నాడని, అతన్ని అదుపులోకి తీసుకున్నామని, అతని మానసిక స్థితిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పాట్నా కలెక్టర్ చంద్రశేఖర్ సింగ్ వెల్లడించారు. తనిఖీల అనంతరం విమానాన్ని ప్రయాణానికి అనుమతించారు. Bihar | Visuals from Patna airport where the Bomb squad & Police personnel are conducting inspection after a man in a Delhi-bound flight reportedly claimed that he had a bomb in his bag. His bag was checked further & no bomb was found pic.twitter.com/BkNxpjZ2QC — ANI (@ANI) July 21, 2022 -
రైల్వేస్టేషన్లో బాంబు కలకలం
లండన్ : లండన్ చేరింగ్ క్రాస్ రైల్వేస్టేషన్లో బాంబుతో సంచరిస్తున్నట్టు ఓ వ్యక్తి సమాచారం ఇవ్వడంతో కలకలం రేగింది. తన వద్ద బాంబు ఉందన్న వ్యక్తిని బ్రిటిష్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్రాక్‌పై నిలుచున్న ఓ వ్యక్తి తన వద్ద బాంబు ఉందని చెప్పడంతో బ్రిటిష్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రయాణీకులు, సిబ్బందిని హుటాహుటిన బయటకు పంపిన పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా నిమిషాల్లో స్టేషన్‌ను ఖాళీ చేయించారు. పెద్ద ఎత్తున సాయుధ బలగాలను స్టేషన్‌కు రప్పించి, అడుగడుగునా జల్లెడ పట్టారు. కాగా, బాంబు ఉందని హెచ్చరించిన వ్యక్తిని అరెస్ట్ చేశామని తెలిపారు. ప్రస్తుతం రైల్వేస్టేషన్లో సేవలు పునరుద్ధరించే ప్రక్రియ సాగుతోందని చెప్పారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడిందని పోలీస్ ప్రతినిధి వెల్లడించారు. అండర్‌గ్రౌండ్ సర్వీసులను అధికారులు క్రమబద్ధీకరించారని, ప్రయాణీకులు ట్రైన్ షెడ్యూల్స్‌లో మార్పులు గమనించి అందుకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు. -
బుజ్జిగాడు బాంబు పేల్చాడు
ఆ బుడుగు టీవీలో వస్తున్న షోని చూశాడు. అందులో హీరో 100 నంబర్ కి ఫోను చేసి రాబోయే బాంబు ప్రమాదం గురించి చెప్పాడు. తక్షణం పోలీసులు వచ్చి బాంబును నిర్వీర్యం చేశారు. అది చూసిన ఆ పదేళ్ల కుర్రాడికి మన పోలీసులు ఎలా పనిచేస్తారో చూడాలనిపించింది. అంతే... ఫోను తీసుకుని 100 కి డయల్ చేశాడు. మా ఇంటి దగ్గర ఉప్పుఫ్యాక్టరీ పక్కన బాంబు పేలిందని సమాచారం ఇచ్చాడు. ఇంకేముంది? నిముషాల్లో పోలీసులు వచ్చేశారు. బాంబు స్క్వాడ్లు, డాగ్ టీమ్ లు వచ్చాయి. హడావిడిగా అంతా వెతికితే బాంబు ఎక్కడా కనిపించలేదు. చివరికి ఆరా తీస్తే పదేళ్ల బుడతడు ఫోన్ చేశాడని తెలిసింది. 'పోలీసులు సరిగ్గా పనిచేస్తున్నారా లేదా అని టెస్ట్ చేశానంతే' అన్నాడు ఆ కుర్రాడు. ఆ కుర్రాడి పేరు షమీమ్. ఈ సంఘటన కాన్పూర్ జిల్లాలోని రావత్ పూర్ లో జరిగింది. అనవసరంగా హడావిడిపడ్డందుకు కోపం వచ్చినా పోలీసులు తల్లిదండ్రులను మందలించారు. పిల్లవాడిని మాత్రం వదిలేశారు.