లండన్ : లండన్ చేరింగ్ క్రాస్ రైల్వేస్టేషన్‌లో బాంబుతో సంచరిస్తున్నట్టు ఓ వ్యక్తి సమాచారం ఇవ్వడంతో కలకలం రేగింది. తన వద్ద బాంబు ఉందన్న వ్యక్తిని బ్రిటిష్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్రాక్‌పై నిలుచున్న ఓ వ్యక్తి తన వద్ద బాంబు ఉందని చెప్పడంతో బ్రిటిష్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రయాణీకులు, సిబ్బందిని హుటాహుటిన బయటకు పంపిన పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా నిమిషాల్లో స్టేషన్‌ను ఖాళీ చేయించారు.
పెద్ద ఎత్తున సాయుధ బలగాలను స్టేషన్‌కు రప్పించి, అడుగడుగునా జల్లెడ పట్టారు. కాగా, బాంబు ఉందని హెచ్చరించిన వ్యక్తిని అరెస్ట్ చేశామని తెలిపారు. ప్రస్తుతం రైల్వేస్టేషన్‌లో సేవలు పునరుద్ధరించే ప్రక్రియ సాగుతోందని చెప్పారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, రైలు సర్వీసులకు అంతరాయం ఏర్పడిందని పోలీస్ ప్రతినిధి వెల్లడించారు. అండర్‌గ్రౌండ్ సర్వీసులను అధికారులు క్రమబద్ధీకరించారని, ప్రయాణీకులు ట్రైన్ షెడ్యూల్స్‌లో మార్పులు గమనించి అందుకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment