Border Guard
-
పాకిస్తాన్లో ఇరాన్ సర్జికల్ స్ట్రైక్స్
టెహ్రాన్: పాకిస్తాన్ భూభాగంలో మంగళవారం రాత్రి తాము సర్జికైల్ స్ట్రైక్స్ నిర్వహించినట్లు ఇరాన్ ఎలైట్ రెవల్యూషనరీ గార్డ్స్(ఐఆర్జీసీ) ప్రకటించింది. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో జైష్ ఉల్–అదల్ అనే ఉగ్రవాద సంస్థ చెరలో ఉన్న తమ ఇద్దరు బోర్డర్ గార్డులను విజయవంతంగా విడిపించామని పేర్కొంది. వారిని సురక్షితంగా ఇరాన్‌కు చేర్చామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న వాహాబీ టెర్రరిస్టు గ్రూప్ అయిన జైష్ ఉల్–అదల్ 2018 అక్టోబర్ 16న 12 మంది ఐఆర్జీసీ గార్డులను అపహరించింది. పాక్–ఇరాన్ సరిహద్దుల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. వారిని సురక్షితంగా విడిపించేందుకు ఇరు దేశాల మిలటరీ అధికారులు ఒక జాయింట్ కమిటీని ఏర్పాటు చేశారు. మిలటరీ ఆపరేషన్లు నిర్వహించి, ఇప్పటివరకు దాదాపు 10 మందిని ఐఆర్జీసీ గార్డులను విడిపించగలిగారు. తాజాగా సర్జికల్ స్ట్రైక్స్‌తో ఇరాన్ సైన్యం మిగిలిన ఇద్దరిని కూడా రక్షించింది. ఉగ్రవాద సంస్థ జైష్ ఉల్–అదల్ ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం సాగిస్తోంది. ఇరాన్‌లోని బలూచ్ సున్నీల హక్కులను కాపాడడానికి తాము పోరాడుతున్నామని చెబుతోంది. -
నేడు బీఎస్ఎఫ్ జవాన్‌ను భారత్‌కు అప్పగించనున్న పాక్
న్యూఢిల్లీ: కాశ్మీర్‌లోని సరిహద్దుప్రాంతంలో బుధవారం గస్తీ విధుల్లో ఉండగా, చీనాబ్ నది ప్రవాహంలో కొట్టుకుపోయి సరిహద్దుకు ఆవల పాకిస్థాన్ రేంజర్స్ దళాలకు పట్టుబడిన సరిహద్దు భద్రతాదళం (బీఎస్ఎఫ్) జవాన్, ఎట్టకేలకు శుక్రవారం క్షేమంగా విడుదలకానున్నారు. బీఎస్ఎఫ్ జవాన్ సత్యశీల్ యాదవ్‌ను శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు భారత్‌కు అప్పగిస్తామని పాకిస్థాన్ అధికారులు హామీ ఇచ్చారు. జవాన్ అప్పగింతపై జమ్మూ సరిహద్దులో నికోవాల్ వద్ద బీఎస్ఎఫ్, పాక్ రేంజర్స్ మధ్య గురువారం ఫ్లాగ్ మీటింగ్ జరిగింది. సత్యశీల్ యాదవ్‌ను శుక్రవారం అప్పగిస్తామనిపాక్ రేంజర్స్ ప్రతినిధి ఫ్లాగ్ మీటింగ్ అనంతరం ప్రకటించారు. యాదవ్ పరిస్థితి బాగుందని తమకు సమాచారం అందిందని ఆ వర్గాలు తెలిపాయి.