న్యూఢిల్లీ: కాశ్మీర్‌లోని సరిహద్దుప్రాంతంలో బుధవారం గస్తీ విధుల్లో ఉండగా, చీనాబ్ నది ప్రవాహంలో కొట్టుకుపోయి సరిహద్దుకు ఆవల పాకిస్థాన్ రేంజర్స్ దళాలకు పట్టుబడిన సరిహద్దు భద్రతాదళం (బీఎస్‌ఎఫ్) జవాన్, ఎట్టకేలకు శుక్రవారం క్షేమంగా విడుదలకానున్నారు. బీఎస్‌ఎఫ్ జవాన్ సత్యశీల్ యాదవ్‌ను శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు భారత్‌కు అప్పగిస్తామని పాకిస్థాన్ అధికారులు హామీ ఇచ్చారు.
జవాన్ అప్పగింతపై జమ్మూ సరిహద్దులో నికోవాల్ వద్ద బీఎస్‌ఎఫ్, పాక్ రేంజర్స్ మధ్య గురువారం ఫ్లాగ్ మీటింగ్ జరిగింది. సత్యశీల్ యాదవ్‌ను శుక్రవారం అప్పగిస్తామనిపాక్ రేంజర్స్ ప్రతినిధి ఫ్లాగ్ మీటింగ్ అనంతరం ప్రకటించారు. యాదవ్ పరిస్థితి బాగుందని తమకు సమాచారం అందిందని ఆ వర్గాలు తెలిపాయి.
నేడు బీఎస్‌ఎఫ్ జవాన్‌ను భారత్‌కు అప్పగించనున్న పాక్
Published Fri, Aug 8 2014 2:30 AM | Last Updated on Sat, Mar 23 2019 8:29 PM
Advertisement