Chenab river
-
Madhavi Latha: ఆమె నదిని దాటించింది
కింద గాఢంగా పారే చీనాబ్ నది. పైన 359 మీటర్ల ఎత్తులో రైలు బ్రిడ్జి. కశ్మీర్ లోయలో ఉధమ్‌పూర్ నుంచి బారాముల్లా వరకు వేయదలచిన భారీ రైలు మార్గంలో చీనాబ్‌ను దాటడం ఒక సవాలు. దాని కోసం సాగిన ఆర్చ్ బ్రిడ్జి నిర్మాణంలో మన తెలుగు ఇంజినీర్ మాధవీ లత కృషి కీలకం. ‘వరల్డ్ హైయ్యస్ట్ రైల్వే బ్రిడ్జి’ నిర్మాణంలో పాల్గొన్న మాధవీ లత పరిచయం. ఒక సుదీర్ఘకల నెరవేరబోతోంది. సుదీర్ఘ నిర్మాణం ఫలవంతం కాబోతూ ఉంది. దేశ అభివృద్ధిలో కీలకమైన రవాణా రంగంలో ఎన్ని ఘన నిర్మాణాలు సాగితే అంత ముందుకు పోతాము. అటువంటి ఘన నిర్మాణం జాతికి అందుబాటులో రానుంది. జమ్ము కశ్మీర్లో ప్రపంచంలోనే అతి ఎత్తయిన రైల్వేవంతెన ట్రయల్ రన్ పూర్తి చేసుకుని త్వరలోనే కార్యకలాపాలు నిర్వహించనుంది. అయితే ఈ క్లిష్టమైన నిర్మాణంలో తెలుగు మహిళా ఇంజినీర్ కీలకపాత్ర పోషించడం ఘనంగా చెప్పుకోవాల్సిన సంగతి. తెనాలికి చెందిన ప్రొఫెసర్ గాలి మాధవీలతదే ఈ ఘనత. చీనాబ్ ఆర్చ్ బ్రిడ్జ్ భారతీయ రైల్వే 2004లో జమ్ము–కశ్మీర్లో భారీ రైలు ప్రాజెక్ట్‌కు అంకురార్పణ చేసింది. జమ్ము సమీపంలోని ఉధంపూర్ నుంచి శ్రీనగర్ సమీపంలోని బారాముల్లా వరకు రైలు మార్గం నిర్మించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఈ మార్గంలో రీసీ జిల్లా బాక్కల్ దగ్గర చీనాబ్ నదిపై వంతెన నిర్మించాల్సి వచ్చింది. ఇది చాలా క్లిష్టమైన నిర్మాణం. ఎందుకంటే ఇది ఐఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తు వంతెన అవుతుంది. అయినప్పటికీ మన ఇంజినీర్లు దశల వారీగా నిర్మాణం పూర్తి చేయగలిగారు. జూలైలో దీని కార్యకలాపాలు పూర్తిస్థాయిలో మొదలవుతాయి. ప్రొఫెసర్‌గా పని చేస్తూ... ప్రకాశం జిల్లా ఏడుగుండ్లపాడుకు చెందిన మాధవీలత కాకినాడలో ఇంజినీరింగ్ చేశారు. ఐ.ఐ.టి. మద్రాస్‌లో పీహెచ్డీ చేశారు. బెంగళూరులోని ఐ.ఐ.ఎస్.సి.లో ‘రాక్ మెకానిక్స్’లో పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్‌ను కొనసాగించారు. బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్న మాధవీలత అక్కడే సెంటర్ ఫర్ సస్టెయినబుల్ టెక్నాలజీస్ విభాగానికి చైర్పర్సన్ గా కూడా ఉంటూ సైన్స్ ను, టెక్నాలజీని గ్రామీణాభివృద్ధికి చేరువ చేసే ప్రాజెక్టులకు నాయకత్వం వహిస్తున్నారు. అయితే ‘రాక్ మెకానిక్స్’లో మాధవీలతకు ఉన్న అనుభవమే ఆమెను చీనాబ్ వంతెన నిర్మాణంలో పాల్గొనేలా చేసింది. చీనాబ్ వంతెన నిర్మాణానికి రూ.1400 కోట్లు వ్యయం చేస్తే 300 మంది సివిల్ ఇంజినీర్లు, 1300 మంది వర్కర్లు రేయింబవళ్లు పని చేశారు. బ్రిడ్జ్‌ను రెండు కొండల మధ్య నిర్మించాల్సి ఉన్నందున ఇంజినీరింగ్ డిజైన్ చాలా క్లిష్టంగా మారింది. అయినప్పటికీ అక్కడి రాళ్లను పరిశోధించి, అధ్యయనం చేసిన మాధవీలత, పటిష్టమైన వాలు స్థిరీకరణ ప్రణాళికను రూపొందించి, అమలును నిరంతరం పర్యవేక్షిస్తూ వచ్చారు. ఆమె విశ్లేషణ, సాంకేతిక సూచనలను దేశంతోపాటు విదేశాల్లోని పలువురు నిపుణులు తనిఖీ చేసి ఆమోదించడంతో వంతెన నిర్మాణం ముందుకు సాగింది. ఈ రైలు మార్గంలో నిర్మించిన కొన్ని సొరంగాల నిర్మాణంలోనూ మాధవీలత పాల్గొన్నారు. అవకాశం ఇలా... ఉధంపూర్ – బారాముల్లా కొత్త రైలుమార్గంలో చీనాబ్ నదిపై స్టీల్ ఆర్చ్ వంతెన నిర్మాణ బాధ్యతను కొంకణ్ రైల్వేస్ ‘ఆఫ్కాన్స్ ’ సంస్థకు ఇచ్చింది. ఆఫ్కాన్స్ సంస్థకు జియో టెక్నికల్ కన్సల్టెంటుగా ఉన్న మాధవీలతకు అలా ప్రాజెక్టులో పనిచేసే అవకాశం లభించింది. ‘ప్రాజెక్టు నిర్మాణంలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. చీనాబ్ నదిపై రెండు ఎత్తయిన వాలుకొండలను కలుపుతూ సాగిన ఈ వంతెన నిర్మాణంలో వాలు స్థిరత్వం కీలకమైంది. రాక్ మెకానిక్స్ సాంకేతికత, స్థిరత్వ అంశాలను అర్థం చేసుకోవటం, కొండ వాలుల స్థిరత్వాన్ని పొందటానికి నేను పరిష్కారాలను అందించటంతో ఇప్పుడో ఇంజినీరింగ్ అద్భుతం సాక్షాత్కరించింది. జోన్ భూకంపాలను, గంటకు 266 కి.మీ వేగంతో వీచే గాలులను, తీవ్రమైన పేలుళ్లను తట్టుకునేలా ఈ వంతెన నిర్మితమైంది’ అన్నారు మాధవీలత. ‘నేల పటిష్టతపై ఐ.ఐ.టి మద్రాస్‌లో నా పీహెచ్డీ పరిశోధనల్లో భాగంగా పాలిమర్లను ఉపయోగించి పటిష్టమైన రోడ్ల నిర్మాణానికి వినూత్న సాంకేతిక విధానాన్ని రూపొందించాను. ఆ దిశగా మూడు దశాబ్దాలపాటు చేసిన పరిశోధనల ఫలితంగా నేడు భూకంప నిరోధక శక్తి కలిగిన నిర్మాణాల్లో పాలిమర్‌లని, రబ్బర్ టైర్ల వంటి వ్యర్థపదార్థాలని వినియోగించగలుగుతున్నాం’ అన్నారు. చీనాబ్ వంతెన నిర్మాణానికి రేయింబవళ్లు శ్రమించిన మాధవీలత, ఈ ప్రాజెక్టు కోసం ఎన్నో వ్యక్తిగత త్యాగాలు చేయాల్సి వచ్చిందని చెప్పారు. తన కుటుంబ ప్రాధాన్యతలను పక్కనపెట్టి, సైట్‌ను సందర్శించిన సందర్భాలను గుర్తు చేసుకుంటూ, ‘నా పిల్లల పరీక్షల సమయాల్లో కూడా వాళ్లను వదిలి వెళ్లాల్సి వచ్చేది. నా భర్త హరిప్రసాద్‌రెడ్డి, పిల్లలు అభిజ్ఞ, శౌర్యల సహనం, సహకారాలతో ఇది సాధ్యమైంది. చీనాబ్ వంతెన నా సొంత ప్రాజెక్టులా మారిపోయింది’ అన్నారు. – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి -
Chenab Railway Bridge: చుక్చుక్బండి.. మేఘాలలో ప్రయాణమండి..
ఇది విదేశాల్లోని చిత్రం కానే కాదు.. మనదే. మన దేశంలోనిదే. కశ్మీర్లో ఈ మధ్యే నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చీనాబ్ వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నిర్మితమైన రైల్వే బ్రిడ్జిగా పేరొందింది. ఇది రియాసి జిల్లాలోని బక్కర్, కౌరి మధ్య ఉంది. చీనాబ్ వంతెనకు సంబంధించిన కొన్ని ఫోటోలను రైల్వే శాఖ ట్విట్టర్లో షేర్ చేసింది. బ్రిడ్జి నిర్మాణం పూర్తయినా.. రైళ్ల రాకపోకలకు ఇంకా అనుమతించలేదు. డిసెంబర్లో ప్రారంభమయ్యే అవకాశముంది. -
చిమ్మ చీకటిలో ఆర్మీ రెస్క్యూ ఆపరేషన్.. వీడియో వైరల్
Daring Midnight Rescue: జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో చీనాబ్ నది మధ్యలో చిక్కుకున్న ఇద్దరు యువకులను భారత ఆర్మీ రక్షించింది. అర్ధరాత్రి చిమ్మచీకటిలో సాహసోపేతమైన రెస్క్యూ చేపట్టి మరీ వారిని రక్షించింది. వివరాల్లోకి వెళితే.. సునీల్, బబ్లూలు, జేసీబీ వాహనంలో చీనాబ్ నది దాటుతుండగా నది ప్రవాహంలో చిక్కుకుపోయారు. పైగా నీటిమట్టం క్రమంగా పెరగడంతో రక్షించేంత వరకు వాహనంపై కూర్చోవాలని అధికారులు సూచించారు. సివిల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఈ సంఘటన గురించి సమాచారం అందుకున్న ఆర్మీ జవాన్లు ముమ్మరంగా రెస్క్యూ చర్యలు చేపట్టారు. ఈమేరకు ఆర్మీకి చెందిన సుమారు 17 మంది రాష్ట్రీయ రైఫిల్స్, స్థానిక పోలీసులతో కలిసి ఈ రెస్క్యూ సహాయక చర్యలో పాల్గొన్నారు. ఎట్టకేలకు అర్ధరాత్రి చిమ్మ చీకటిలోనే ఆ యువకులను రక్షించినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. దీంతో నెటిజన్లు పౌరులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం చేయడానికి భారత సైన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందంటూ ప్రశంసిస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. #IndianArmy carried out rescue of two youth stuck in #Chenab river near village Sohal, #Kishtwar, #JammuKashmir. The water level was rising at fast pace, Soldiers rappelled across the river & rescued the youth to safety.@adgpi @Whiteknight_IA @ANI @ABPNews pic.twitter.com/aewQKQLKWJ — NORTHERN COMMAND - INDIAN ARMY (@NorthernComd_IA) May 8, 2022 (చదవండి: ఇండిగో ఘటనపై స్పందించిన సీఈవో) -
2022 ఆగస్ట్‌కు ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన
న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్‌లోని ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన త్వరలో ప్రారంభం కాబోతోంది. చెనాబ్ నదిపై నిర్మిస్తున్న ఈ వంతెన ఆగష్టు 2022 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ఇది కశ్మీర్ లోయను భారతదేశంలోని ఇతర ప్రాంతాలతో కలుపుతుంది. రియాసి జిల్లాలోని కౌరి గ్రామంలో కత్రా-బనిహాల్ రైల్వే మార్గంలో ఈ వంతెన నిర్మిస్తున్నారు. ఈ వంతెన చెనాబ్ నది మట్టానికి 359 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది పారిస్‌లోని ఐకానిక్ ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ వంతెన పొడవు 1.3 కిలోమీటర్లు. రిక్టర్ స్కేల్లో 7 కంటే ఎక్కువ కొలిచే భూకంపాన్ని తట్టుకోగలదు. ఇది కత్రా నుంచి శ్రీనగర్ వరకు ప్రయాణ సమయాన్ని 5-6 గంటలు తగ్గిస్తుంది. (ప్రపంచంలోనే అతిఎత్తైన రైల్వే వంతెన!) ఈ విషయంపై డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ ఆర్ఆర్ మాలిక్ మాట్లాడుతూ.. ‘వంతెన నిర్మాణం పూర్తికి మాకు 2022 వరకు గడువు ఉంది. ఇది నిర్మించడం అంత తేలికైన పని కాదు. చాలా కష్టతరమైనది. అయితే వైష్ణో దేవి పుణ్యక్షేత్రానికి ప్రసిద్ధి చెందిన జియాసి జిల్లాలో అతి పెద్ద రైల్వే వంతెన ప్రాజెక్టు రావడంతో పర్యాటక రంగంలో మార్పు రాబోతుంది’ అన్నారు. ఈ వంతెనపై హెలిప్యాడ్ ఉండటం వల్ల ఢిల్లీ ప్రజలు ఛాపర్ ద్వారా రావొచ్చని తెలిపారు. ఇది స్థానిక ఉపాధిని, ఆర్థిక వ్యవస్థను మెరుగు పరుస్తుందన్నారు.(తెరుచుకోనున్న వైష్ణోదేవి ఆలయం) కాగా ఈ రైల్వే వంతెన ప్రాజెక్టును కొంకణ్ రైల్వే నిర్మిస్తోంది. ఈ వంతెన నిర్మాణం 2004 లో ప్రారంభమైంది. నిర్మాణంలో ఉన్న వంతెన 266 కిలోమీటర్ల వేగంతో గాలులను తట్టుకోగలదు. దాని కాల పరిమితి 120 సంవత్సరాలు ఉంటుంది. ఈ రైల్వే మార్గంలో ఉధంపూర్–కాట్రా(25 కిలోమీటర్లు) సెక్షన్, బనిహాల్– క్వాజిగుండ్ (18 కి.మీ.)సెక్షన్, క్వాజిగుండ్–బారాముల్లా (118 కి.మీ.) సెక్షన్ల పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. కశ్మీర్ రైల్వే ప్రాజెక్టులోని ఉధంపూర్- శ్రీనగర్-బారాముల్లా విభాగంలో భాగమైన కత్రా, బనిహాల్ మధ్య ఉన్న ఈ వంతెన కీలకమైన లింక్. -
ప్రపంచంలోనే అతిఎత్తైన రైల్వే వంతెన!
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో చీనాబ్ నదిపై నిర్మిస్తున్న ప్రపంచంలోనే అతిఎత్తైన రైల్వే వంతెన పనులు వచ్చే ఏడాదికి పూర్తికానున్నాయి. కశ్మీర్ ను మిగతాదేశంతో కలిపే ఈ వారధిపై 2022 డిసెంబర్లో మొట్టమొదటి రైలు ప్రయాణం చేసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. 359 మీటర్ల ఎత్తులో 467 మీటర్ల పొడవైన ఈ వారధి ప్రపంచంలోనే అతి పొడవైన రైల్వే వంతెన. గంటకు 266 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను సైతం తట్టుకునేలా ఈ వంతెనను డిజైన్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. కేంద్రం ప్రత్యక్ష పర్యవేక్షణతో ఏడాదిగా పనులు వేగవంతం అయ్యాయన్నారు. ఈ రైల్వే మార్గంలో ఉధంపూర్–కాట్రా(25 కిలోమీటర్లు) సెక్షన్, బనిహాల్– క్వాజిగుండ్ (18 కి.మీ.)సెక్షన్, క్వాజిగుండ్–బారాముల్లా (118 కి.మీ.) సెక్షన్ల పనులు ఇప్పటికే పూర్తయ్యాయని తెలిపారు. ప్రస్తుతం 111 కిలోమీటర్ల పొడవైన కాట్రా–బనిహాల్ సెక్షన్లో పనులు కొనసాగుతున్నాయని అధికారులు చెప్పారు. 2018 వరకు ప్రాజెక్టు అంచనా వ్యయంలో 27 శాతమే ఖర్చు కాగా ఆ తర్వాత 54 శాతం మేర వెచ్చించినట్లు అధికారులు వివరించారు. చదవండి: ఆమెతో రాఖీ కట్టించుకో, 11 వేలు ఇవ్వు: కోర్టు -
ఈఫిల్ టవర్‌కన్నా ఎత్తైన రైల్వే బ్రిడ్జ్
న్యూఢిల్లీ: భారత రైల్వే వ్యవస్థ మరో సంచనానికి సిద్ధమైంది. జమ్మూ కాశ్మీర్‌లోని చీనాబ్ నదిపై ఓభారీ వంతెన నిర్మాణానికి ప్రణాలికలు వేస్తోంది. ప్రపంచంలో అత్యంత ఎత్తైన రైల్వే వంతెన ఇది. సుమారు 1.3కిలోమీటర్ల పొడవుతో జమ్మూలోని కాట్ర, శ్రీనగర్‌లోని కౌరీ ప్రాంతాలను కలుపుతూ భారత రైల్వే ఈ వంతెన నిర్మించనుంది. భారీ వంపు తిరిగిన ఆకారంలో సుమారు రూ.1110 కోట్లతో నిర్మించనున్నారు. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్ల ప్రాంతాలను కలపడంలో ఈబ్రిడ్జ్ కీలకపాత్ర పోషించనుంది. తద్వారా ఆయాప్రాంతాల్లో రవాణా వ్యవస్థ వృద్ధి చెందనుందని రైల్వే అధికారులు తెలిపుతున్నారు. ఈ వంతెన పూర్తి అయితే చైనాలోని సుభై(275 మీటర్లు) వంతెన రికార్డును అధికమిస్తుంది. దీనిని పూర్తి చేయడం ఇండియన్ రైల్వేకు ఓ సవాలు లాంటిదని, పూర్తి చేస్తే ఇంజనీరింగ్ అద్భుతం అవుతుందని రైల్వేశాఖా అధికారి తెలిపారు. ఈభారీ నిర్మాణంలో సుమారు 24వేల టన్నుల ఇనుమును ఉపయోగించనున్నారు. ఇది చీనాబ్నది ఉపరితలానికి సుమారు 359మీటర్లు ఎత్తులో నర్మించనున్నారు. ఉగ్రదాడులు, తక్కువ ఎక్కువ ఉష్ణోగ్రతలను తట్టుకోనే విధంగా ప్రత్యేక ఇనుమును ఇందులో వాడనున్నారు. అంతేకాకుండా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు, ఆన్లైన్లో నిరంతర పర్యవేక్షణ చేసేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. -
నేడు బీఎస్ఎఫ్ జవాన్‌ను భారత్‌కు అప్పగించనున్న పాక్
న్యూఢిల్లీ: కాశ్మీర్‌లోని సరిహద్దుప్రాంతంలో బుధవారం గస్తీ విధుల్లో ఉండగా, చీనాబ్ నది ప్రవాహంలో కొట్టుకుపోయి సరిహద్దుకు ఆవల పాకిస్థాన్ రేంజర్స్ దళాలకు పట్టుబడిన సరిహద్దు భద్రతాదళం (బీఎస్ఎఫ్) జవాన్, ఎట్టకేలకు శుక్రవారం క్షేమంగా విడుదలకానున్నారు. బీఎస్ఎఫ్ జవాన్ సత్యశీల్ యాదవ్‌ను శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు భారత్‌కు అప్పగిస్తామని పాకిస్థాన్ అధికారులు హామీ ఇచ్చారు. జవాన్ అప్పగింతపై జమ్మూ సరిహద్దులో నికోవాల్ వద్ద బీఎస్ఎఫ్, పాక్ రేంజర్స్ మధ్య గురువారం ఫ్లాగ్ మీటింగ్ జరిగింది. సత్యశీల్ యాదవ్‌ను శుక్రవారం అప్పగిస్తామనిపాక్ రేంజర్స్ ప్రతినిధి ఫ్లాగ్ మీటింగ్ అనంతరం ప్రకటించారు. యాదవ్ పరిస్థితి బాగుందని తమకు సమాచారం అందిందని ఆ వర్గాలు తెలిపాయి.