కరీంనగర్లో ఘరానా మోసం
హుస్నాబాద్: రూ. 40 వేలు చెల్లిస్తే బోరు వేయడంతో పాటు పంపుసెట్ అమర్చి ఇస్తామని రైతులను నమ్మించి సుమారు 200 మంది వద్ద నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసిన ఓ వ్యక్తి పరారయ్యాడు. దీంతో బాధితులు ఆందోళనకు దిగారు. వివరాలు.. కరీంనగర్ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్బాపూర్ కు చెందిన అంబాల ప్రసాద్ తక్కువ ధరకే బోరు వేసి మోటర్ అమర్చి ఇస్తామని చెప్పి గ్రామస్థుల నుంచి లక్షల్లో దండుకొని ఊరు వదిలి వెళ్లిపోయాడు. మోసపోయామని తెలుసుకున్న రైతులు ఈ విషయంపై పోలీసులను ఫిర్యాదు చేశారు.