boss daughter
-
బాస్ కూతురితో ప్రేమ లొల్లి
సిడ్నీ: బాస్ కూతురును ప్రేమించబోయి ఆస్ట్రేలియాలో ఓ భారతీయ సంతతికి చెందిన యువకుడు అబాసు పాలయ్యాడు. ఉద్యోగాన్ని కోల్పోవడమే కాకుండా.. పోలీసుల అతడిని అరెస్టు చేసి కోర్టుకు తీసుకెళ్లడంతో అతడికి దాదాపు రెండు వేల డాలర్ల ఫైన్ కూడా వేసింది. భారత్‌కు చెందిన అభినవ్ సింగ్(33) అనే యువకుడు గ్లాడ్ స్టోన్ నగరంలో ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆ కంపెనీ యజమాని కూతురుపై మనసు పారేసుకున్న అతడు.. ఆమెకు తెలియకుండా ఫోన్ నెంబర్ దొంగిలించి రెండు నెలల కాలంలో వందలసార్లు ఫోన్లు, మెయిల్స్, మెస్సేజ్‌లు పంపించాడు. కానీ, వాటికి ఆమె ఎలాంటి బదులు ఇవ్వలేదు. అభినవ్ మాత్రం అలాగే మెస్సేజ్‌లు పంపించడంతోపాటు ఏకంగా ఓసారి బాస్ ఇంటికి వెళ్లి తన కూతురుని ప్రేమిస్తున్న విషయాన్ని చెప్పాడు. ఆ సమయంలో ఆ అమ్మాయి కూడా ఎక్కువగా ఊహల్లో ఊరేగెకు అంటూ హెచ్చరించింది. అయినప్పటికీ అతడి తీరు మారకపోవడంతో పోలీసులు తొలుత అతడిని హెచ్చరించారు. అయితే, తన భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని, అందుకే తనకు ప్రేమను వ్యక్తం చేసే హక్కు ఉందంటూ పోలీసులకు తిరిగి సమాధానం ఇచ్చాడు. దీంతో పోలీసులు చివరికి అతడిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. -
బాస్ కూతురిపై వేధింపులు.. లక్షన్నర జరిమానా
బాస్ కూతురిని ఫోన్ కాల్స్, మెసేజిలు, వాయిస్ మెసేజిలతో వేధించినందుకు ఆస్ట్రేలియాలో పనిచేసే ఓ భారత సంతతి ఇంజనీర్‌కు దాదాపు లక్షన్నర రూపాయల జరిమానా విధించడంతో పాటు, స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాలని ఆదేశించారు. కెనడా పాస్‌పోర్టు ఉన్న అభినవ్ సింగ్ (33).. తన ఆఫీసులోనే పనిచేసే బాస్ కూతురికి వందలాది ఎస్ఎంఎస్లు, ఫోన్ కాల్స్, వాయిస్ మెసేజిలు పంపేవాడు. పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా అతడు వినిపించుకోలేదు. అయితే, తాను ఆమెను ప్రేమిస్తున్నానని, ఆ విషయాన్ని ఆమెకు చెప్పే హక్కు తనకుందని అభినవ్ సింగ్ వాదిస్తున్నాడు. ఇక ఇప్పుడు తాను అధికారికంగా యుద్ధం ప్రకటిస్తున్నానని, ఎలాగైనా ఆమె ప్రేమను పొందుతానని ధీమా వ్యక్తం చేశాడు. ఆమె ఎప్పుడూ సింగ్ మీద ప్రేమ ఉన్నట్లు చెప్పలేదని, అయినా ఆఫీసు రికార్డులు గాలించి ఆమె నంబరు తీసుకుని మరీ వేధించాడని ప్రాసిక్యూషన్ వర్గాలు ఆరోపించాయి. తర్వాత సింగ్‌ను ఇమ్మిగ్రేషన్ శాఖ, బోర్డర్ ప్రొటెక్షన్ శాఖలు అరెస్టు చేశాయి. అతడి వల్ల డాక్టర్‌గా పనిచేసే భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఇబ్బందుల్లో పడ్డారని డిఫెన్స్ న్యాయవాది పేర్కొన్నారు.