బాస్ కూతురితో ప్రేమ లొల్లి | Indian-Origin Engineer to be Deported for Stalking Boss's Daughter: Report | Sakshi
Sakshi News home page

బాస్ కూతురితో ప్రేమ లొల్లి

Published Tue, Sep 15 2015 9:46 AM | Last Updated on Sun, Sep 3 2017 9:27 AM

బాస్ కూతురితో ప్రేమ లొల్లి

బాస్ కూతురితో ప్రేమ లొల్లి

సిడ్నీ: బాస్ కూతురును ప్రేమించబోయి ఆస్ట్రేలియాలో ఓ భారతీయ సంతతికి చెందిన యువకుడు అబాసు పాలయ్యాడు. ఉద్యోగాన్ని కోల్పోవడమే కాకుండా.. పోలీసుల అతడిని అరెస్టు చేసి కోర్టుకు తీసుకెళ్లడంతో అతడికి దాదాపు రెండు వేల డాలర్ల ఫైన్ కూడా వేసింది. భారత్కు చెందిన అభినవ్ సింగ్(33) అనే యువకుడు గ్లాడ్ స్టోన్ నగరంలో ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆ కంపెనీ యజమాని కూతురుపై మనసు పారేసుకున్న అతడు.. ఆమెకు తెలియకుండా ఫోన్ నెంబర్ దొంగిలించి రెండు నెలల కాలంలో వందలసార్లు ఫోన్లు, మెయిల్స్, మెస్సేజ్లు పంపించాడు.

కానీ, వాటికి ఆమె ఎలాంటి బదులు ఇవ్వలేదు. అభినవ్ మాత్రం అలాగే మెస్సేజ్లు పంపించడంతోపాటు ఏకంగా ఓసారి బాస్ ఇంటికి వెళ్లి తన కూతురుని ప్రేమిస్తున్న విషయాన్ని చెప్పాడు. ఆ సమయంలో ఆ అమ్మాయి కూడా ఎక్కువగా ఊహల్లో ఊరేగెకు అంటూ హెచ్చరించింది. అయినప్పటికీ అతడి తీరు మారకపోవడంతో పోలీసులు తొలుత అతడిని హెచ్చరించారు. అయితే, తన భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని, అందుకే తనకు ప్రేమను వ్యక్తం చేసే హక్కు ఉందంటూ పోలీసులకు తిరిగి సమాధానం ఇచ్చాడు. దీంతో పోలీసులు చివరికి అతడిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement