Bounce Company
-
దేశంలోనే తొలిసారి, ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ స్వాప్లో సరికొత్త రికార్డ్‌లు
ముంబై: స్మార్ట్ వాహన సేవల సంస్థ బౌన్స్ తమ విద్యుత్ వాహనాల చార్జింగ్ నెట్వర్క్ ద్వారా 10 లక్షల పైచిలుకు బ్యాటరీలను స్వాప్ (మార్పిడి) చేసినట్లు వెల్లడించింది. దేశీయంగా ఈ ఘనతను సాధించిన తొలి సంస్థ తమదేనని తెలిపింది. ఇటీవల తమ ఈ–స్కూటర్ ఇన్ఫినిటీ ఈ1ను ఆవిష్కరించిన నేపథ్యంలో బ్యాటరీ–స్వాపింగ్ నెట్‌వర్క్‌ను మరింత పటిష్టం చేసుకుంటున్నట్లు వివరించింది. రేంజికి సంబంధించిన ఆందోళన తగ్గేలా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు బ్యాటరీ–స్వాపింగ్, బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (బీఏఏఎస్) అత్యంత సమర్ధమంతమైన పరిష్కార మార్గాలని ప్రభుత్వం, విధానకర్తలు గుర్తించారని బౌన్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో వివేకానంద హలకెరె తెలిపారు. బ్యాటరీల మార్పిడి విధానంలో బౌన్స్ విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిందని, దేశంలోనే అతి పెద్ద నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఇన్ఫినిటీ ఈ1 ఈ–స్కూటర్ దేశంలోనే తొలిసారిగా ’బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్’ ఆప్షన్‌తో లభిస్తుందని ఆయన చెప్పారు. బ్యాటరీతో కలిపి కూడా దీన్ని కొనుగోలు చేయొచ్చని వివరించారు. స్కూటర్ నుంచి బ్యాటరీని తొలగించి కస్టమర్లు తమ ఇంటిలో లేదా ఆఫీసు లేదా మరెక్కడైనా చార్జింగ్ చేసుకునే వీలుంటుందని వివేకానంద వివరించారు. పెట్రోల్ బంకుల తరహాలోనే బౌన్స్ స్వాపింగ్ స్టేషన్లు పని చేస్తాయి. చార్జింగ్ ఆఖరు దశకు వచ్చిన బ్యాటరీలను ఈ స్టేషన్లలో పూర్తిగా చార్జ్ అయిన బ్యాటరీలతో సులభంగా మార్చుకోవచ్చు. కస్టమర్లు తమ బ్యాటరీని చార్జింగ్ చేసుకునేందుకు సుదీర్ఘ సమయం పాటు వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. -
Bounce Infinity E1 vs Ola S1: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఏది బెటర్..?
దేశంలో భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల నేపథ్యంలో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాల మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ప్రజల కోరిక మేరకు ఈవీ తయారీ కంపెనీలు కూడా తక్కువ ధరలో మంచి వాహనలను మార్కెట్లోకి తీసుకొని వస్తున్నాయి. దీంతో, గత ఏడాది అమ్మకాలతో పోలిస్తే ఈ ఏడాది ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పుంజుకున్నాయి. కొద్ది రోజుల క్రితం స్వదేశీ ఈవీ స్టార్టప్ బౌన్స్ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇనిఫినిటీ ఈ1ను లాంఛ్ చేసింది. ఈ స్కూటర్ ఓలా ఎస్1, అథర్ 450ఎక్స్, బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్, టివీఎస్ ఐక్యూబ్ వంటి ప్రత్యర్థుల స్కూటర్లతో పోటీపడనుంది. ఇప్పటివరకు దేశంలో ఓలా ఎస్1 స్కూటర్లకు మంచి ఆదరణ లభించింది. ఇప్పుడు అదే స్థాయిలో బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇనిఫినిటీ ఈ1కు కూడా క్రేజ్ లభిస్తుంది. ప్రజలు ఓలా ఎస్1 స్కూటర్లను కొనాలని చూస్తున్న తరుణంలో ఇనిఫినిటీ ఈ1 వచ్చింది. దీంతో చాలా మంది వినియోగదారులు ఈ రెండింటిలో ఏది బెటర్..? అనే ఆలోచనలో పడ్డారు. అయితే, మనం ఇప్పుడు ఈ రెండింటిలో ఏది ఉత్తమం అనేది తెలుసుకుందాం.. (చదవండి: వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్..!) బౌన్స్ ఇనిఫినిటీ ఈ1 వర్సెస్ ఓలా ఎస్1: ధర బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 చాలా తక్కువ ధరకు లభ్యం అవుతుంది. ఈ స్కూటర్ ఓలా ఎస్1 కంటే చాలా చౌక. 'బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్'తో వచ్చిన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ బౌన్స్. దేశవ్యాప్తంగా ఆయా నగరాల్లో ఏర్పాటుచేసిన బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ల ద్వారా బ్యాటరీ ఛార్జ్ జీరో అవ్వగానే ఆయా స్వాపింగ్ స్టేషన్ల నుంచి ఫుల్ ఛార్జ్ బ్యాటరీలను ఉపయోగించవచ్చు. బ్యాటరీ, ఛార్జర్‌తో కూడిన బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 ధర రూ.68,999 (ఢిల్లీ ఎక్స్-షోరూమ్), కాగా బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్‌లో స్కూటర్‌ను తీసుకుంటే ఈ స్కూటర్ ధర రూ.45,099 (ఢిల్లీ ఎక్స్-షోరూమ్) ధరగా ఉంది. మరోవైపు, ఓలా ఎస్1 బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో రాదు. అలాగే, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.85,099(ఎక్స్ షోరూమ్, ఢిల్లీ). బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 వర్సెస్ ఓలా ఎస్1: బ్యాటరీ, రేంజ్& పనితీరు బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 స్కూటర్లో వాటర్‌ప్రూఫ్ IP67 రేటెడ్ 2 కెడబ్ల్యుహెచ్ 48V బ్యాటరీతో 39AHతో వస్తుంది, ఇది 83Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది గరిష్టంగా గంటకు 65కిమీ వేగంతో ప్రయాణిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 85 కిమీ మేర ప్రయాణిస్తోందని కంపెనీ వెల్లడించింది. బౌన్స్ ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ 0 నుంచి 40 కెఎమ్‌పీహెచ్ వేగాన్ని 8 సెకన్లలో అందుకోగలదు. ఇది BLDC హబ్ మోటార్ సహాయంతో పనిచేస్తుంది. ఇందులో మూడు రకాల విభిన్న(డ్రాగ్, ఎకో & పవర్) రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రివర్స్ మోడ్‌లో కూడా పరుగులు తీస్తుంది. ఓలా ఎస్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం 90, ఫుల్ ఛార్జ్ చేస్తే 121 కిమీల దూరం వెళ్లనుంది. ఓలా ఎస్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ 3.6 సెకన్లలో 0-40 వేగాన్ని అందుకుంటుంది. ఇది 2.98 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది. అంటే, ఇది ఇన్ఫినిటీ ఈ1 కంటే చాలా ఎక్కువ దూరం వేగంగా పరిగెత్తగలదు. (చదవండి: సుడిగాడు.. 2 లక్షల కోట్ల జరిమానా తప్పించుకున్నాడు) బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1తో పోలిస్తే ఓలా ఎస్1 ఎలక్ట్రిక్ స్కూటర్ అనేక అదనపు ఫీచర్లతో వస్తుంది. డిజైన్ పరంగా కూడా, బౌన్స్ ఇన్ఫినిటీ ఇ1తో పోలిస్తే ఓలా ఎస్1 మరింత స్టైలిష్, ఆధునికంగా కనిపిస్తుంది. ఇది మంచి రేంజ్ అందిస్తుంది. ట్యాబ్ లాంటి డిజిటల్ డిస్ ప్లే కనెక్టివిటీ ఆప్షన్లు, నావిగేషన్ ఫీచర్స్ ఓలా ఎస్1 మెరుగ్గా ఉంది. చివరగా చెప్పాలంటే, ఈ రెండు స్కూటర్లు వాటి వాటి ధరల పరంగా చూస్తే రెండు చాలా ఉత్తమమైనవి. -
ఎలక్ట్రిక్ స్కూటర్లలో సంచలనం..! రేంజ్ ఎక్కువే..రేటు తక్కువే..!
బెంగళూరుకు చెందిన మొబిలిటీ సంస్థ బౌన్స్ భారత మార్కెట్లలోకి సరికొత్త ‘బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1’ స్కూటర్‌ను లాంచ్ చేసింది. ఈ స్కూటర్ లాంచ్‌తో ఎలక్ట్రిక్ వాహనాల్లో సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్ఠింది. బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ బైక్ రెంటల్ సర్వీసెస్‌తో పరిచయమైన బౌన్స్ ఎలక్ట్రిక్ వాహనాల్లో కూడా సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 స్కూటర్‌ను 'బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్'తో వచ్చిన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ బౌన్స్. దేశవ్యాప్తంగా ఆయా నగరాల్లో ఏర్పాటుచేసిన బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ల ద్వారా బ్యాటరీ ఛార్జ్ జీరో అవ్వగానే ఆయా స్వాపింగ్ స్టేషన్ల నుంచి ఫుల్ ఛార్జ్ బ్యాటరీలను ఉపయోగించవచ్చు. దేశవ్యాప్తంగా 3500 బ్యాటరీ స్వాపింగ్ సర్వీస్ స్టేషన్లను పార్క్ ప్లస్ భాగస్వామ్యంతో బౌన్స్ ఏర్పాటుచేయనుంది. ధర ఏంతంటే..! బ్యాటరీ, ఛార్జర్‌తో కూడిన బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 ధర రూ.68,999 (ఢిల్లీ ఎక్స్-షోరూమ్), కాగా బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్‌లో స్కూటర్‌ను తీసుకుంటే ఈ స్కూటర్ ధర రూ. 45,099 (ఢిల్లీ ఎక్స్-షోరూమ్) ధరగా ఉంది. బ్యాటరీ లేకుండా సరసమైన ధరకు బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 స్కూటర్‌ను కొనుగోలుదారులు పొందవచ్చు. బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 ఎలక్ట్రిక్ స్కూటర్ స్పోర్టీ రెడ్, స్పార్కిల్ బ్లాక్, పెరల్ వైట్, డెసాట్ సిల్వర్, కామెడ్ గ్రే కలర్ వేరియంట్స్‌లో రానుంది. చదవండి: తక్కువ ధరలోనే..! భారత మార్కెట్లలోకి మరో ఎలక్ట్రిక్ బైక్..! బుకింగ్స్, డెలివరీ ఎప్పుడంటే..! బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 స్కూటర్‌ను కంపెనీ అధికారిక వెబ్సైట్, డీలర్షిప్ నెట్వర్క్ నుంచి రూ. 499 చెల్లించి ప్రీ-బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్కూటర్లను కంపెనీ వచ్చే ఏడాది మార్చి నుంచి డెలివరీలను చేపట్టనుంది. ఈ స్కూటర్ కొనుగోలుపై ఫేమ్-2 పథకం కూడా వర్తించనుంది. కొనుగోలుదారులకు 50వేల కిమీలతోపాటు, 3 సంవత్సరాల వారంటీను కంపెనీ అందిస్తోంది. స్కూటర్ పర్ఫారెమెన్స్..! బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1 స్కూటర్లో వాటర్‌ప్రూఫ్ IP67 రేటెడ్ 48V బ్యాటరీతో 39AHతో వస్తుంది, ఇది 83Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది గరిష్టంగా గంటకు 65కిమీ వేగంతో ప్రయాణిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 85 కిమీ మేర ప్రయాణిస్తోందని కంపెనీ వెల్లడించింది. బౌన్స్ ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ 0 నుంచి 40 కెఎమ్‌పీహెచ్ వేగాన్ని 8 సెకన్లలో అందుకోగలదు. చదవండి: ఛార్జింగ్ సమస్యలకు చెక్..! ఎలక్ట్రిక్ స్కూటర్లలో సరికొత్త పంథా..! -
ఛార్జింగ్ సమస్యలకు చెక్..! ఎలక్ట్రిక్ స్కూటర్లలో సరికొత్త పంథా..!
బెంగళూరుకు చెందిన ప్రముఖ రెంటల్ బైక్ సర్వీసుల సంస్థ బౌన్స్ త్వరలోనే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్ చేయనున్న విషయం తెలిసిందే. ఛార్జింగ్ కష్టాలకు చెక్‌పెడుతూ ‘బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్’ మోడల్‌తో బౌన్స్ రానుంది. అందుకుగాను ఆటోమెటేడ్, మెకానికల్ పార్కింగ్ సర్వీసులను అందిస్తోన్న పార్క్ ప్లస్ కంపెనీతో బౌన్స్ కలిసి పనిచేయనుంది. పార్క్‌ప్లస్ భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా 10 నగరాల్లో సుమారు 3500 బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లను బౌన్స్ ఏర్పాటుచేయనుంది. పార్క్ ప్లస్ అనేది కారు వినియోగదారులకు పార్కింగ్ స్లాట్లను చూపించే మొబైల్ యాప్. ఈ యాప్ సహయంతో ఆయా ప్రాంతాల్లో ఉండే బ్యాటరీ స్వాపింగ్ అవుట్లెట్లను చూపించనుంది. సరికొత్త పంథా..! ఛార్జింగ్ కష్టాలకు చెక్..! ఎలక్ట్రిక్ వాహనాల విషయంలో అతిపెద్ద సమస్య ఛార్జింగ్ సమయం. ఈవీ వాహనాలు నిర్దిష్ట దూరాలకు మాత్రమే ప్రయాణిస్తాయి. వీటి బ్యాటరీలను పూర్తిగా ఛార్జ్ చేయడానికి సుమారు 4 గంటల సమయం పడుతుంది. కాగా ఛార్జింగ్ కష్టాలకు చెక్‌పెడుతూ బౌన్స్ సరికొత్త పంథాతో మార్కెట్లలోకి రానుంది. ‘బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్’ మోడల్‌ను బౌన్స్ పరిచయం చేయనుంది. బౌన్స్ త్వరలోనే ఇన్ఫినిటీ అనే ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్‌చేయనుంది. ఇన్ఫినీటీ ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలుదారులు బ్యాటరీ లేకుండానే కొనుగోలు చేసే అవకాశాన్ని బౌన్స్ కల్పించనున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇన్ఫినిటీ బైక్ ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 40 నుంచి 50 శాతం మేర బౌన్స్ ఇన్పినీటీ బైక్ ధరలు తగ్గే అవకాశం ఉంది. ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ల ఛార్జ్ జీరో కాగానే సమీపంలో ఉండే పార్క్‌ప్లస్ బ్యాటరీ అవుట్లెట్ల సహయంతో ఫుల్ ఛార్జింగ్ బ్యాటరీలను క్షణాల్లో పొందే అవకాశాన్ని బౌన్స్ కల్పించనుంది. చదవండి: తక్కువ ధరలోనే..! భారత మార్కెట్లలోకి మరో ఎలక్ట్రిక్ బైక్..! -
తక్కువ ధరలోనే..! భారత మార్కెట్లలోకి మరో ఎలక్ట్రిక్ బైక్..!
Bounce Infinity Electric Scooter With Removable Battery Teased: బెంగళూరుకు చెందిన ప్రముఖ బైక్ రెంటల్ సర్వీసెస్ స్టార్టప్ బౌన్స్ త్వరలోనే భారత మార్కెట్లలో ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేయనుంది. డిసెంబర్ 2 న బౌన్స్ ఇన్ఫినిటీ ఈ-స్కూటర్‌ను లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. అదే రోజు ఈ-స్కూటర్ ప్రిబుకింగ్స్ కూడా ప్రారంభంకానున్నాయి. కొనుగోలుదారులు రూ.499 చెల్లించి ప్రి-బుకింగ్ చేసుకోవచ్చునని బౌన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే ఏడాది జనవరిలో ఈ బైక్‌లను బౌన్స్ డెలివరీ చేయనున్నుట్లు తెలుస్తోంది. చదవండి: ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాలకు అడ్డాగా భారత్.. లక్షల కోట్ల బిజినెస్! ఈవీపై కన్ను..! భారత మార్కెట్లలో ఎలక్ట్రిక్ వాహనాలపై వస్తోన్న ఆదరణను క్యాష్ చేసుకోవడానికి బౌన్స్ తన సొంత ఈ-స్కూటర్ ఎలక్ట్రిక్ వాహానంతో ముందుకొచ్చింది. అందుకుగాను బెంగళూరుకు చెందిన 22మోటార్స్ ఈవీ స్టార్టప్‌ను బౌన్స్ చేజిక్కించుకుంది. 22మోటార్స్‌తో సుమారు 7 మిలియన్ల డాలర్ల ఒప్పందాన్ని బౌన్స్ కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా.. రాజస్థాన్‌లోని భివాడిలోని 22మోటర్స్ తయారీ ప్లాంట్ బౌన్స్ కొనుగోలు చేసింది. అత్యాధునికమైన ఈ ప్లాంట్ సంవత్సరానికి 180,000 స్కూటర్లను తయారు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ బైక్ ధర సుమారు రూ. 75 వేలలోపు ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కసారి బ్యాటరీ ఫుల్ ఛార్జ్ చేస్తే 160 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంది. దేశంలో తొలి సారిగా సరికొత్త పంథా...! భారత్‌లో తొలిసారిగా ఎలక్ట్రిక్ మార్కెట్లలోకి బౌన్స్ సరికొత్త పంథాతో ముందుకురానుంది. ‘బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్’ మోడల్‌ను బౌన్స్ పరిచయం చేయనుంది. ఇన్ఫినిటీ ఈ-స్కూటర్లను కొనుగోలుదారులు విత్ అవుట్ బ్యాటరీ లేకుండా కొనుగోలుచేసే అవకాశాన్ని ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఇన్ఫినిటీ బైక్ ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు 40 నుంచి 50 శాతం మేర బౌన్స్ ఇన్పినీటీ బైక్ ధరలు తగ్గే అవకాశం ఉంది. పలు నగరాల్లో బ్యాటరీ ఛేంజ్ స్టేషన్లను బౌన్స్ ఏర్పాటు చేయనున్నుట్ల తెలుస్తోంది. వీటి సహయంతో వాహనదారులు బ్యాటరీ స్వాపబుల్ చేస్తూ... కేవలం బ్యాటరీ మార్పిడి చేసినప్పుడు మాత్రమే చెల్లించే విధానాన్ని బౌన్స్ తీసుకురానుంది. చదవండి: టెస్లాకు చెక్‌పెట్టనున్న ఫోర్డ్..! అదే జరిగితే..?