boxing ring
-
అక్కడ క్షణాల్లో బైడెన్‌ని ఓడిస్తానన్న ట్రంప్
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో సంచలన ప్రకటనలతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై తన స్టైల్లో వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లోకెక్కారు ట్రంప్. త్వరలో ప్రారంభం కానున్న బాక్సింగ్ మ్యాచ్ నేపథ్యంలో ఓ రిపోర్టర్ ఫోన్లో ట్రంప్‌తో.. బాక్సింగ్‌లో మీ డ్రీమ్ ఫైట్ ఎవరితో పోటీపడాలని భావిస్తున్నట్లు ప్రశ్నించాడు. అందుకు బదులుగా ట్రంప్.. నేను ప్రపంచంలో ఎవరినైనా ఎంపిక చేసుకోవాల్సి వస్తే, కేవలం ప్రొఫెషనల్ బాక్సర్తో మాత్రమే కాదని జో బైడెన్‌పై కూడా తలపడతానని తెలిపారు. దానికి వివరణగా బైడెన్‌తో పోరాటం నాకు చాలా సులువుగా ఉంటుందని, ఎందుకంటే ప్రస్తుతం ఆయన తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని పేర్కొన్నాడు. అంతేగాక ఆయన చాలా అంటే చాలా త్వరగానే రింగ్‌లో డౌన్ అవుతారని, మొదటి కొన్ని సెకండ్లలో బైడెన్ ఓడిపోతారని అనుకుంటున్నానని ఫన్నీగా సమాధానిమిచ్చారు. అయితే ఇటీవల అఫ్గనిస్తాన్ నుంచి అమెరికా బలగాలను ఉపసంహరించిన విషయంలో బైడెన్ విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అక్కడ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. Trump was asked who he would pick if he had to choose someone to box. He said he would pick Joe Biden and that he would "go down within the first few seconds." 😂 pic.twitter.com/WbPzY7c556 — Benny (@bennyjohnson) September 9, 2021 చదవండి: 9/11 Attacks: దాడి టైంలో బుష్ ఎక్కడున్నాడు? బైడెన్ గురించి లాడెన్ చెప్పిందే జరుగుతోందా? -
కోహ్లీ నాలుగేళ్ల సంపాదన ఒక్క ఫేక్ ఫైట్ ద్వారా ఆర్జించాడు
న్యూఢిల్లీ: టీమిండియా సారధి విరాట్ కోహ్లీ నాలుగేళ్ల సంపాదనను ఆ రిటైర్డ్ అమెరికన్ బాక్సర్ కేవలం ఒక్క రోజులో అర్జించాడు. ప్రపంచంలోనే అత్యధిక ధనార్జన కలిగిన క్రీడాకారుల్లో ఒకరైన కోహ్లీ.. పారితోషికాలు, ఎండార్స్మెంట్లు తదితర మార్గాల ద్వారా ఏడాదికి దాదాపు రూ. 196 కోట్ల రూపాయలు సంపాదిస్తుంటాడు. దీన్ని చూసే చాలా మంది ముక్కున వేలేసుకుంటుంటారు. అయితే కోహ్లీ నాలుగేళ్ల సంపాదనను కేవలం ఒక్క రోజులోనే కొల్లగొట్టాడు అమెరికా దిగ్గజ బాక్సర్ ఫ్లాయిడ్ మెవెదర్. అది కూడా ఓ ఫేక్ ఫైట్ చేసి ఈ మొత్తం అర్జించాడు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. జూన్ మొదటి వారంలో లోగన్ పాల్ అనే యూట్యూబర్‌తో బాక్సింగ్ రింగ్‌లో తలపడిన మెవెదర్.. ఆ మ్యాచ్ ద్వారా 100 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 742 కోట్లు) సంపాదించినట్లు చెప్పాడు. అదేదో ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో సంపాదించిందనుకుంటే పొరపడట్టే. ఈ భారీ మొత్తాన్ని మెవెదర్ ఓ ఫేక్ ఫైట్ ద్వారా సంపాదించానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. సరదాగా కోసం బౌట్‌లోకి అడుగుపెడితే.. అపార సంపద తన తలుపు తట్టిందని తెలిపాడు. ప్రొఫెషనల్ బాక్సర్ అయిన మెవెదర్ ఆరు రౌండ్ల పాటు సాగిన ఈ ఫైట్‌లో ప్రత్యర్ధిపై ఒక్క పంచ్ కూడా విసరకపోవడం విశేషం. ఎన్ని అవకాశాలు వచ్చినా ప్రత్యర్థిపై చేయెత్తకపోవడంతో ఈ మ్యాచ్‌పై చాలా సందేహాలు, విమర్శలు వచ్చాయి. ఈ ఏడాది జూన్ 6న జరిగిన ఈ బౌట్లో మెవెదర్ ఓటమిపాలైనప్పటికీ.. అతని ఖాతాలో 742 కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి. దీంత అతని ఆస్తుల విలువ రూ. 1.2 బిలియన్లకు చేరుకుంది. ఇదిలా ఉంటే, ప్రొఫెషనల్ బాక్సింగ్ చరిత్రలో అజేయుడిగా ఉన్న మెవెదర్ తన కెరీర్ మొత్తంలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. అతనాడిన 50 మ్యాచ్‌ల్లో ప్రత్యర్ధిపై అతనిదే పైచేయి. హోలీఫీల్డ్ లాంటి దిగ్గజ బాక్సర్లను సైతం మట్టికరిపించిన ఆయన.. బాక్సింగ్ చరిత్రలో మకుటం లేని మహారాజుగా చలామణి అయ్యాడు. ఈ క్రమంలో పేరు ప్రఖ్యాతలతో పాటు భారీ మొత్తంలో డబ్బును సంపాదించాడు. చివరకు 2017లో ప్రొఫెషనల్ బాక్సింగ్ నుంచి రిటైర్ అయ్యాడు. క్రీడాకారుల్లో అపర కుబేరుడిగా పేరొందిన మెవెదర్.. చాలా లగ్జరీ లైఫ్‌ను లీడ్ చేస్తాడు. అతని వద్ద ఖరీదైన కార్లు, వాచీలు, జ్యువెలరీ కలెక్షన్లు ఉన్నాయి. బుగాటి, లంబొర్గిని, రోల్స్ రాయస్ వంటి కార్లు అతడి గ్యారేజీలో కలెక్షన్లుగా పడి ఉన్నాయి. ప్రపంచంలోనే ఏ క్రీడాకారుని వద్ద లేని వరల్డ్ క్లాస్ జెట్ ఫ్లైట్‌ని అతను సొంతం చేసుకున్నాడు. దాని ఖరీదు రూ. 350 కోట్లకు పైమాటే. చదవండి: ఐపీఎల్ అసలు క్రికెట్టే కాదు.. ప్రముఖ వ్యాఖ్యాత సంచలన వ్యాఖ్యలు -
బాక్సర్ అవతారమెత్తిన ప్రధాని!
న్యూయార్క్: కొందరు రాజకీయ నాయకులకు మరికొన్ని రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంటుంది. అయితే ఓ దేశ ప్రధాని మాత్రం బాక్సింగ్ రింగ్ లోకి దిగి ప్రత్యర్థులపైకి పంచ్ లు విసరటం మొదలెట్టారు. అలాగని ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారని భావిస్తే తప్పులో కాలువేసినట్టే. ఆటవిడుపు కోసం ప్రధాని బాక్సింగ్ బరిలోకి దిగారు. ఆ ప్రధాని మరెవరో కాదు కెనడా పీఎం జస్టిన్ ట్రూడ్. గురువారం నాడు బాక్సింగ్ రింగ్ లో అడుగుపెట్టి తన పంచ్ పవర్ రుచిచూపిస్తున్నారు. న్యూయార్క్ పర్యటన నేపథ్యంలో ట్రూడ్ బాక్సర్ అవతారమెత్తారు. న్యూయార్క్ లోని గ్లియాన్సన్ జిమ్ లో ఆయన ప్రతక్షమైనప్పటి ఫొటోలు, వీడియో ప్రస్తుతం నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. రాజకీయ రంగం నుంచి బాక్సింగ్ రింగ్ లోకి ఎంట్రీ ఇచ్చాడా ఏంటని కొందరు ఆశ్చర్యపోగా, బాక్సర్ అవతారంలో పీఎం బాగున్నాడంటూ మరికొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. జిమ్ లో ఉన్న బాక్సింగ్ రింగ్ లో ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. రెడ్ స్లివ్ లెస్ ధరించిన ఆయన ఎడమచేతి భుజంపై ఓ టాటుతో కనిపించారు. అక్కడి వారికి ప్రధాని బాక్సింగ్ పాఠాలు బోధించారు. గత ఎన్నికల్లో ఆయన ప్రచార కార్యక్రమం సమయంలో ప్రొఫెషనల్ బాక్సర్, హెవీవెయిట్ మాజీ చాంపియన్ యురీ ఫోర్ మెన్ తో కలిసి ప్రాక్టిస్ చేస్తూ చాలా సమయాన్ని వృథా చేశారని ఆరోపణలున్నాయి. బాక్సింగ్ లో అనుభవంతో పాటు హై స్కూల్లో బోధించిన ఎక్స్ పీరియన్స్ కూడా ట్రూడ్ సొంతం.