BPL cards
-
రేషన్ కార్డులపై మంత్రి యూటర్న్
బెంగళూరు: దారిద్య్రరేఖకు దిగువన ఉన్న రేషన్ కార్డుదారులకు టీవీ, ఫ్రిజ్, ద్విచక్ర వాహనం, ఐదెకరాల భూమి ఉంటే రేషన్ కట్ చేస్తామని చేసిన ప్రకటనపై కర్ణాటక ఆహార, పౌర సరఫరా మంత్రి ఉమేశ్ కత్తి వెనక్కు తగ్గారు. విలాస వస్తువులుంటే రేషన్ కార్డులు వదులుకోవాలని చేసిన ప్రకటనపై యూటర్న్ తీసుకున్నారు. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు మంత్రి ప్రకటించారు. రేషన్ బియ్యం కార్డుల కోసం ఎలాంటి కచ్చితమైన పరిమితులు లేవని, కార్డుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. టీవీ, ఫ్రిజ్, ద్విచక్రవాహనం, ఐదెకరాల భూమి ఉన్న రేషన్ కార్డుదారులు తమ కార్డులు వదులుకోవాలని లేకపోతే కఠిన చర్యలు తప్పవని మంత్రి ఉమేశ్ కత్తి హెచ్చరించడంతో కర్నాటకతో పాటు దేశవ్యాప్తంగా దుమారం రేపింది. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో మరుసటి రోజే ఆ మంత్రి యూటర్న్ తీసుకున్నారు. ‘ఢిల్లీ నుంచి నాకు వచ్చిన సమాచారాన్ని నేను మీడియాతో పంచుకున్నా’ అని మంగళవారం మంత్రి ఉమేశ్ వివరణ ఇచ్చారు. టీవీ, ఫ్రిజ్‌లాంటి పరిమితులపై తాను గానీ, ముఖ్యమంత్రి యడియూరప్ప గానీ ఎలాంటి ఆదేశాలు ఇవ్వడం లేదని మంత్రి ఉమేశ్ తెలిపారు. మా ప్రభుత్వం పేదల కోసం పని చేస్తుందని.. రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని రేషన్ కార్డులు ఇచ్చేందుకు కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు. త్వరలోనే రేషన్ కార్డుదారులకు రాగి, మొక్కజొన్న, బియ్యం వంటి ఉచిత ఆహార ధాన్యాలు ఇవ్వడం కొనసాగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. దీనిపై మరింత వివరణ ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు. టీవీ, ఫ్రిజ్ ఉంటే రేషన్‌కార్డు కట్! -
కొత్త కార్డులెప్పుడో!
నార్నూర్(ఆసిఫాబాద్): పేదలు రేషన్ షాపుల్లో సబ్సిడీపై నిత్యావసర సరుకులు తీసుకునేందుకు ప్రభుత్వం కొత్తగా రేషన్‌కార్డులు జారీ చేయడం లేదు. రేషన్‌కార్డుల కోసం అర్హులు మీసేవ కేంద్రాల్లో ఆన్లైన్ చేసుకొని నెలలు గడుస్తున్నా కార్డులు జారీ చేయకపోవడంతో ప్రతీనెల రేషన్ షాపుల నుంచి బియ్యం తీసుకునేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. లబ్ధిదారులు ప్రతీ నెల మీసేవ కేంద్రాలకు పరుగులు పెట్టి ఆహారభద్రత కార్డు జిరాక్స్ తీసుకువస్తేనే రేషన్ డీలర్లు సరుకులు ఇస్తున్నారు. జిల్లాలో 365 రేషన్ షాపులు ఉన్నాయి. ప్రస్తుతం బీపీఎల్ కార్డులు 1,85,255 ఎఫ్ఎస్సీ కార్డులు 1,72,065 ఏఎఫ్ఎస్సీ కార్డులు 12,914 ఏఏపీ కార్డులు 570 కార్డులు ఉన్నాయి. రేషన్ షాపుల్లో ఈ–పాస్ విధానం అమలు చేయగా ప్రతీ లబ్ధిదారుడు తప్పనిసరిగా ఆహార భద్రత కార్డు ఉంటేనే దానిపై ఉన్న నంబర్‌ను ఈ–పాస్ మిషన్‌లో ఎంటర్ చేసి సదురు లబ్ధిదారుడి వేలిముద్ర వేస్తే గాని సరుకులు అందించే పరిస్థితి లేదు. ప్రభుత్వం గతంలో కొంతమందికి తాత్కాలికంగా ఆహార భద్రత కార్డులను పంపిణీ చేసినా పూర్తిస్థాయిలో కార్డులు ఇవ్వకపోవడంతో ప్రతీ నెల లబ్ధిదారులు మీసేవ కేంద్రాలకు వెళ్లి ఆహార భద్రత కార్డుల జిరాక్స్ కాఫీలను తీసుకొచ్చి షాపుల్లో సరకులు తీసుకోనే దుస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఆహార భద్రత కార్డులను పంపిణీ చేయాలని వారు కోరుతున్నారు. 11,027 దరఖాస్తులు జిల్లాలో మొత్తం 365 రేషన్‌షాపుల పరిధిలో నూతన కార్డులు కోసం మీసేవ కేంద్రాల్లో 11,027 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇన్స్పెక్టర్ వద్ద 3,226, తహశీల్దార్ కార్యాలయాల్లో 290, డీఎస్వో కార్యాలయంలో 544 దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా జిల్లా వ్యాప్తంగా 4,060 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. కార్డుల కోసం దరఖాస్తులు చేసుకొని నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నూతన రేషన్ కార్డులను జారీ చేయకపోవడంతో మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న దరఖాస్తులు తహశీల్ కార్యాలయంలోనే పెండింగ్‌లో ఉన్నాయి. నూతన రేషన్‌కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను ఆన్లైన్లో ఆప్‌లోడ్ చేస్తున్నామని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. అర్హులందరికీ అందిస్తాం ఆహారభద్రత కార్డుల జారీ కోసం లబ్ధిదారులు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వానికి ఆ¯న్‌లైన్ ఆప్‌లోడ్ చేస్తున్నాం. ప్రభుత్వం నుంచి కార్డుల జారీ చేస్తే తప్పనిసరిగా అర్హులందరికీ జారీ చేస్తాం. – సుదర్శనం, డీఎస్వో ఆదిలాబాద్ -
...వారిపై క్రిమినల్ చర్యలు
- బీపీఎల్ కార్డులు అక్రమంగా కలిగి ఉన్నవారికి మంత్రి హెచ్చరిక - కార్డుల స్వాధీనానికి మరో రెండు నెలలు గడువు పెంపు - కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తుల ఆహ్వానం సాక్షి, బెంగళూరు: రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా బీపీఎల్ కార్డులు కలిగి ఉన్న వారు ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలని, అలా చేయని వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి దినేష్ గుండూరావ్ తెలిపారు. శనివారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో దినేష్ గుండూరావ్ మాట్లాడారు. అక్రమ బీపీఎల్ కార్డుదారులను తెలుసుకునేందుకు గాను ప్రత్యేక డ్రైవ్‌ను ఇప్పటికే ప్రారంభించినట్లు చెప్పారు. ఈ డ్రైవ్‌లో ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తం గా దాదాపు రెండువేల మంది అక్రమ బీపీఎల్ కార్డుదారులను అధికారులు గుర్తిస్తున్నారని పేర్కొన్నా రు. ఇలాంటి వారందరికీ ప్రభుత్వం మరో రెండు నెలలు గడువు విధిస్తోం దని, ఈ గడువు పూర్తయ్యేలోగా వారంతట వారే బీపీఎల్ కార్డులను ప్రభుత్వానికి అందజేయాలని హెచ్చరించారు. ఇక కొత్త రేషన్‌కార్డుల పంపిణీ కోసం అర్జీలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరువు పరిస్థితులు నెలకొన్నప్పటికీ రేషన్ సరుకుల సరఫరాకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా చూసుకుంటున్నామని తెలి పారు. ఇక ఇప్పటికే రాష్ట్రానికి అవసరమైన మోతాదులో ఆహార ధాన్యాలను కేంద్రం నుంచి కొనుగోలు చేసి ఉంచామని చెప్పారు. ఇంకా అవసరమైతే కేంద్ర ఆహార మండలి నుంచి మరిన్ని ఆహార ధాన్యాలను కొనుగోలు చేసేం దుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని దినేష్ గుండూరావ్ వెల్లడించారు. -
ఆహారభద్రతకు దరఖాస్తుల వెల్లువ
అందినవే 85 లక్షలదాకా... సమగ్ర సర్వే సంఖ్యకు దగ్గరగా ఉన్నాయి... 20 నాటికి కోటికి చేరవచ్చంటున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఆహారభద్రతా కార్డులకు దరఖాస్తులు వెల్లవలా వచ్చిపడుతున్నాయి. రాష్ట్రంలో శనివారం నాటికి 85.56 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు సంబంధిత అధికారులకు సమాచారం అందింది. దరఖాస్తులకు ప్రభుత్వం విధించిన గడువు మరో రెండు రోజుల్లో ముగుస్తుండడంతో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని, దీంతో సంఖ్య కోటికి చేరవచ్చునని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎప్పటికప్పుడు జిల్లాలవారీగా దరఖాస్తులను సమగ్ర కుటుంబ సర్వేలో తేలిన కుటుంబాల సంఖ్యతోను, ఈ పీడీఎస్ ప్రకారం ఉన్న బీపీఎల్ కార్డులతోనూ పోల్చిచూస్తున్నారు. అందిన లెక్కలను బట్టి సమగ్ర కుటుంబ సర్వేలో తేలిన కుటుంబాల సంఖ్య, వచ్చే దరఖాస్తుల సంఖ్య దరిదాపుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాగా నిజామాబాద్ జిల్లాలో సర్వేలో తేలిన కుటుంబాల కన్నా వచ్చిన దరఖాస్తులు ఎక్కువగా ఉన్నాయి. ఇక మెదక్, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న కార్డుల కన్నా ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. -
రెండో రోజూ రైస్‌మిల్లులు బంద్
సాక్షి, బళ్లారి : రైస్‌మిల్లు యజమానుల అసోసియేషన్లు ఇచ్చిన బంద్ పిలుపు రైతులకు ఇక్కట్లు తెచ్చిపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీపీఎల్ కార్డులు ఉన్న వారికి అన్నభాగ్య పథకం ద్వారా కిలో రూ.1కే బియ్యం పంపిణీ పంపిణీచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై అదనపు భారం పడుతుండటంతో దాని నుంచి బయట పడేందుకు ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసింది. రాష్ట్రంలో ఉన్న 1800కి పైగా రైస్‌మిల్లుల నుంచి లెవీ రూపంలో ఏకంగా 13.50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సేకరించేందుకు ప్రభుత్వం తీర్మానించింది. వెంటనే రైస్‌మిల్లుల అసోసియేషన్ తిరగబడటంతో ప్రభుత్వం 5 లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వాలని నిర్ణయించారు. అయితే గతంలో ఇస్తున్నట్లు ప్రతి ఏటా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లుల నుంచి రూ.1.25 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం నుంచి 2 లక్షల కంటే ఒక కేజీ కూడా ఎక్కువ ఇవ్వలేమని భీష్మించి రైస్‌మిల్లుల యజమానులు ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా రైస్‌మిల్లులు మూసివేశారు. సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపునివ్వడంతో బళ్లారి జిల్లాలో 200 రైస్‌మిల్లులు మూతపడ్డాయి. ప్రస్తుతం తుంగభద్ర ఆయకట్టు కింద వరికోతలు దాదాపు పూర్తి అయ్యాయి. వరిని అమ్మడానికి రైతులు సిద్ధం అవుతున్నారు. వరి కొనుగోళ్లు జోరందుకుంటున్న నేపథ్యంలో ఒక్కసారిగా రైస్‌మిల్లులు బంద్ కావడంతో రైతులు అయోమయంలో పడ్డారు. రైస్‌మిల్లుల అసోసియేషన్ బంద్ పరోక్షంగా రైతులకు నష్టం కల్గించేలా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మేల్కొని సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉందని పలువురు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
అమ్మో.. హస్తం!
జిల్లాలో అమ్మహస్తం పథకం అమలు అభాసు పాలవుతోంది. సరుకుల్లో నాణ్యత లోపించడం, బహిరంగ మార్కెట్‌తో పోల్చితే ధరలో పెద్దగా తేడా లేకపోవడం తదితర కారణాల వల్ల కార్డుదారులు ఆసక్తి కనబరచడం లేదు. దీంతో 9 రకాల సరుకులు కొనేవారి సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. మూడు నాలుగు రకాల సరుకులే చాలని సరిపుచ్చుకుంటున్నారు. ప్రారంభం నుంచి ఇప్పటివరకు పథకం అమలు తీరును పరిశీలిస్తే ఇది తెలుస్తోంది. సాక్షి, నల్లగొండ: చౌకధర దుకాణాల ద్వారా రూ.185కే తొమ్మిది రకాల నాణ్యమైన నిత్యావసర సరుకుల అందించాలన్న సర్కారు లక్ష్యం బెడిసికొడుతోంది. జిల్లాలో గత ఏప్రిల్ 17న అమ్మహస్తం పథకం ప్రారంభమైంది. పేరుకు గొప్ప పథకంలా కనిపిస్తున్నా.. ఆచరణలో మాత్రం చతికిలబడింది. పథకం ఆరంభం నాడు కార్డుదారుల నుంచి లభించిన ఆదరణ ప్రస్తుతం కరువైంది. జిల్లాలో మొత్తం 2043 రేషన్ దుకాణాల పరిధిలో 9.42 లక్షల బీపీఎల్ కార్డులు ఉన్నాయి. ఇందులో 25 శాతం కార్డుదారులు ప్రతినెలా 9 రకాల వస్తువులు కొనుగోలు చేస్తున్న దాఖలాలు లేవంటే అతిశ యోక్తి కాదు. ఇది కార్డుదారుల నుంచి లభిస్తున్న స్పందనకు అద్దంపడుతోంది. నాణ్యత నగుబాటు... రేషన్ దుకాణాల ద్వారా అందించే తొమ్మిది రకాల నిత్యావసర సరుకుల నాణ్యతను చూసి లబ్ధిదారులు పెదవి విరుస్తున్నారు. అక్కడక్కడా పుచ్చులున్న కందిపప్పు, గింజలున్న నల్లని చింతపండు, నాసిరకం గోధుమలు, గోధుమ పిండి, రంగు తప్ప ఘాటులేని కారం పొడి, రుచీపచీ లేని పామాయిల్ ప్యాకెట్లు లబ్ధిదారులను మెప్పించలేకపోతున్నాయి. కొన్నిచోట్ల సరుకులను చూసి ప్రజలు అమ్మో.. అంటూ ముఖం తిప్పుకుని ఆమడ దూరం పోతున్నారు. దీంతో క్రమంగా ఈ సరుకులు కొనుగోలు చేసే వారి సంఖ్య పడిపోతోంది. తొమ్మిది సరుకుల్లో వినియోగదారులు నాలుగు సరుకులపై మాత్రమే ఆసక్తి కనబర్చుతున్నారు. చక్కర, పామాయిల్, గోధుమ పిండి, అడపాదడపా కందిపప్పు కొనుగోలు చేస్తున్నారు. మిగిలిన చింతపండు, గోధుమలు, ఉప్పు, కారంపొడి, పసుపు పట్ల పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. నాసిరకంగా ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. డీలర్ల అనాసక్తి... పెట్టుబడికి తగ్గట్లు కమీషన్ లేకపోవడం, వచ్చే సరుకుల్లో తరుగుదల ఉండటంతో రేషన్ డీలర్లు తలలు పట్టుకుంటున్నారు. పైగా రవాణా చేస్తున్న సమయంలో పామాయిల్ ప్యాకెట్లు పగలడంతో మరింత నష్టం వాటిల్లుతోంది. 9 రకాల సరుకులు అమ్మితే డీలర్లకు కమీషన్ రూపంలో అందేది 4.01 రూపాయలు. ఇందులోనే హమాలీ, డీడీ చార్జీలు భరించాలి. ఇవన్నీ పోను ఒక్కో కార్డుదారునికి 9 సరుకులు అమ్మితే సరాసరి *2.50 కూడా మిగలడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.