
బెంగళూరు: దారిద్య్రరేఖకు దిగువన ఉన్న రేషన్ కార్డుదారులకు టీవీ, ఫ్రిజ్, ద్విచక్ర వాహనం, ఐదెకరాల భూమి ఉంటే రేషన్ కట్ చేస్తామని చేసిన ప్రకటనపై కర్ణాటక ఆహార, పౌర సరఫరా మంత్రి ఉమేశ్ కత్తి వెనక్కు తగ్గారు. విలాస వస్తువులుంటే రేషన్ కార్డులు వదులుకోవాలని చేసిన ప్రకటనపై యూటర్న్ తీసుకున్నారు. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు మంత్రి ప్రకటించారు. రేషన్ బియ్యం కార్డుల కోసం ఎలాంటి కచ్చితమైన పరిమితులు లేవని, కార్డుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
టీవీ, ఫ్రిజ్, ద్విచక్రవాహనం, ఐదెకరాల భూమి ఉన్న రేషన్ కార్డుదారులు తమ కార్డులు వదులుకోవాలని లేకపోతే కఠిన చర్యలు తప్పవని మంత్రి ఉమేశ్ కత్తి హెచ్చరించడంతో కర్నాటకతో పాటు దేశవ్యాప్తంగా దుమారం రేపింది. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో మరుసటి రోజే ఆ మంత్రి యూటర్న్ తీసుకున్నారు. ‘ఢిల్లీ నుంచి నాకు వచ్చిన సమాచారాన్ని నేను మీడియాతో పంచుకున్నా’ అని మంగళవారం మంత్రి ఉమేశ్ వివరణ ఇచ్చారు.
టీవీ, ఫ్రిజ్‌లాంటి పరిమితులపై తాను గానీ, ముఖ్యమంత్రి యడియూరప్ప గానీ ఎలాంటి ఆదేశాలు ఇవ్వడం లేదని మంత్రి ఉమేశ్ తెలిపారు. మా ప్రభుత్వం పేదల కోసం పని చేస్తుందని.. రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని రేషన్ కార్డులు ఇచ్చేందుకు కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు. త్వరలోనే రేషన్ కార్డుదారులకు రాగి, మొక్కజొన్న, బియ్యం వంటి ఉచిత ఆహార ధాన్యాలు ఇవ్వడం కొనసాగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. దీనిపై మరింత వివరణ ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు.
టీవీ, ఫ్రిజ్ ఉంటే రేషన్‌కార్డు కట్!
Comments
Please login to add a commentAdd a comment