Umesh Katti
-
కర్ణాటక మంత్రి ఉమేష్ కత్తి హఠాన్మరణం
-
గుండెపోటుతో మంత్రి హఠాన్మరణం
సాక్షి, బెంగళూరు: కర్ణాటక మంత్రి ఉమేష్ కత్తి హఠాన్మరణం చెందారు. ఆయన వయసు 61 సంవత్సరాలు. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఛాతీలో నొప్పి రావడంతో బెంగుళూరు డాలర్స్ కాలనీలోని తన ఇంటిలో కుప్పకూలిపోయాడు. వెంటనే మంత్రిని బెంగుళూరులోని రామయ్య ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మంత్రికి స్పృహ లేకపోవడం, శ్వాస తీసుకోకపోవడంతో.. వైద్యులు అత్యవసర చికిత్స విభాగంలో వైద్యం అందించారు. అయినప్పటికీ ఆయన శరీరం స్పందించకపోవడంతో మంగళవారం అర్థరాత్రి 11.40 నిమిషాలకు మంత్రి ఉమేష్ చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఉమేష్ కత్తి మృతి పట్ల సీఎం బసవరాజ్ బొమ్మై సంతాపం తెలిపారు. ఉమేష్ తనకు తమ్ముడు లాంటి వాడని, అతని మరణం రాష్ట్రానికి తీరని లోటు అని పేర్కొన్నారు. ‘నా సన్నిహిత మిత్రుడిని కోల్పోయాను, నాకు తను సోదరుడు, తనకు కొన్ని గుండె జబ్బులు ఉన్నాయని తెలుసు. కానీ ఇంత త్వరగా మమ్మల్ని విడిచి వెళతాడని ఊహించలేదు. తను రాష్ట్రానికి ఎంతో సేవలు చేశాడు. అనేక శాఖలను సమర్ధవంతంగా నిర్వహించాడు. ఆయన మరణం రాష్ట్రానికి భారీ నష్టం. మాకు పెద్ద శూన్యతను మిగిల్చాడు, దీనిని పూరించడం చాలా కష్టం’ అని బొమ్మై అన్నారు. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో మంత్రి అంత్యక్రియలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. కాగా ఉమేష్ కత్తి స్వస్థలం బెళగావి జిల్లా చిక్కోడి తాలూకా, ఖడకలాట గ్రామం. ఆయనకు భార్య లీల, కుమారుడు నిఖిల్, కుమార్తె స్నేహా ఉన్నారు. బెళగావి జిల్లా హుక్కేరి నియోజకవర్గం నుంచి ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన అయిదుసార్లు మంత్రిగా సేవలందించాడు. ప్రస్తుతం అటవీ, ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రిగా ఉన్నారు. చదవండి: అమిత్ షా యాక్షన్ ప్లాన్.. ఢిల్లీలో మెగా మీటింగ్ -
సీఎం కావడానికి అర్హతలున్నాయి: కర్ణాటక మంత్రి ఉమేష్
కర్ణాటక ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పెరుగుతోంది. యడియూరప్ప స్థానంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు తనకు అన్ని అర్హతలు ఉన్నాయని ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉమేష్ కత్తి వ్యాఖ్యానించారు. తాను తొమ్మిదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, తన వయసు ప్రస్తుతం 60 ఏళ్లేనని అన్నారు. పరిణామాలన్నీ తనకు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. అవకాశం వస్తే సీఎంగా రాష్ట్రానికి సేవ చేస్తానని, చక్కటి పరిపాలన అందిస్తానని చెప్పారు. పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్న సీఎం యడియూరప్ప ప్రకటనను గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కె.ఎస్.ఈశ్వరప్ప స్వాగతించారు. ముఖ్యమంత్రి మార్పు విషయంలో బీజేపీ పెద్దల నిర్ణయాన్ని తాము గౌరవిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి ఆర్.అశోక్, హోంమంత్రి బసవరాజ్ బొమ్మై పేర్కొన్నారు. కొత్త ముఖ్యమంత్రి ఎవరన్న విషయంలో బీజేపీ అధిష్టానానికి తాను ఎలాంటి సూచనలు ఇవ్వలేదని యడియూరప్ప చెప్పారు. ఎవరి పేరునూ తాను సూచించలేదన్నారు. ఒకవేళ పార్టీ నాయకత్వం తనను కోరినా తదుపరి సీఎం పేరును ప్రతిపాదించలేనని స్పష్టం చేశారు. తాను పదవి నుంచి తప్పుకోవడం తథ్యమని యడియూరప్ప సంకేతాలిచ్చిన నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఆందోళన నెలకొంది. -
రేషన్ కార్డులపై మంత్రి యూటర్న్
బెంగళూరు: దారిద్య్రరేఖకు దిగువన ఉన్న రేషన్ కార్డుదారులకు టీవీ, ఫ్రిజ్, ద్విచక్ర వాహనం, ఐదెకరాల భూమి ఉంటే రేషన్ కట్ చేస్తామని చేసిన ప్రకటనపై కర్ణాటక ఆహార, పౌర సరఫరా మంత్రి ఉమేశ్ కత్తి వెనక్కు తగ్గారు. విలాస వస్తువులుంటే రేషన్ కార్డులు వదులుకోవాలని చేసిన ప్రకటనపై యూటర్న్ తీసుకున్నారు. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు మంత్రి ప్రకటించారు. రేషన్ బియ్యం కార్డుల కోసం ఎలాంటి కచ్చితమైన పరిమితులు లేవని, కార్డుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. టీవీ, ఫ్రిజ్, ద్విచక్రవాహనం, ఐదెకరాల భూమి ఉన్న రేషన్ కార్డుదారులు తమ కార్డులు వదులుకోవాలని లేకపోతే కఠిన చర్యలు తప్పవని మంత్రి ఉమేశ్ కత్తి హెచ్చరించడంతో కర్నాటకతో పాటు దేశవ్యాప్తంగా దుమారం రేపింది. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో మరుసటి రోజే ఆ మంత్రి యూటర్న్ తీసుకున్నారు. ‘ఢిల్లీ నుంచి నాకు వచ్చిన సమాచారాన్ని నేను మీడియాతో పంచుకున్నా’ అని మంగళవారం మంత్రి ఉమేశ్ వివరణ ఇచ్చారు. టీవీ, ఫ్రిజ్‌లాంటి పరిమితులపై తాను గానీ, ముఖ్యమంత్రి యడియూరప్ప గానీ ఎలాంటి ఆదేశాలు ఇవ్వడం లేదని మంత్రి ఉమేశ్ తెలిపారు. మా ప్రభుత్వం పేదల కోసం పని చేస్తుందని.. రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని రేషన్ కార్డులు ఇచ్చేందుకు కట్టుబడి ఉందని మంత్రి చెప్పారు. త్వరలోనే రేషన్ కార్డుదారులకు రాగి, మొక్కజొన్న, బియ్యం వంటి ఉచిత ఆహార ధాన్యాలు ఇవ్వడం కొనసాగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. దీనిపై మరింత వివరణ ఇచ్చేందుకు ఆయన నిరాకరించారు. టీవీ, ఫ్రిజ్ ఉంటే రేషన్‌కార్డు కట్! -
టీవీ, ఫ్రిజ్ ఉంటే రేషన్‌కార్డు కట్!
సాక్షి, బెంగళూరు : రేషన్ కార్డుల పంపిణిపై కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సొంతగా టీవీ, ఫ్రిజ్, ద్విచక్ర వాహనం ఉంటే రేషన్ కార్డును నిరాకరించాలని నిర్ణయించింది. బీపీఎల్ కార్డుల మంజూరు విషయంలో ఇకపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించదని ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖమంత్రి ఉమేష్ కత్తి స్పష్టం చేశారు. సోమవారం బెళగావిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఉన్నత వర్గాలకు చెందిన వారు కూడా ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే రేషన్ సరుకులను ఉపయోగించుకున్నారని, దీని ద్వారా వెనుకబడిన వారికి సరుకులు చేరడంలేదని పేర్కొన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకునే ఉద్ధేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం రేషన్ సరఫరా చేస్తోందని, ఇకపై సరైన అర్హుల జాబితాను రూపొందిస్తామని స్పష్టం చేశారు. 1.20 లక్షల వార్షిక ఆదాయం కంటే ఎక్కువ ఉన్నవారు ఉచిత రేషన్‌కు అనర్హులన్నారు. అలాగే టీవీ, ఫ్రిజ్, ద్విచక్ర వాహనం ఉంటే రేషన్ కార్డును వెంటనే వదులుకోవాలన్నారు. మార్చి 31 వరకు కార్డును వెనక్కి ఇచ్చేయాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉమేష్ కత్తి హెచ్చరించారు. ప్రభుత్వ ప్రతిపాదనపై ప్రతిపక్ష కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. టీవీ, ఫ్రిజ్ అనేవి నేడు నిత్యవసర వస్తుల జాబితాలో చేరిపోయాయని, వాటి కారణం చేత కార్డులను తొలగించడం సరైనది కాదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. చదవండి: మాంగల్య బలం గట్టిదే.. హుండీలోకి చేరబోయేది! అందుకే అర్ధగంట ట్రాఫిక్ ఆపేశారు! -
ఇవ్వాల్సిందే...
=టన్ను చెరకుకు రూ.2,400 చెల్లించాల్సిందే =ఉల్లంఘిస్తే ‘ఫ్యాక్టరీ’లపై కఠిన చర్యలు =అధ్యయనం తర్వాతనే ఆ ధర నిర్ణయం =మూర్ఖత్వంతోనే ‘ప్రత్యేక’ డిమాండ్ : సీఎం సిద్ధు మైసూరు, న్యూస్‌లైన్ : రాష్ట్రంలోని చక్కెర ఫ్యాక్టరీలు టన్ను చెరకుకు రూ.2,400 వంతున రైతులకు చెల్లించి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలోని టీ. నరసీపుర తాలూకా తలకాడులో ఆయన పురాణ ప్రసిద్ధి పొందిన పంచ లింగ దర్శనం ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. టన్ను చెరకుకు రూ.2,500 చొప్పున చెల్లించడం సాధ్యం కాదని చక్కెర మిల్లుల యజమానులు చెప్పడాన్ని ప్రస్తావించినప్పుడు, ప్రభుత్వం అన్ని రకాలుగా అధ్యయనం చేసిన తర్వాతనే కొనుగోలు ధరను నిర్ణయించిందని చెప్పారు. కనుక ఈ ఆదేశాలను ఎవరూ ఉల్లంఘించకూడదన్నారు. ఒక వేళ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రతి టన్నుకు కర్మాగారాలు రూ.2,400 చెల్లించాలని, దీనికి అదనంగా రూ. వందతో పాటు రూ.150 ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం అందిస్తుందని వివరించారు. ప్రత్యేక రాష్ట్రం డిమాండ్‌పై మండిపాటు ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ మాదిరే కర్ణాటకను కూడా విభజించాలని బెల్గాం జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఉమేశ్ కత్తి డిమాండ్ చేయడాన్ని ముఖ్యమంత్రి తీవ్రంగా ఖండించారు. ఆయన మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారని మండి పడ్డారు. ఇలాంటి డిమాండ్ల ద్వారా ఆయనకు గౌరవం పెరగదని అన్నారు.