BPL list
-
అక్రమ నివాస గృహ స్థలాల క్రమబద్ధీకరణకు సువర్ణావకాశం
కర్నూలు(సెంట్రల్) : ఆక్షేపణ లేని ప్రభుత్వ భూముల్లో అక్రమ నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారికి శుభవార్త. వారి ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తూ జీఓ నంబర్ 225ను విడుదల చేసింది. 300 గజాల చదరపు అడుగుల వరకు సక్రమం చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. డిసెంబర్ 31వ తేదీ వరకు అర్హులైన వారు తమ సమీపంలోని గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు ఇవ్వవచ్చు. ఎవరు అర్హులంటే.... అక్రమ నిర్మాణాలను సక్రమం చేసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నియమ నిబంధనలు పాటించాలని సూచించింది. విధిగా సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ నిబంధలను పాటించాలి. అంటే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికే అవకాశం ఇస్తారు. గ్రామీణ ప్రాంతము.. –సదరు అక్రమ నివాస కుటుంబ సభ్యుల నెలసరి ఆదాయం(అన్ని వనరులు)రూ.10 వేలు ఉండాలి. అనగా సంవత్సరం ఆదాయం రూ1.20 లక్షలకు దాటకూడదు. – 10 ఎకరాల మెట్ట లేదా 3 ఎకరాల తడి భూమి..రెండు కలిపి 10 ఎకరాల వరకు ఉండవచ్చు. – సదరు కుటుంబంలో ఎవరూ ఆదాయ పన్ను కట్టకూడదు – సదరు కుటుంబంలో 4 చక్రాల వాహనాలు ఉండరాదు. అయితే ట్రాక్టర్, ఆటో, ట్యాక్సీ ఉంటే మినహాయిస్తారు. – సదరు కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉండరాదు పట్టణ ప్రాంతము... – సదరు ఆక్రమణదారు కుటుబం నెలసరి ఆదాయం(అన్ని వనరురులు) నెలకు రూ.12 వేలు వరకు మాత్రమే ఉండాలి. సంవత్సారానికి 1.44 లక్షల వరకు ఆదాయం ఉండవచ్చు – సదరు కుటుంబంలో ఎవరూప్రభుత్వ ఉద్యోగం చేయరాదు. అయితే కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తే మినహాయిస్తారు. – సదరు కుటుంబంలో ఎవరూ ఆదాయపు పన్ను చెల్లించరాదు – సదరు కుటుంబంలో 4 చక్రాల వాహనాలు ఉండరాదు. అయితే ట్రాక్టర్, ఆటో, ట్యాక్సీ ఉంటే మినహాయిస్తారు. – అంతేకాక సదరు కుటుంబం 500కు పైగా గజాల ఇంటి స్థలం ఎవరి పేరిట ఉండరాదు సక్రమం ఎలా చేస్తారంటే... అక్రమ నిర్మాణాలను సక్రమం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ ఎంఎస్ 225ను విడుదల చేసింది. దీని ప్రకారం ప్రభుత్వం పొందు పరచిన షరతులు, నియమ, నిబంధనలను పాటిస్తూ ఆక్రమణలు ఉంటే క్రమబద్ధీకరించుకోవచ్చు. అది కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆక్షేపణ లేని భూముల్లోమాత్రమే క్రమబద్ధీకరణకు అవకాశం ఇస్తారు. – 75 చదరపు గజాల విస్తీర్ణం వరకు సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్లో దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్లు తెలితే ఉచితంగా డీపట్టా జారీ చేస్తారు. –75 నుంచి 150 చదరపు గజాల విస్తీర్ణాన్ని క్రమబద్ఖీరించుకోవాలంటే ఆ భూమి యొక్క ప్రాథమిక విలువలో 75 శాతం ప్రభుత్వానికి చెల్లించాలి. – 150–300 చదరపు గజాల విస్తీర్ణం ఉన్న స్థలాన్ని క్రమబద్ధీకరించుకోవాలంటే ఆ భూమి యొక్క ప్రాథమిక విలువలో 100 శాతం చెల్లించాలి. క్రమబద్ధీకరిచుకోవడం ద్వారా లాభమేమిటీ? అక్రమ ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించుకోవడం ద్వారా పలు లాభాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆ స్థలం లేదా ఇంటికి మార్కెట్ విలువ వస్తుంది. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. బ్యాంకులో మార్టిగేజ్ చేసుకొని అవసరమైన సమయాల్లో ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టేక్కెందుకు వీలు ఉంటుంది. క్రమబద్ధీకరించకపోతే ఆ స్థలం లేదా ఇంటికి ఎలాంటి విలువ ఉండదు. ఎవరూ అమ్మినా కొనుగోలు చేయరు. సచివాలయాల ద్వారా దరఖాస్తుల స్వీకరణ... అక్రమ నివాస ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించేందుకు సచివాలయాల్లో సంబంధిత బాధిత కుటుంబాలు దరఖాస్తులు ఇవ్వాలి. వారు ఇచ్చిన దరఖాస్తులను అక్కడి టౌన్ ప్లానింగ్ అధికారులు పరిశీలించి సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ కిందకు వస్తారా రారా అన్న విషయాన్ని పరిశీలిస్తారు. వస్తే క్రమబద్ధీకరించేందుకు అవకాశం కల్పిస్తారు. సంబంధిత లబ్ధిదారులు డిసెంబర్ 31వ తేదీ వరకు దరఖాస్తులను ఇవ్వవచ్చు. మంచి అవకాశం అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించేందుకు ఇది మంచి అవకాశం. దారిద్రరేఖకు దిగువన ఉన్న ప్రతి ఒక్కరికీ జీఓ నంబర్ 225 వర్తిస్తుంది. అర్హులందరూ దరఖాస్తులను డిసెంబర్ 31వ తేదీలోపు సమీపంలోని గ్రామ/వార్డు సచివాలయాల్లో ఇవ్వాలి. ఇళ్లను క్రమబద్ధీకరించుకోవడం ద్వారా మార్కెట్ విలువ వస్తుంది. – పి.కోటేశ్వరరావు, కలెక్టర్, కర్నూలు -
దేశంలో తగ్గిన బిలియనీర్ల సంఖ్య
మన దేశంలో బిలియనీర్ల సంఖ్య స్వల్పంగా తగ్గింది. ఆదాయపు పన్ను రిటర్న్ లో ప్రకటించిన స్థూల మొత్తం ఆదాయం ఆధారంగా 2019-20లో 141గా కుబేరుల సంఖ్య 2020-21లో 136కు తగ్గిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంటుకు తెలిపారు. 2018-19లో ఈ సంఖ్య 77గా ఉందని ఆమె రాజ్యసభకు ఇచ్చిన సమాధానంలో తెలిపారు. అంటే కేవలం రెండు ఏళ్లలో బిలియనీర్ల సంఖ్య రెండు రేట్లు అయ్యింది. "సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్(సీబీడీటీ)లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. ప్రత్యక్ష పన్నుల కింద బిలియనీర్ అనే పదానికి చట్టపరమైన లేదా పరిపాలనా నిర్వచనం లేదు. 01.04.2016లో సంపద పన్ను రద్దు చేయడం వల్ల సీబీడీటీ వ్యక్తిగత పన్ను చెల్లింపుదారు సంపద గురించి పూర్తి సమాచారం లేదు" అని ఆమె అన్నారు. మాజీ టెండూల్కర్ కమిటీ పేదరిక అంచనాల ప్రకారం, భారతదేశంలో దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్న వారి సంఖ్య 20011-12లో 27 కోట్లు(21.9 శాతం)గా అంచనా వేయబడింది. 'సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్'కు ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం, ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి & సమ్మిళిత అభివృద్ధిని పెంపొందించడానికి అనేక పథకాలను ప్రారంభించినట్లు ఆమె చెప్పారు. 2020-21 ఆర్థిక సర్వేలో పేర్కొన్న విధంగా.. తాగునీరు, పారిశుధ్యం, పరిశుభ్రత, గృహ పరిస్థితి కనీస అవసరాల విషయంలో 2012 నుంచి 2018 వరకు పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది, గ్రామీణ & పట్టణ ప్రాంతాలలోని సంపన్న కుటుంబాలతో పోలిస్తే పేద కుటుంబాలకు అసమానత భారీగా తగ్గినట్లు సీతారామన్ తెలిపారు. అలాగే మరో ప్రశ్నకు సమాధానమిస్తూ.. ధరల పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుందని, ధరల స్థిరత్వాన్ని కొనసాగించడానికి తగిన చర్యలు తీసుకుంటుందని ఆర్థిక మంత్రి తెలిపారు. వంటనూనెలపై దిగుమతి సుంకాలను తగ్గించడం, పప్పుధాన్యాల నిల్వలపై పరిమితి విధించినట్లు తెలిపారు. -
బీపీఎల్ జాబితాలో బీజేపీ ఎమ్మెల్యే పేరు
జమ్మూ: కశ్మీర్ లో బీజేపీ-పీడీపీ ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. దార్రిద్య రేఖ దిగువన్న వారి జాబితా(బీపీఎల్)లో ఛాబ్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ క్రిషన్ లాల్ భగత్ పేరు ఉండడంపై దుమారం రేగింది. దీనిపై ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు అసెంబ్లీలో నిలదీశాయి. దీంతో మెహబూబా సర్కారు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. బాధ్యులైన తహశీల్దార్, ఇద్దరు పౌరసరఫరాల శాఖ అధికారులను సస్పెండ్ చేశారు. బీపీఎల్ జాబితాలో తన పేరు పొరపాటుగా చేర్చారని గతంలో క్రిషన్ లాల్ భగత్ ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తుకు ఆదేశించామని రెవెన్యు శాఖ మంత్రి సయిద్ బాష్రాత్ బుకారీ అసెంబ్లీలో తెలిపారు. 7 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని జమ్మూ డిప్యూటీ కమిషనర్ ను ఆదేశించినట్టు చెప్పారు.