బీపీఎల్ జాబితాలో బీజేపీ ఎమ్మెల్యే పేరు | Official suspended for including MLA in BPL list | Sakshi
Sakshi News home page

బీపీఎల్ జాబితాలో బీజేపీ ఎమ్మెల్యే పేరు

Published Fri, Jun 10 2016 3:07 PM | Last Updated on Mon, Sep 4 2017 2:10 AM

బీపీఎల్ జాబితాలో బీజేపీ ఎమ్మెల్యే పేరు

బీపీఎల్ జాబితాలో బీజేపీ ఎమ్మెల్యే పేరు

జమ్మూ: కశ్మీర్ లో బీజేపీ-పీడీపీ ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. దార్రిద్య రేఖ దిగువన్న వారి జాబితా(బీపీఎల్)లో ఛాబ్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ క్రిషన్ లాల్ భగత్ పేరు ఉండడంపై దుమారం రేగింది. దీనిపై ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు అసెంబ్లీలో నిలదీశాయి. దీంతో మెహబూబా సర్కారు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. బాధ్యులైన తహశీల్దార్, ఇద్దరు పౌరసరఫరాల శాఖ అధికారులను సస్పెండ్ చేశారు.

బీపీఎల్ జాబితాలో తన పేరు పొరపాటుగా చేర్చారని గతంలో క్రిషన్ లాల్ భగత్ ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తుకు ఆదేశించామని రెవెన్యు శాఖ మంత్రి సయిద్ బాష్రాత్ బుకారీ అసెంబ్లీలో తెలిపారు. 7 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని జమ్మూ డిప్యూటీ కమిషనర్ ను ఆదేశించినట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement