Brahmakumaris
-
బ్రహ్మకుమారీస్ చీఫ్ దాదీ జానకి ఇకలేరు
జైపూర్/అమరావతి: మహిళల ఆధ్వర్యంలో నడుస్తున్న అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రం బ్రహ్మకుమారీస్ సంస్థాన్ చీఫ్ దాదీ జానకి (104) శుక్రవారం కన్ను మూశారు. గత కొంతకాలంగా శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్న ఆమె, దీర్ఘకాలిక వ్యాధిబాధల కారణంగా మృతిచెందినట్లు ఆ సంస్థకు చెందిన అధికారులు తెలిపారు. 21వ ఏటనే ఆధ్యాత్మిక రంగంలోకి అడుగుపెట్టిన ఆమె తాను ఎంచుకున్న విభాగంలో ఉన్నత శిఖరాలను చేరుకున్నారు. 140 దేశాల్లో ఆమె స్థాపించిన సేవా కేంద్రాలు ఉన్నాయి. దేశానికి ఎన్నో సేవలు అందించిన ఆమె మరణం తనకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం.. బ్రహ్మకుమారీస్ చీఫ్ రాజయోగిని దాదీ జానకి మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన స్పందిస్తూ.. సమాజం కోసం, మహిళా సాధికారత కోసం జానకి విశేష కృషి అందించారని కొనియాడారు. ఆధ్యాత్మిక ఆలోచనలను ముందుకు తీసుకెళ్లే ఎంతో మంది శిష్యులను ఆమె తయారు చేశారని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ గవర్నర్ల సంతాపం.. బ్రహ్మకుమారీస్ చీఫ్ దాదీ జానకి మృతిపట్ల ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, తెలంగాణ గవర్నర్ తమిళి సై సంతాపాన్ని వ్యక్తం చేశారు. బ్రహ్మకుమారీస్ సంస్థ ద్వారా ఆమె తన జీవితాన్ని ఆధ్యాత్మిక, సామాజిక సేవకు అంకితం చేశారని శుక్రవారం వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. -
‘బ్రహ్మకుమారీస్’ సేవలు అభినందనీయం: ప్రణబ్
హైదరాబాద్: గత 80 ఏళ్లుగా బ్రహ్మకుమారీస్ సంస్థ చేస్తున్న సేవలు అభినందనీయమని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ఇఫ్లూ యూనివర్సిటీ స్నాతకోత్సవం సందర్భంగా బుధవారం హైదరాబాద్ గచ్చిబౌలి శాంతిసరోవర్లోని గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం అక్కడి నుంచి బ్రహ్మకుమారీస్ సంస్థ భవనంలోకి వెళ్లి.. సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ప్రణబ్ మాట్లాడుతూ... భారతీయ ప్రాచీన జ్ఞాన, యోగా, ఆధ్యాత్మిక విలువలను సమాజానికి బ్రహ్మకుమారీస్ సంస్థ అందించడం సంతోషదాయక మన్నారు. బ్రహ్మకుమారీస్ సమాజం సేవలో 80 ఏళ్లు పూర్తి చేసుకోవడం అభినంద నీయమన్నారు. అనంతరం రాష్ట్రపతి ప్రణబ్, గవర్నర్ నరసింహన్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీని బ్రహ్మకుమారీస్ సంస్థ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, బ్రహ్మకుమారీస్ సంస్థ అడిషనల్ సెక్రటరీ జనరల్ బ్రిజ్మోహన్, ఢిల్లీ నేషనల్ కో–ఆర్డినేటర్ ఆశాదీదీ, శాంతిసరోవర్ డైరెక్టర్ కుల్దీప్బెహన్ తదితరులు పాల్గొన్నారు. -
ఓం శాంతి సేవలో పాతికేళ్లు
బ్రహ్మకుమారీలకు సత్కారాలు ఘనంగా రజతోత్సవాలు అమలాపురం టౌన్ : సమాజంలో ఆధ్యాత్మికత వ్యాప్తి.. సేవా తత్పరత ధ్యేయంగా పనిచేస్తున్న ప్రజా పిత ఈశ్వరీయ విద్యాలయ వ్యవస్థలో బ్రహ్మకుమారీలుగా జిల్లాలో అందిస్తున్న సేవలు, ఆచరణీయ మార్గాలు అభినందనీయమని ఓం శాంతి ఇన్చార్జి బీకే రజని అన్నారు. బ్రహ్మకుమారీలుగా జిల్లాలో కొందరు ఓం శాంతి ఇన్చార్జిలు పాతికేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక వాసవీ కన్యకా పరమేశ్వరి కల్యాణ మండపంలో జిల్లా స్థాయి బ్రహ్మకుమారీల రజతోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్త బ్రహ్మకుమారీలు హాజరైన సదస్సుకు జిల్లా ఇన్చార్జి రజని అధ్యక్షత వహించి మాట్లాడుతూ 25 ఏళ్ల కిందట బ్రహ్మకుమారీలుగా మారి సేవే పరమార్ధంగా పనిచేస్తున్న జిల్లాలోని తొమ్మిది ఓం శాంతి కేంద్రాల ఇన్చార్జిలను సత్కరించారు. అనంతరం తమ పాతికేళ్ల అధ్యాత్మిక, సేవా ప్రస్థానాన్ని వివరించారు. సత్కారాలు అందుకున్న వారిలో జిల్లా ఇన్చార్జి రజని, అమలాపురం ఇన్చార్జి శ్రీదేవి, స్వరూప, మీరా తదితరులు ఉన్నారు. శివ తత్వంతో ఎలా సేవ చేయవచ్చో...సేవ తత్వంతో శివ మార్గంలో ఎలా వెళ్లవచ్చో రజని వివరించారు. ఓం శాంతి మార్గంలోకి వచ్చిన జిల్లాలోని బ్రహ్మకుమారీలంతా ఎవరికి వారు పాతికేళ్ల సేవలను పూర్తి చేసుకుని రజతోత్సవం చేసుకోవాలని అప్పుడే ప్రజల్లో కూడా ఓం శాంతి సేవలు జిల్లాలో మరింత విస్తరించగలవని ఆమె ఆకాంక్షించారు. -
వెన్నెదొంగతో రియో స్టార్
నగరంలో గురువారం కృష్ణాష్టమి వేడుకలు వైభవంగా నిర్వహించారు. గోపికలతో కలిసి వెన్నెదొంగలు బృందావనంలో విహరించారు. గచ్చిబౌలి శాంతిసరోవర్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవంలో రియో స్టార్ పీవీ సింధు పాల్గొంది. చిన్నికృష్ణులను ఎత్తుకుని ముద్దు చేస్తూ ఆమె సందడి చేసింది. -
జరామరణాలు
జన్మ, మృత్యువు ఒకే నాణానికి ఉన్న బొమ్మ, బొరుసూ వంటివి. జన్మకు, మృత్యువుకు మధ్య సాగే ఈ జీవన ప్రయాణంలో మనిషి చేసే పాప, పుణ్య కర్మల ఫలమే అతని ‘అంతిమ మృత్యు దశ’కి, ‘మరు జన్మ’కి కూడా ఆధారం. మృత్యువు ఒక్కొక్కరికి, ఒక్కో రూపంలో రావటం వెనుక రహస్యం ఇదే. మృత్యువు ఒక వాస్తవికత. దానిని అందరూ ఎదుర్కోవాల్సిందే. నిజానికి మృత్యువు జీవితానికి ‘అంతిమ దశ’ కాదు. మరో కొత్త జీవితానికి ‘ప్రవేశ ద్వారం’ వంటిది. మనిషికి ‘జన్మ-మృత్యువు’కి సంబం ధించిన సత్యజ్ఞానం లేకపోవటం మరియు మహాకాలు డైన ‘పరమాత్మ’తో మనస్సు సంబంధం, స్మృతి లేని కారణంగా ‘మృత్యువు’ పేరు వింటేనే భయభ్రాంతు లకు లోనవుతున్నాడు. జీవన పర్యంతం మనిషి అజ్ఞా నానికి వశమై ‘‘ధన, గణ, యవ్వన గర్వం’’ అంటే ధనం, పదవి, యవ్వనం అశాశ్వత మైన ఈ మూడింటికి వశమై ఎంతో గర్వంతో ఈశ్వరుడిని విస్మరించి, ధర్మాచరణను ప్రక్కనపెట్టి తోటి వారికి దుఃఖాన్ని, నష్టాన్ని కల్గిస్తూ ఎంతో పాపాన్ని మూటగట్టుకొం టాడు. కానీ మృత్యువు, సమయం ఏది వచ్చినా పై ‘మూడూ’ పరిసమాప్తం అవుతాయి. కాగా చేసిన పాప కర్మల శిక్షల ఫలంగా అంతిమంలో ‘మరణవేదన’ అనుభవించిన పిమ్మట కానీ తనువు చాలించరు. మనిషి వైజ్ఞానికంగా ఎంత ప్రగతిని సాధించినా మృత్యువును తప్పించలేడు. ‘వంద కోట్లకు’ అధిపతు లైనా ‘ఒక్క నిమిషం’ ఆయుష్షును కొనలేరు. ధన సంపాదనకై ధర్మ చింతనకు దూరమై ‘లక్షల రూపా యల’ ధనాన్ని కూడబెట్టినా ‘ఒక్క రూపాయి’ సుఖాన్ని కూడా పొందలేరు. ఇదే కర్మ సిద్ధాంతం. ‘‘మనిషి సంపాదించిన ధన సంపద- నేలమీద; పశు సంపద- గోశాలలో; ఆలి- ఇంటివాకిట వరకు; బంధువులు- బజారు వరకు; వదలిన శరీరం- శవం చితిమీదే మిగిలిపోతుంది. అవి అంతవరకే తోడువస్తాయి. మరణించిన వాడికి వెన్నంటి వచ్చేది ‘ధర్మాచరణ’ మాత్రమే. కాబట్టి గర్వాన్ని వదలిన మానవుడు సత్ప్రవర్తన ఫలితంగా సౌఖ్యాన్ని పొందుతాడు. మృత్యువుని తప్పించలేరు. మరణం అంటే ఆత్మ తన శరీరమనే వస్త్రాన్ని మార్చుకోవటం, తన ‘అడ్రస్’ని మార్చుకోవటం మాత్రమే. ఆత్మజ్ఞాని ‘పరమాత్ముని స్మృతి’లో పండు తొడిమ నుంచి దానంతటదే వేరై కిందపడినంత సహజంగా శరీరమనే వస్త్రాన్ని వదలి పెడతాడు. వర్తమాన సమయంలో అన్ని సమస్యలకు కారణం ‘‘ఆత్మజ్ఞానాన్ని’’ ఉపేక్షించటం, పరమాత్మతో బుద్ధి వియోగం, దేహాభిమానానికి వశమై రాగ, ద్వేషాదుల్లో ఇరుక్కుపోవటం, ఆత్మ స్వరూపాన్ని తెల్సుకొని అనుభవం చేసుకొన్న తర్వాతే భోగాలతో అనాసక్తత, ఈర్ష్య, లోభం, కామ, క్రోధాదులతో ముక్తి, తద్వారా ‘మృత్యు భయం’ నుంచి విముక్తి లభిస్తుంది. సదా ఈశ్వరీయ సేవలో... - బ్రహ్మకుమారి వాణి