Brahmotsavalu in Kanipakam
-
వరసిద్ధుని దర్శనానికి వేళాయె
యాదమరి: కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఐదు నెలల తర్వాత స్వయంభు వరసిద్ధుని దర్శన భాగ్యం ఈ నెల 21 నుంచి లభించనుంది. రూ.10 కోట్లతో ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ ఏడాది మార్చి 27 నుంచి గర్భాలయ మూలమూర్తి స్వయంభు దర్శనం నిలిపివేశారు. నవగ్రహ మండపం వెనుక భాగంలో బాలాలయం నిర్మించారు. అత్తికొయ్యతో వినాయక స్వామి ప్రతిమను సిద్ధం చేశారు. ఆ రోజు నుంచి శనివారం వరకు దాదాపుగా ఐదునెలల పాటు భక్తులకు బాలాలయంలోనే స్వామి దర్శనం లభించింది. ఇక కుంభాభిషేకం క్రతువు ముగిసిన తర్వాత ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి కొత్త ఆలయంలోని స్వయంభు మూలవిరాట్టు దర్శనానికి భక్తులను అనుమతిస్తామని ఆలయ చైర్మన్ మోహన్‌రెడ్డి, ఈవో సురేష్‌బాబు తెలిపారు. ఈ నెల 31 నుంచి కాణిపాకం వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు ఆరంభం కానున్నాయి. మొత్తం 21 రోజుల పాటు వివిధ వాహన సేవల్లో స్వామివారు ఆలయ పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. -
సెప్టెంబర్ 10 నుంచి కాణిపాక బ్రహ్మోత్సవాలు
కాణిపాకం (యాదమరి): చిత్తూరు జిల్లా కాణిపాకంలోని స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 10 నుంచి 21 రోజుల పాటు వైభవంగా నిర్వహించడానికి ఆలయ ఉభయదారులు తీర్మానించారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు స్వామివారి అనుబంధ ఆలయం శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయంలో ఉభయదారుల సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్ 10వ తేదీ శుక్రవారం చవితి రోజు నుంచి 21 రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ఉభయదారులు తీర్మానించారు. దీంతో అర్చక వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి బ్రహ్మోత్సవాల పత్రికను ఉభయదారులకు చదివి వినిపించారు. అనంతరం ఈవో వెంకటేశు మాట్లాడుతూ స్వామివారి బ్రహ్మోత్సవాల వివరాలను దేవదాయ, ధర్మాదాయ శాఖ అధికారులకు, జిల్లా కలెక్టర్‌కు వివరిస్తామన్నారు. కరోనా నేపథ్యంలో వారు వాహనసేవలను ప్రాకారోత్సవం నిర్వహించమంటే ప్రాకారోత్సవం, గ్రామోత్సవం నిర్వహించమంటే గ్రామోత్సవం నిర్వహిస్తామని వివరించారు. అనంతరం ఉభయదారులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. -
కాణిపాకంలో రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు
చిత్తూరు: కాణిపాకంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపటి నుంచి బ్రహ్మాత్సవాలు ప్రారంభమవుతాయి. 21రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు ఆలయ కమిటీ భారీ ఏర్పాట్లు చేసింది. స్వయంభు వినాయకుడి బ్రహ్మోత్సవాలు వినాయక చవితి రోజు ప్రారంభం కావడం ఇక్కడ ఆనవాయితి. ఆదిదేవుణ్ణి మొదట పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగిపోతాయి అనేది నమ్మకం. ఆ నమ్మకంతోనే భక్తులు వినాయకుడికి చాలా భక్తి శ్రద్దలతో నవరాత్రోత్సవాలు ఘనంగా జరుపుతారు. అయితే రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా కాణిపాకంలోని వరసిద్ధి వినాయకుడి బ్రహ్మోత్సవాలు 21రోజుల పాటు నిర్వహిస్తారు. కాణిపాకం చుట్టూ ఉన్న 14 గ్రామాల ప్రజలు బ్రహ్మత్సవాల్లో పాల్గొంటారు. ఆలయం తరఫున 11 రోజులు మరో 9 రోజులు ప్రత్యేక ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ పూజాకార్యక్రమాల్లో అందరికి ప్రాధాన్యతనిస్తారు. వినాయక చవితితో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. విద్యుత్ దీపాలంకరణ, భక్తుల బారులుతీరేందుకు ఏర్పాట్లు, స్నానాల కోసం కోనేరు, వాహనాల పార్కింగ్ కోసం విశాలమైన స్థలాన్ని ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో జిల్లా ఉన్నతాధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు.