'మందకృష్ణ రథయాత్రను అడ్డుకునేందుకు కుట్ర'
ప్రకాశం: ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ చేపట్టనున్న రథయాత్రను అడ్డుకునేందుకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ కుట్ర పన్నుతోందని ఎమ్మార్పీఎస్ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మయ్య మాదిగ ఆరోపించారు. సోమవారం ఆయన ప్రకాశం జిల్లాలో విలేకరులతో మాట్లాడారు. ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై బైండోవర్ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
అన్ని జిల్లాల్లో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను నిర్బంధిస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఖూనీ చేస్తున్నారని బ్రహ్మయ్య మాదిగ విమర్శించారు.