Brand India
-
2047 నాటికి సంపన్న దేశంగా భారత్,‘బ్రాండ్ ఇండియా’నే లక్క్ష్యంగా
న్యూఢిల్లీ: అత్యుత్తమ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తులు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని పరిశ్రమకు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియుష్ గోయల్ సూచించారు. తద్వారా 2047 నాటికి భారత్ సంపన్న దేశంగా ఎదిగేలా ’బ్రాండ్ ఇండియా’ను నిర్మించడంలో తోడ్పడాలని పేర్కొన్నారు. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ)కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. నాణ్యతా ప్రమాణాలకు సంబంధించిన వివిధ నియంత్రణ సంస్థలన్నింటినీ ఒకే గొడుగు కిందికి తేవడంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు, మరింత మంది మహిళలు చార్టర్డ్ అకౌంటెన్సీ ప్రొఫెషన్‌ను ఎంచుకోవాలని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా గోయల్ సూచించారు. అంతర్జాతీయ స్థాయి కంపెనీలతో పోటీపడేలా భారతీయ సీఏ సంస్థలను తీర్చిదిద్దేందుకు ఐసీఏఐ కృషి చేయాలని ఆయన పేర్కొన్నారు. -
దేశానికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండాలి
శాన్ ఫ్రాన్సిస్కో: ’బ్రాండ్ ఇండియా’కు ప్రచారకర్తలుగా వ్యవహరించాలని భారతీయ చార్టర్డ్ అకౌంటెంట్లకు (సీఏ) కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ సూచించారు. దేశంలోకి పెట్టుబడులు వచ్చేలా కృషి చేయాలని, దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పాటు అందించాలని ఆయన పేర్కొన్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం 3.3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఉన్న భారత్ వచ్చే 30 ఏళ్లలో 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతోందని గోయల్ చెప్పారు. ‘భారత్‌లో పెట్టుబడుల అవకాశాల గురించి మీరు అంతర్జాతీయ క్లయింట్లకు వివరించండి. ఆ విధంగా అమెరికాలోను ఇతర ప్రాంతాల్లోను ఉన్న భారతీయ సీఏలు ఆయా దేశాలకు, భారత్‌కు మధ్య వారధిగా నిల్చినవారవుతారు‘ అని ఆయన పేర్కొన్నారు. అలాగే అత్యంత నాణ్యమైన ఉత్పత్తులు, సేవలను భారత్ అందుబాటు ధరల్లోనే అందిస్తున్న విషయాన్ని కూడా ఇతర దేశాలకు తెలియజేయాలని గోయల్ సూచించారు. ఐసీఏఐ సభ్యులు పండుగలు మొదలైన సందర్భాల్లో బహుమతులు ఇచ్చేందుకు మేడిన్ ఇండియా ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు. దేశీ సీఏ సంస్థలు అంతర్జాతీయ స్థాయి దిగ్గజాలుగా ఎదిగే లక్ష్యంతో పనిచేయాలని సూచించారు. -
ఎగుమతుల పెంపుకు కేంద్రం వ్యూహం.. బ్రాండ్ ఇండియాపై భరోసా..
న్యూఢిల్లీ: భారత్ నుంచి ఎగుమతులను మరింతగా పెంచుకునేందుకు వీలుగా కేంద్ర వాణిజ్య శాఖ ‘బ్రాండ్ ఇండియా’ పేరిట ప్రచార కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలనుకుంటోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులు 400 బిలియన్ డాలర్లను మించనున్నాయని అంచనా. దీంతో భారత్ చేసే వస్తు, సేవల ఎగుమతులకు మరింత ప్రచారం తీసుకురావడం ద్వారా ఎగుమతులు పెంచుకోవాలని వాణిజ్య శాఖ భావిస్తోంది. బ్రాండ్ ఇండియా ప్రమోషన్లో భాగంగా ముందుగా జెమ్స్, జ్యుయలరీ, టెక్స్టైల్స్, ప్లాంటేషన్, టీ, కాఫీ, మసాలా దినుసులు, విద్య, హెల్త్‌కేర్, ఫార్మా, ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులకు ప్రచారం కల్పించనుంది. నాణ్యత, వారసత్వం, టెక్నాలజీ, విలువ, ఆవిష్కరణలపై ప్రత్యేక దృష్టి సారించనుంది. ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్ (ఐబీఈఎఫ్) నిర్వహిస్తున్న బ్రాండ్ ఇండియా ప్రచారం పురోగతిపై ఇటీవలే కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సమీక్ష నిర్వహించారు. భారత్‌లో తయారీ అయ్యే ఉత్పత్తులు, సేవల గురించి అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో ప్రచారం, అవగాహన కల్పించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ ఐబీఈఎఫ్. -
‘బ్రాండ్ ఇండియా’కు విదేశాల్లో విస్తృత ప్రచారం
వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లో ‘బ్రాండ్ ఇండియా’కు మరింత విస్త్రృత ప్రాచుర్యం కల్పించేందుకు వీలుగా భాగస్వాములతో తమ శాఖ ఆధ్వర్యంలో చర్చలు జరపనున్నట్టు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దేశం వెలుపల బ్రాండ్ ఇండియాకు ప్రచారం కల్పించడం, పరిరక్షించుకోవడం అన్నది కేవలం పెట్టుబడులు రాబట్టడానికే కాదని, ప్రపంచ మార్కెట్లలోకి చొచ్చుకుపోయేందుకు చాలా కీలకమని మంత్రి చెప్పారు. దీని వల్ల దేశీయ మార్కెట్‌కు లబ్ధి కలుగుతుందన్నారు. దీనిపై విస్తృత చర్చలకు వీలుగా ఓ రోజు సమావేశాన్ని నిర్వహించే యోచనలో ఉన్నట్టు చెప్పారు. విదేశాల్లో బ్రాండ్ ఇండియాను ముందుకు తీసుకెళ్లేందుకు సర్కారు ఏం చేయాలన్న దానిపై ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడి వారైనా తమ ఆలోచనలు తెలియజేయవచ్చని సూచించారు. మంగళవారం ఢిల్లీలో ‘భారత్‌లో తయారీ’ అంశంపై ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్మలా సీతారామన్ ప్రసంగించారు. బ్రాండింగ్ సన్నాహాల్లో భాగంగా ఇండియా బ్రాండ్ ఈక్విటీ ఫౌండేషన్‌ను వాణిజ్య శాఖ పునరుద్ధరించినట్టు ఆమె చెప్పారు.