వైభవంగా పుష్పయాగం
వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్థలమైన తాళ్లపాకలో శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్దేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారంతో ముగిశాయి. ఈనెల 14 నుంచి 24 వరకు ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగాయి. శ్రీ సిద్దేశ్వరస్వామి, శ్రీ చెన్నకేశవస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఈ సారి భక్తులు విరివిగానే విచ్చేశారు. శ్రీ సిద్దేశ్వరస్వామి, చెన్నకేశవస్వామికి ఆదివారం ఉదయం స్నపన తిరుమంజనం, హోమం, రాత్రి పుష్పయాగం నిర్వహించారు. – తాళ్లపాక (రాజంపేట)