'ఆ నియంత పుస్తకాన్ని నిలిపేయండి'
బ్రసిలియా: బ్రెజిల్లో జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ జీవిత చరిత్ర ప్రచురణను నిషేధించారు. ఇకపై హిట్లర్ జీవిత చరిత్ర 'మెయిన్ క్యాంప్' ప్రచురణలు చేయోద్దని బ్రెజిలియన్ న్యాయమూర్తి అల్బర్టో సాలోమావో జూనియర్ ఆదేశించారు. ఆమేరకు కోర్టు ఆదేశాలు అమలు చేయాలని స్పష్టం చేశారు. యూదుల సామాజిక మత పరిస్థితుల్లో అసహనానికి తావివ్వకుండా ఉండాలంటే ఆ పనిచేసి తీరాలని అన్నారు.
హిట్లర్ పుస్తకం బ్రెజిల్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని, అందులోని అంశాలు జాతి వివక్షను పురికొల్పే విధంగా ఉన్నాయంటూ రియో డి జనిరో కోర్టు జస్టిస్ అల్బర్ట్ అన్నారు. తన తీర్పును ఎవరైన ఉల్లంఘిస్తే కఠిన శిక్షతో పాటు భారీ మొత్తంలో జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఆదేశించారు. మెయిన్ క్యాంప్ ను హిట్లర్ 1925లో రచించాడు. జర్మనీ నియంత అయిన హిట్లర్ యూదులను ఊచకోత కోసిన విషయం తెలిసిందే.