రూపాయికి నాలుగో రోజున నష్టాలే!
దిగుమతిదారుల డిమాండ్ కారణంగా ఇంటర్ బ్యాంక్ ఫారెన్ ఎక్స్సెంజ్ (ఫారెక్స్) మార్కెట్లో రూపాయి వరుసగా నాలుగో రోజు నష్టపోయింది. ఆరంభంలోనే డాలర్ తో పోల్చితే రూపాయి 63 ఎగువన ట్రేడ్ అయింది. ప్రస్తుతం నిన్నటి ముంగింపు (62.47)తో పోల్చితే.. 79 పైసలు నష్టపోయి 63.29 వద్ద ట్రేడ్ అవుతోంది.
రూపాయి పతన ప్రభావంతో ఇన్నెస్టర్లు ఈక్విటీ మార్కెట్లో అమ్మకాలను కొనసాగిస్తున్నారు. దాంతో భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు సెన్సెక్స్ ఓ దశలో 152 పాయింట్ల కోల్పోయింది. ప్రస్తుతం సెన్సెక్స్ 110 పాయింట్ల నష్టంతో 20555 వద్ద, నిఫ్టీ 41 పాయింట్లు క్షీణించి 6099 వద్ద కొనసాగుతున్నాయి.
సూచీ అధారిత కంపెనీ షేర్లలో కెయిర్న్, టీసీఎస్, మారుతి సుజుకీ, డాక్టర్ రెడ్డీస్ లాబ్స్, ఐటీసీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, లార్సెన్, ఎన్ఎమ్ డీసీ, డీఎల్ఎఫ్, హిండాల్కోలు 3 శాతానికి పైగా నష్టపోయాయి.