Bribery affair
-
ఎంపీ కవిత పీఏలం.. అంతా చూసుకుంటాం..!
సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్ఎస్ ఎంపీ మాలోత్ కవిత పీఏలమంటూ ఓ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటున్న ముగ్గురిని సీబీఐ అరెస్టు చేసింది. ఢిల్లీలోని న్యూగుప్తా కాలనీకి చెందిన మన్మీత్ సింగ్ లాంబా నివాసాన్ని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీడీ) కూల్చేయనుందని, కూల్చకుండా చూసుకుంటామని లాంబాను నిందితులు సంప్రదించారు. ఎంసీడీలో ఓ అధికారి తెలుసని, ఇల్లు కూల్చకుండా ఉండేందుకు రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంపీ కవిత నివాసంలో గురువారం రూ.లక్ష లంచం తీసుకుంటుండగా, రెడ్ హ్యాండెడ్‌గా ముగ్గురు నిందితులను సీబీఐ అదుపులోకి తీసుకుంది. వారిలో రాజీవ్ భట్టాచార్య, శుభాంగి గుప్తా, దుర్గేశ్‌కుమార్ ఉన్నారు. లాంబా ఫిర్యాదు ప్రకారం.. ఎంసీడీలో అధికారి తనకు తెలుసని, టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత పీఏనంటూ రాజీవ్ భట్టాచార్య తొలుత పరిచయం చేసుకున్నాడు. ఎంపీ కవితకు కో–ఆర్డినేటర్ అంటూ శుభాంగి గుప్తాను పరిచయం చేశాడు. ఆ తర్వాత దుర్గేశ్కుమార్ను ఎంపీ మరో పీఏ అంటూ పరిచయం చేశాడు. ముగ్గురూ కలిసి రూ.5 లక్షలు డిమాండు చేశారు. తదనంతరం జరిపిన చర్చల్లో చివరకు రూ.లక్షకు బేరం కుదుర్చుకున్నారు. బీష్మంబర్దాస్ మార్గ్‌లోని ఎంపీ నివాసానికి డబ్బు తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ విషయాన్ని లాంబా సీబీఐకి ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగి, రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. నిందితులను నేడు కోర్టులో హాజరుపర్చనున్నారు. ఢిల్లీలో నాకు పీఏలెవరూ లేరు: ఎంపీ ఢిల్లీలో తనకు వ్యక్తిగత సహాయకులు ఎవరూ లేరని ఎంపీ మాలోత్ కవిత స్పష్టం చేశారు. ఓ గృహ నిర్మాణదారుడి నుంచి డబ్బులు వసూలు చేసిన ముఠాలో తన పీఏ ఉన్నాడంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన దుర్గేశ్ అనే వ్యక్తి కేవలం 2 నెలల కిందటే కారు డ్రైవర్‌గా చేరాడని, అతడికి స్టాఫ్ క్వార్టర్స్ ఇచి్చనట్లు వెల్లడించారు. యూపీకి చెందిన దుర్గేశ్‌కు తాను ఢిల్లీ వెళ్లినప్పుడే వాహనం ఇస్తానని, గురువారం జరిగిన ఘటన నేపథ్యంలో తక్షణమే విధుల నుంచి తొలగించానని వివరణ ఇచ్చారు. చదవండి: ప్రాణం లేదని.. చెత్తకుప్పలోకి -
లంచం ఇస్తేనే ఎల్ఐసీకి ఫైల్
సాక్షి, కాళోజీ సెంటర్(వరంగల్) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు బీమా పథకం అమలులో కొందరు ఉద్యోగుల తీరు కారణంగా అప్రతిష్ట వస్తోంది. ఇప్పటికే రెవెన్యూ శాఖపై పుట్టెడు కోపంతో ఉన్న రైతులు.. ప్రస్తుతం వ్యవసాయ శాఖపై కూడా అదే భావనకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైతులకు బాసటగా నిలుస్తున్న రైతు బంధు, రైతు బీమా పథకాలకు రైతుల్లో మంచి పేరు ఉన్నా... అధికారుల తీరు దీనిని పలుచన చేస్తోంది. మహబూబాబాద్ జిల్లా గార్లకు చెందిన ఏఈఓ ఒకరు రైతులకు చెల్లించాల్సిన రైతు బంధు పథకం డబ్బును సొంత ఖాతాలో జమ చేసుకుని సస్పెన్షన్‌కు గురైన విషయం విదితమే. ఇక రైతు బీమా విషయంలో వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ ఉద్యోగి.. తాను అడిగినంత డబ్బు ఇస్తేనే పరిహారం ఫైల్‌ను ఎల్ఐసీకి సమర్పిస్తానంటూ నాన్చుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగిపై విచారణ జరపగా నిజమేనని తేలినా... చర్యలు తీసుకోకుండా అధికారులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు జరుగుతున్న ప్రచారం చర్చనీయాంశంగా మారింది. పరిహారం కోసం లంచం అన్నదాతకు అండగా ఉండేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలుచేస్తోంది. ఇందులో భాగంగానే రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వమే బీమా ప్రీమియంను ఎల్ఐసీకి చెల్లించింది. ఏదేని జరగరాని సంఘటన జరిగి రైతు మృతి చెందితే ఆయన కుటుంబానికి బీమా సంస్థ ద్వారా రూ.5లక్షల పరిహారం అందుతుంది. అయితే, రైతు కుటుంబ సభ్యులు లంచం ఇవ్వనిదే ఉద్యోగులు జీవిత బీమా సంస్థ(ఎల్ఐసీ) ఫైల్ పంపడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన వ్యవసాయ విస్తరణ అధికారి(ఏఈఓ) ఒకరు ఇదే తరహాలో పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేయగా అధికారుల దృష్టికి వెళ్లింది. అయితే, సదరు ఉద్యోగిపై గతంలో కూడా పలు ఆరోపణలు ఉన్నట్లు తెలిసింది. ఆ ఉద్యోగి మాకొద్దు... ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యవసాయ విస్తరణ అధికారి చాలా రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడని రైతులు ఫిర్యాదు చేశారు. గతంలో కూడా అనేక ఆరోపణలు ఉండడంతో అధికారులు చీవాట్లు పెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. అయినా ఆయనలో మార్పు రాకపోవడంతో వేరో చేటకు బదిలీ చేయాలని స్థానికంగా ఉండే ఓ అధికారి.. జిల్లా ఉన్నతాధికారులకు లేఖ రాసినట్లు సమాచారం. మా దృష్టికి వచ్చింది... వ్యవసాయ విస్తరణాధికారి ఒకరు అవినీతికి పాల్పడుతున్నాడనే విషయం మా దృష్టికి వచ్చింది. దీనిపై సమగ్ర విచారణ జరిపించాము. ఆయన వల్ల రైతులకు ఇబ్బంది కలుగుతున్నట్లు విచారణలో తేలింది. ఈ మేరకు తదుపరి చర్యల కోసం జిల్లా అధికారికి నివేదిక సమర్పించాం. – దామోదర్ రెడ్డి, సహాయ వ్యవసాయ సంచాలకుడు -
వాగ్యుద్ధం
♦ స్పీకర్‌తో స్టాలిన్ ఢీ ♦ సమాధానం కరువుతో వాకౌట్ ♦ అన్ని నగరాల్లో రూ.1,362 కోట్లతో స్మార్ట్ సిటీలు ♦ దరఖాస్తులు అన్నీ ఆన్లైన్లో నమోదు ♦ అసెంబ్లీలో మంత్రి ఎస్పీ వేలుమణి ప్రకటన ఎమ్మెల్యేలకు ముడుపుల వ్యవహారంపై స్పీకర్ ధనపాల్, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ మధ్య బుధవారం అసెంబ్లీ వేదికగా తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. తన ప్రశ్నలతో స్పీకర్‌ను ఉక్కిరిబిక్కిరి చేసినా, సమాధానాలు మాత్రం రాబట్టలేదు. దీంతో స్పీకర్ తీరును నిరసిస్తూ సభనుంచి డీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు. ఇక, నగరాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి శాఖల్లో అభివృద్ధిపరంగా నిధుల కేటాయింపు చర్చలో ఆ శాఖ మంత్రి ఎస్పీ వేలుమణి పలు కొత్త ప్రకటనలు చేశారు. సాక్షి, చెన్నై : అసెంబ్లీలో బుధవారం ప్రశ్నోత్తరాల అనంతరం సభ వేడెక్కింది. ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు సంధించిన అనేక ప్రశ్నలకు ఆయా శాఖల మంత్రులు సమాధానాలు ఇచ్చారు. చెన్నైలో మరో 100 మినీ బస్సు సేవలు సాగనున్నట్టు రవాణాశాఖ మంత్రి విజయభాస్కర్, అడవి పందుల కాల్చివేతకు ఉత్తర్వులు ఇచ్చినట్టు అటవీశాఖ మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ సభ్యుల ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ తన ప్రసంగంలో బలపరీక్ష సమయంలో ఎమ్మెల్యేలకు ముడుపుల వ్యవహారాన్ని అస్త్రంగా చేసుకుని గళం విప్పారు. ఇందుకు స్పీకర్ ధనపాల్ తీవ్ర ఆక్షేపణ వ్యక్తంచేశారు. దీంతో తాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకోవాలని ఇన్చార్జి గవర్నర్ విద్యాసాగర్‌రావు జారీచేసిన ఉత్తర్వుల గురించి ప్రసంగాన్ని అందుకున్నారు. ఎలాంటి చర్యలు తీసుకున్నారో, గవర్నర్‌కు ఎలాంటి వివరణ ఇచ్చారో స్పష్టంచేయాలని డిమాండ్‌చేశారు. ఇందుకు స్పీకర్ నిరాకరించడంతో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరువురూ మాటల తూటాల్ని పేల్చుకున్నారు. గవర్నర్ తమను ప్రశ్నించారని, అందుకుతగ్గ వివరణ ఇచ్చుకున్నామని, అది బహిర్గతం చేయాల్సిన అవసరం లేదంటూ స్పీకర్ తేల్చి చెప్పారు. గవర్నర్‌కు పంపే లేఖలు రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఉందని, సమాధానం ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. దీంతో స్పీకర్ తీరును నిరసిస్తూ డీఎంకే సభ్యులు సభనుంచి వాకౌట్ చేశారు. ఈ సందర్భంగా స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ, స్పీకర్ అంతా రహస్య వ్యవహారాలు సాగిస్తుండడం శోచనీయమని విమర్శించారు. ముడుపుల వ్యవహారం కప్పిపుచ్చే యత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇక, సభలో తీవ్రస్థాయిలో వాగ్వాదం సాగుతున్నా, ముడుపుల వ్యవహారంలో మాజీ సీఎం పన్నీరు సెల్వం నేతృత్వంలోని ఎమ్మెల్యేలు మౌనంగా ప్రేక్షక పాత్ర పోషించడం గమనార్హం. గత కొద్ది రోజులుగా ఆ ఎమ్మెల్యేలు మౌనంగానే ముందుకు సాగుతున్నారు. స్మార్ట్ సిటీలు డీఎంకే వాకౌట్ తదుపరి సభలో నగర, గ్రామీణాభివృద్ధి శాఖకు నిధుల కేటాయింపులపై మంత్రి ఎస్పీ వేలుమణి కొత్త ప్రకటనలు చేశారు. ఇందులో 66 అంశాలున్నాయి. ప్రధానంగా రూ.250 కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో నీటి పరివాహక ప్రదేశాల్లో రెండు లక్షల చెక్ డ్యామ్‌ల నిర్మాణం, రూ.300 కోట్లతో చెరువులు, కొలనుల్లో పూడికత తీత, రూ.200 కోట్లతో గ్రామాల్లో ఎల్ఈడీ బల్బుల ఏర్పాట్లు ఉన్నాయి. అలాగే, చెన్నై కార్పొరేషన్ పరిధిలోని భవనాల మీద సౌర విద్యుత్ ఉత్పత్తికి రూ.39 కోట్లు కేటాయించారు. చెన్నై, కోయంబత్తూరు, మదురై, తిరుచ్చి తదితర పన్నెండు కార్పొరేషన్లలో రూ.1,326 కోట్లతో స్మార్ట్ సిటీల నిర్మాణం చేపట్టి, 2020 నాటికి ముగించేందుకు నిర్ణయించారు. ఇంటి నిర్మాణాలు, ఆస్తి విలువ తదితర అనుమతులు, వివరాల కోసం దరఖాస్తులను ఆన్లైన్పరం చేశారు. ఈషా కేంద్రంతో ఔట్రీచ్ విషయంగా ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు ప్రకటించారు.