Bridal Party
-
బ్రైడల్ షవర్ కోసం ముస్తాబైన అలీ కూతురు (ఫొటోలు)
-
బాజాభజంత్రీలతో పెళ్లి బృందం.. ఒక్కసారిగా షాక్.. కాడెద్దులు పరుగో పరుగు..
వెల్దుర్తి(కర్నూలు జిల్లా): బాజా భజంత్రీలతో వెళ్తున్న పెళ్లి బృందంపై కాడెద్దులు బండితో సహా పరుగుతీయడంతో ఏడుగురు గాయపడ్డారు. ఈ ఘటన రామళ్లకోటలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన సాలెవాళ్ల పెళ్లికి సంబంధించిన కార్యక్రమంలో భాగంగా పెళ్లి బృంద సభ్యులు గ్రామ సమీపాన గల పాలకొమ్ము, పుట్టమన్ను తీసుకుని తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సమయంలో బోయనపల్లెకు చెందిన రైతు తన ఎద్దులబండి (టైర్ల చక్రాలు కలిగిన బండి)లో వేరుశనగ కట్టె తీసుకువెళ్లేందుకు రామళ్లకోటకు వచ్చి వనం వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద గల పంక్చర్ షాపు వద్ద టైర్లలో గాలి చెక్ చేసుకుంటున్నాడు. చదవండి: భర్త సంతకు తీసుకువెళ్లలేదని ఎంత పనిచేశావమ్మా.. ఆలయం పక్క నుంచి బాజాభజంత్రీలతో పెళ్లి బృందం ముందు వెళ్తుండగా కాడెద్దులు ఒక్కసారిగా బండితో సహా వెనుక నుంచి పరుగు లంఘించుకుంటూ వచ్చాయి. ఎదురుగా ఉన్న పెళ్లిబృందాన్ని ఢీకొట్టుకుంటూ దూసుకుని వెళ్లాయి. ఈ ఘటనలో ఏడుగురు గాయపడ్డారు. కాడెద్దులు పరుగుపరుగున అరకిలోమీటరు దూరం వెళ్లిన తరువాత కాడి పట్టెలు తెగిపోయి బండి నుంచి విడిపోయాయి. అక్కడి నుంచి పొలాల వైపు పరుగుతీయడంతో వాటిని పట్టుకునేందుకు యజమానికి దాదాపు గంట సమయం పట్టింది. గాయపడిన ఇద్దరు మహిళలను చికిత్స కోసం వెల్దుర్తి ఆసుపత్రికి తరలించారు. -
రెచ్చిపోయిన హిజ్రాలు, బాలుడిపైనా ప్రతాపం
బత్తలపల్లి/అనంతపురం: హిజ్రాలు రెచ్చిపోయారు. ప్రధాన రహదారిపై భిక్షమెత్తుకుంటూ తాము అడిగిన మేరకు డబ్బు ఇవ్వని ప్రయాణికులపై దాడికి తెగబడ్డారు. ఫలితంగా పలువురు రక్తగాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. పోలీసులు తెలిపిన మేరకు... మంగళవారం సాయంత్రం బత్తలపల్లి మండలం పోట్లమర్రి సమీపంలో కొందరు హిజ్రాలు వాహనాలను ఆపి బలవంతంగా డబ్బు వసూలు చేయసాగారు. అదే సమయంలో నార్పల మండలం బొందలవాడ నుంచి పెళ్లి బృందంతో బొలెరో వాహనం వచ్చింది. దాన్ని ఆపి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేశారు. ఇచ్చిన మేరకు తీసుకునేందుకు హిజ్రాలు ససేమిరా అన్నారు. అంతటితో ఆగకుండా రాళ్లతో దాడికి తెగబడ్డారు. ఘటనలో పెళ్లి బృందంలోని బయన్న, ఈశ్వరమ్మ, ఆంజనేయులు, రామాంజినమ్మ, ఆదెమ్మ, సింహాద్రి, శివయ్య, బాలుడు చిన్న గాయపడ్డారు. అతి కష్టంపై బయటపడిన పెళ్లి బృందం.. బత్తలపల్లి పోలీస్స్టేషన్కు చేరుకుని ఫిర్యాదు చేసింది. తర్వాత గాయపడిన వారు స్థానిక ఆస్పత్రిలో చికిత్స కోసం చేరారు. హిజ్రాల దాడిలో గాయపడిన చిన్నా ఇంతలో పోట్లమర్రికి చేరుకున్న హిజ్రాలు వివస్త్రలుగా మారి రోడ్డుపై పడుకుని ట్రాఫిక్కు అంతరాయం కలిగించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వారిని పంపించి వేశారు. అనంతరం బత్తలపల్లికి చేరుకున్న హిజ్రాలు మద్యం మత్తులో వివస్త్రలుగా మారి కూడలిలో నిలబడి అసభ్యపదజాలంతో దూషణలు మొదలుపెట్టారు. దీంతో పోలీసులు వారిని స్టేషన్కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు కాశి, లావణ్య, మురళి, దుర్గ, శ్యామలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
విషాదంలోనూ వికసించిన దాతృత్వం
పత్తిపాడు/కిర్లంపూడి : వివాహం జరిగి కొన్ని ఘడియలే అయ్యాయి. మంగళ వాయిద్యాలు ఇంకా చెవుల్లోనే మారుమోగుతున్నాయి. ఆ ఆనందానుభూతులు నెమరువేసుకుంటూ బయలుదేరిన పెళ్లి బృందంపై మృత్యువు విరుచుకుపడింది. హాహాకారులు చేస్తూ.. వారంతా తేరుకునేలోగానే.. ఘోరం జరిగిపోయింది. సంఘటన స్థలంలోనే ఇద్దరు మరణించగా, ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు చనిపోవడంతో ఆ పెళ్లింట తీవ్ర విషాదం అలముకుంది. జాతీయ రహదారిలో ప్రత్తిపాడు వద్ద మంగళవారం జరిగిన దుర్ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కిర్లంపూడి మండలం వేలంక గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ కండెల్ల రాజబ్బాయి(60)కి నలుగురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. మూడో కుమార్తె గౌరి వివాహం గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామంలో మంగళవారం ఉదయం జరిగింది. ఈ వివాహానికి 13 మంది మినీ వ్యాన్లో కొడవలి వెళ్లారు. వివాహ తంతు ముగిశాక విందు ఆరగించి, సాయంత్రం స్వగ్రామానికి బయలుదేరారు. రాచపల్లి అడ్డ రోడ్డు జంక్షన్ సమీపంలో రాంగ్ రూట్లో కలప లోడుతో వస్తున్న ట్రాక్టర్ను మినీ వ్యాన్ ఢీకొంది. వాహనంలో చిక్కుకుని రాజబ్బాయి, బలసా సూర్యకాంతం (55) మరణించారు. ఆస్పత్రికి తరలిస్తుండగా బలసా ధర్మరాజు (65), రాజబ్బాయి రెండో కుమార్తె చినతల్లి కుమారుడు రాజాల రాజబాబు(బాలు)(14) చనిపోయారు. ఈ సంఘటనలో గాయపడిన మేడపాడుకు చెందిన తండ్రీకొడుకులు రాయి కాశీ, సాయి మణికంఠ, వేలంక గ్రామానికి చెందిన కండెల్ల సన్యాసమ్మ, విజయకుమారి, నీలాంజలి, ఏడిద భూషణం, మినీవ్యాన్ డ్రైవర్ బచ్చల సూరిబాబును ప్రత్తిపాడు సీహెచ్సీకి, వేమగిరి రాణి, చిక్కాల వేగులమ్మను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.వీరిలో చిక్కాల వేగులమ్మ మినహా మిగిలిన వారిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్ట్మార్టం కోసం స్థానిక సీహెచ్సీకి తరలించారు. ఈ సంఘటనలో ఏడిద ఆషా (15) సురక్షితంగా బయటపడింది. గంటకు పైగా శ్రమించి.. వాహనంలో చిక్కుకున్న మృతదేహాలను వెలికితీసేందుకు పోలీసులు గంటకు పైగా శ్రమించాల్సి వచ్చింది. మినీ వ్యాన్ ముందు సీటులో కూర్చున్న రాజబ్బాయి ఉన్న వైపు ట్రాక్టర్ను తాకడంతో, వాహనం లోపలికి నొక్కుకుపోయింది. అందులో ఇరుక్కున్న రాజబ్బాయిని ప్రత్తిపాడు ఎస్సై ఎం.నాగదుర్గారావు, స్థానికులు బయటకుతీశారు. ఒకరిని విడిచి మరొకరు ఉండలేక.. వృద్ధ దంపతులు చావులోనూ ఒకటయ్యారు. ఈ సంఘటనలో భార్య బలసా సూర్యకాంతం (55) వాహనంలో చిక్కుకుని మరణించగా.. భర్త ధర్మరాజు (65) స్థానిక సీహెచ్సీలో మరణించారు. వ్యవసాయ కూలీలైన భార్యాభర్తలకు నలుగురు సంతానం.ముగ్గురు కుమార్తెలకు వివాహాలు కాగా, వివాహితుడైన కుమారుడు ఏడాది క్రితం చనిపోయాడు. కోడలు, మనవడు నంది అబ్బు, మనవరాలు బుల్లి రాఘవను ధర్మరాజు పోషిస్తున్నారు. అబ్బు, రాఘవ కాకినాడలో ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఇంటికి పెద్ద దిక్కు కోల్పోవడంతో ఆ కుటుంబం జీవనాధారం కోల్పోయింది. కొడుకు మరణించడంతో కన్న కొడుకు మరణించడంతో శోకసంద్రంలో మునిగిన తల్లి.. అంతటి విషాదంలోనూ దాతృత్వాన్ని చూపించింది. ఈ సంఘటనలో మరణించిన రాజబాబు(బాలు) మృతదేహాన్ని చూసేందుకు స్థానిక సీహెచ్సీకి వచ్చిన బాలు తల్లి చినతల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. కొడుకునూ, తండ్రి రాజబ్బాయిని కోల్పోయిన ఆమెను ఊరడించడం ఎవరితరం కాలేదు. పుత్ర శోకంతో తల్లిడిల్లుతూనే తన కుమారుడి నేత్రాలను దానం చేయాలని కోరింది. ఆమె దాతృత్వానికి చూపరులు కన్నీటిపర్యంతమయ్యారు. -
పెళ్లి బస్సులో మంటలు.. ఆరుగురి మృతి
భింద్: మధ్యప్రదేశ్లోని భింద్ జిల్లా లో శుక్రవారం రాత్రి పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు అగ్నికి ఆహుతైంది. ముగ్గురు పిల్లలు సహా ఆరుగురు సజీవదహనమయ్యారు. ఏడుగురు గాయపడ్డారు. హైటెన్షన్ విద్యు త్ తీగ బస్సుపై పడడంతో మంటలు చెలరేగాయి. బరోవాలో పెళ్లికి హాజరైన 60 మందితో వెళ్తున్న ఈ బస్సు భింద్ పట్టణ సమీపంలో ప్రమాదానికి గురైంది.