bright
-
వరల్డ్ బ్రైటెస్ట్ స్టూడెంట్స్ జాబితాలో భారత సంతతి అమ్మాయి
ప్రపంచంలోనే అంత్యంత తెలివైన స్టూడెంట్స్ లిస్ట్‌లో భారత సంతతి అమ్మాయి స్థానం దక్కించుకుంది. యూఎస్ ఆధారిత జాన్స్ హాప్కిన్స్ సెంటర్‌ఫర్ టాలెంటెడ్ యూత్(సీటీవై) నిర్వహించిన పరీక్షలో భారతీయ అమెరికన్ నటాషా పెరియనాగం రెండోసారి విజయం సాధించింది. 13 ఏళ్ల పెరియనాగం న్యూజెర్సీలో ఫ్లోరెన్స్ ఎం గౌడినీర్ మిడల్ స్కూల్ విద్యార్థి. ఆమె గతంలో 2021లో గ్రేడ్ 5 విద్యార్థిగా ఉన్నప్పుడూ కూడా ఈ పరీక్షకు హాజరయ్యారు. ఐతే ఆ ఏడాది ఆమె సీటీవై నిర్వహించిన వెర్బల్, క్వాంటిటేటివ్ విభాగాల్లో గ్రేడ్ 8 స్థాయిలో 90 శాతం ఉత్తీర్ణత సాధించి ఆ అత్యున్నత జాబితాలో స్థానం దక్కించుకున్నారు కూడా. మళ్లీ ఈ ఏడాది ఎస్ఏటీ, ఏసీటీ స్కూల్, కాలేజ్ స్థాయిలో అదే విభాగాల్లో అసాధారణ ప్రతిభ కనబర్చి మరోసారి ఈ గౌవరవ జాబితాలో స్థానం దక్కించుకున్నట్లు విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఈ సీటీవై విశిష్ట ప్రతిభ గల విద్యార్థులను గుర్తించడం కోసం వారి విద్యా నైపుణ్యాలను వెలికితీసేలా ఏటా అత్యున్నత స్థాయిలో పరీక్ష నిర్వహిస్తుంది. కాగా, పెరియనాగం తల్లిదండ్రులు చైన్నైకి చెందిన వారు. 2021-22 సీటీవై పరీక్షకి 76 దేశాల నుంచి విద్యార్థులు పాల్గొనగా.. సుమారు 15 వేల మంది ఈ జాబితాలో స్థానం దక్కించుకున్నట్లు విశ్వవిద్యాలయం పేర్కొంది. వారిలో చైన్నైకి చెందిన పెరయనాగం కూడా ఉన్నారని వెల్లడించింది. అలాగే ఈ తాజా ప్రయత్నంతో పెరియనాగం అభ్యర్థులందరి కంటే అత్యధిక గ్రేడ్ సాధించి వరుసగా రెండుసార్లు ఆ జాబితాలో చోటు సంపాదించుకున్న అమ్మాయిగా నిలిచినట్లు విశ్వవిద్యాలయం పేర్కొంది. ఈ మేరకు సీటీవై డైరెక్టర్ డాక్టర్ అమీ షెల్టాన్ మాట్లాడుతూ..ఇది కేవలం ఒక పరీక్షలో విద్యార్థులు సాధించిన విజయం మాత్రం కాదని, చిన్న వయసులో వారి అభిరుచులను గుర్తించడమే గాక ఆ దిశ తమ ప్రతిభకు మెరుగులు పెట్టుకోవడం ప్రశంసించదగ్గ విషయం. అలాగే వారి మహోన్నతమైన తెలితేటలకు సెల్యూట్. ఈ అనుభవంతో విద్యార్థులు మరిన్ని గొప్ప విజయాలను అందుకోవాలి అని డాక్టర్ అమీ ఆకాంక్షిచారు. (చదవండి: మిస్టరీగా కిమ్ ఆచూకీ.. పీపుల్స్ ఆర్మీ వార్షికోత్సవం హాజరుపై సందిగ్ధం) -
వారెవ్వా చికెన్ టిక్కా మసాలా
విల్‌స్మిత్ కొత్త సినిమా ‘బ్రైట్’ నెట్‌ఫ్లిక్స్‌లో గత వారమే విడుదలైంది. ఇప్పుడు సినీ అభిమానికి ఒక స్టాప్ పాయింట్లా మారిపోయిన నెట్‌ఫ్లిక్స్‌లో ఇంత పెద్ద సినిమా నేరుగా విడుదలవ్వడం అన్నది ఫిల్మ్ బిజినెస్ పరంగా చూస్తే అతిపెద్ద మార్పుగానే చెప్పుకోవచ్చు. భవిష్యత్‌లో సినిమాలు థియేటర్లలో కాకుండా ఇలా నేరుగా ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లపై వస్తాయనడానికి ఇదొక ముందస్తు సూచన. ఇండియాలోనూ నెట్‌ఫ్లిక్స్ వాడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతూ ఉండడంతో ఇండియా మార్కెట్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టింది ‘బ్రైట్’ టీమ్. ఈ నేపథ్యంలోనే గతవారం విల్‌స్మిత్ స్వయంగా సినిమాను ప్రమోట్ చేసేందుకు ఇండియా వచ్చాడు. నేషనల్ మీడియాకు పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ బిజీగా గడిపిన ఆయన ఇండియాతో తన గతానుభవాలు పంచుకున్నాడు. గతంలో తాను బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ఇచ్చిన పార్టీకి వచ్చానని, ఆ పార్టీలో తిన్న చికెన్ టిక్కా మసాలా వారెవ్వా అని, తనకు ఫేవరెట్ ఫుడ్ అని చెప్పుకొచ్చాడు. ఇక ‘బ్రైట్’ విషయానికి వస్తే ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ జానర్లో ఈ సినిమా తెరకెక్కింది. -
భగవద్గీత 90 శాతం చదివా : హాలీవుడ్ హీరో
హాలీవుడ్ యాక్షన్ హీరో విల్ స్మిత్ ముంబైలో సందడి చేస్తున్నారు. తను హీరోగా నటించిన బ్రైట్ సినిమా డిసెంబర్ 22న భారత్ లో రిలీజ్ అవుతున్న సందర్భంగా ఆయన ఇక్కడ పెద్ద ఎత్తున ప్రచారం కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన విల్ స్మిత్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. భారత్ తో పాటు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తో తనకున్న స్నేహం గురించి వెల్లడించారు. తనకు అక్షయ్ కుమార్ తో సమయం గడపటం చాలా ఇష్టమన్న విల్ స్మిత్, భారత్ లో తనకు నచ్చిన విషయం అక్షయ్ ఇంట్లో భోజనమే అన్నారు. భారతీయ చరిత్ర అంటే తనకు చాలా ఇష్టమని.. భగవద్గీతను 90 శాతం చదివానని తెలిపారు. త్వరలో రిషికేశ్ కు వెళ్లనున్నట్టుగా తెలిపారు విల్ స్మిత్. స్మిత్ తో పాటు మరో హాలీవుడ్ నటుడు జోయెల్ ఎడ్‌గార్టెన్ కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. -
ఫార్మా విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్
కనగల్ : పార్మా రంగంలో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నందున ఫార్మా విద్యర్థులకు ఉజ్వల భవిష్యత్ ఉందని జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ గోవింద్ సింగ్ అన్నారు. బుధవారం కనగల్ మండలం చర్లగౌరారం పరిధిలోని ఎస్‌ఆర్‌టీఐఎస్‌టీ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రథమ సంవత్సరం చదువుతున్న బీ ఫార్మసి విద్యార్థులకు ఓరియంటేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఫార్మాసిటిని స్థాపించడంతో ఎక్కువ కంపెనీలు నెలకొల్పే అవకాశం ఉన్నందున ఉద్యోగావకాశాలు అధికంగా ఉంటాయన్నారు. దేశ విదేశాల్లోనూ పార్మా రంగానికి అధిక ప్రాధాన్యం ఉందన్నారు. ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ఫార్మసీ విద్యను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. అనంతరం డ్రగ్ ఇన్స్పెక్టర్ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మూల దయాకర్‌రెడ్డి, ఫార్మా కశాశాల ప్రిన్సిపాల్ ఎం. నాగులు, ఎస్‌ఆర్‌టీఐఎస్‌టీ ప్రిన్సిపాల్ హరినాథరెడ్డి, అధ్యాపకులు షబ్బిర్, పోలిరెడ్డి, గోపాల్‌రెడ్డి, పీఆర్ఓ రాజారాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గాయాల నుండి కోలుకుంటున్న సింధు