బీటెక్ విద్యార్థినితో ప్రిన్సిపాల్ అసభ్య ప్రవర్తన
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలోని అబ్దుల్లాపూర్‌మెట్ బ్రిలియంట్ ఇంజనీరింగ్ కళాశాల ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థినుల పట్ల కళాశాల సిబ్బంది అసభ్యంగా ప్రవర్తింస్తున్నారని ఆరోపిస్తూ.. సోమవారం ఉదయం విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. బీటెక్ విద్యార్థిని పట్ల ప్రిన్పిపల్ అసభ్యంగా ప్రవర్తించాడు. స్కాలర్ షిప్‌ల విషయంలోనూ ఫ్యాకల్టీ వేధింపులకు గురి చేస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు. తరగతులను బహిష్కరించి కళాశాల ఎదుట ఆందోళన నిర్వహిస్తున్నారు.