ప్లాస్టిక్.. టిక్..టిక్...
పర్యావరణానికి చేటు చేస్తుందని.. భూమి లోకి చేరితే వందల ఏళ్ల పాటు నాశనం కాకుండా ఇబ్బంది పెడుతుందని తెలిసినా ప్రపంచ వ్యాప్తంగా ప్లాస్టిక్ వినియోగం తగ్గట్లేదు. బ్రిటన్ దినపత్రిక గార్డియన్ ఈ అంశంపై ఈ మధ్యే ఒక కథనాన్ని ప్రచురించింది. దీని ప్రకారం.. భూమ్మీద ఉన్నది 700 కోట్ల మందైతే.. వీళ్లం దరూ కొంటున్న ప్లాస్టిక్ బాటిళ్ల సంఖ్య ఎంతో తెలుసా? ప్రతి నిమిషానికి కోటి! అంటే గంటకు 60 కోట్లు రోజుకు 1,440 కోట్లు! ఏడాదికి 50,000 కోట్లు! వీటిల్లో దాదాపు సగం చెత్తగా మారిపోతున్నాయి.. చెరువులు, నదులు సము ద్రాల్లో కలిసిపోయి సమస్యలను జటిలం చేస్తున్నాయి.
నీటివనరుల్లోకి చేరిన ప్లాస్టిక్‌లో కొంత చేపలకు ఆహారమవుతోంది. ఆ చేపలను తిన్న మనుషులూ అనారోగ్యం పాలవుతు న్నారు. బెల్జియంలోని ఘెంట్ వర్సిటీ అధ్య యనం ప్రకారం.. సముద్ర జలచరాలను తినేవారు ప్రతిసారి కనీసం 11 వేల సూక్ష్మస్థాయి ప్లాస్టిక్‌ను తమ శరీరంలోకి పంపించుకుం టున్నారని స్పష్టం చేస్తోంది.