British Minister
-
భూ ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలి
గ్లాస్గో: గ్లోబల్ వార్మింగ్ విసురుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి పారిస్ ఒప్పందాన్ని అమలు చేయడమే మార్గమని కాప్– 26 అధ్యక్షుడు, బ్రిటన్ కేబినెట్ మంత్రి అలోక్ శర్మ చెప్పారు. భూ సగటు ఉష్ణోగ్రతల పెరుగుదలను 1.5 డిగ్రీల సెల్సియస్‌కు పరిమితం చేయడమే మన ముందున్న లక్ష్యమని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. భారత సంతతికి చెందిన అలోక్శర్మ వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన కాప్ –26 (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26వ సదస్సు)కి నేతృత్వం వహిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ విసురుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపైనా, అనుసరించాల్సిన వ్యూహాలపైనా స్కాట్లాండ్లోని గ్లాస్గోలో కాప్– 26 సదస్సు ఆదివారం ప్రారంభమైంది. దాదాపు 200 దేశాలకు చెందిన ప్రభుత్వ అధినేతలు, పర్యావరణ పరిరక్షకులు పాల్గొనే ఈ సదస్సు రెండు వారాల పాటు కొనసాగనుంది. ఈ సదస్సులో ప్రారంభోపన్యాసం చేసిన అలోక్ శర్మ భూతాపోన్నతిని తగ్గించడానికి ఇదే ఆఖరి అవకాశమని అన్నారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకొని ఉష్ణోగ్రతల్ని తగ్గించే మార్గాన్ని చూడాలన్నారు. ‘‘ఆరేళ్ల క్రితం పారిస్ సమావేశలంలో భూమి సగటు ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉండేలా చూడాలని అనుకున్నాం. 1.5 డిగ్రీలకి పరిమితం చేయడానికి అందరూ కలసికట్టుగా కృషి చేయాలి’’ అని అలోక్ అన్నారు. నవంబర్ 12 వరకు జరిగే ఈ సదస్సులో సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. -
ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ : అద్భుతమైన వార్త!
లండన్: కరోనా మహమ్మారి ప్రకంపలు కొనసాగుతున్న తరుణంలో వ్యాక్సిన్ ప్రభావవంత ఫలితాలు ప్రపంచవ్యాప్తంగా భారీ ఊరటనిస్తున్నాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా టీకా సామార్థ్యానికి సంబంధించి ఆస్ట్రాజెనెకా సోమవారం కీలక ప్రకటన చేసింది. ఈ టీకా సగటు సామర్థ్యం 70 శాతమని ప్రకటించింది. ప్రయోగ ఫలితం 90 శాతం ప్రభావవంతంగా ఉందని, 70 శాతం మందిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉందని తెలిపింది. దీంతో ఇది "అద్భుతమైన వార్త" అంటూ బ్రిటిష్ ఆరోగ్య కార్యదర్శి మాట్ హాంకాక్ వ్యాఖ్యానించారు. ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంతో కలిసి అభివృద్ధి చేసిన కోవిడ్-19 వ్యాక్సిన్ 90 శాతం వరకు ప్రభావవంతంగా ఉంటుందన్న సంస్థ గణాంకాలపై ఆయన ఉత్సాహంగా స్పందించారు. ఈ ఫలితాలు ధృవీకరణ అయితే ఇది చాలా శుభవార్త అవుతుంది. ఎందుకంటే ప్రజలు వ్యాధి బారిన పడకుండా నివారించడమే కాకుండా దాని విస్తృతిని కూడా నిలువరించాల్సి ఉందని ఆయన అన్నారు. 100 మిలియన్ మోతాదులను ఆర్డర్ చేశామనీ, అన్నీ సవ్యంగా జరిగితే, కొత్త సంవత్సరంలో వ్యాక్సిన్‌ను ఎక్కువమంది అందించనున్నామని పేర్కొన్నారు. వ్యాక్సిన్ సురక్షితంగా ఉందని తేలితే దాన్ని ఎలా ఉత్తమంగా నిర్వహించాలో తెలిపేందుకు కూడా ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ అధ్యయనం చేయాలని సూచించారు. ఈ ఫలితాలను రెగ్యులేటరీ సంస్థలు అధ్యయనం చేయాల్సి ఉంటుందని హాంకాక్ చెప్పారు. అంతేకాదు వ్యాక్సిన్ వ్యాధి వ్యాప్తిని తగ్గించగలదనేందుకు నివేదికలో ఆధారాలు ఉన్నాయని ఆయన చెప్పారు. మరోవైపు క్లీనికల్ ట్రయల్స్ సమాచారంపై జరిపిన తొలి విశ్లేషణలో వలంటీర్లలో సగటున 70 శాతం మందిని రక్షించినట్టు వెల్లడైందని ఆస్ట్రాజెనెకా తాజాగా తెలిపింది. క్లీనికల్ ట్రయల్స్‌లో భాగంగా ఆక్స్ఫర్డ్ టీకా విషయంలో అధికారులు రెండు రకాల డోసుల వలంటీర్లకు ఇచ్చారు. మొదటి విధానంలో వలంటీర్లకు తొలుత సగం డోసు ఇచ్చి, ఆ తరువాత పూర్తి డోసు ఇచ్చారు. టీకా 90 శాతం సామర్థ్యంతో పనిచేసినట్టు వెల్లడైంది. కరోనా టీకా డోసులకు సంబంధించి రెండో విధానంలో ఈ టీకా 62 శాతం సామర్థ్యం చూపినట్టు తేలింది. సగం డోసు వినియోగించగా టీకా సామర్థ్యం 90 శాతంగా వెల్లడవడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని ఆస్ట్రాజెనెకా ప్రతినిధి తెలిపారు. ఈ విధానం అత్యంత ప్రభావశీలమైనదని, టీకా విషయంలో ఇదే అవలంబించాలని వివిధ దేశాల ఔషధ నియంత్రణ సంస్థలకు సూచిస్తామని పేర్కొన్నారు. సుమారు 24 వేల మంది వాలంటీర్ల నుంచి ఈ డేటాను సేకరించారు. బ్రిటన్, బ్రెజిల్, దక్షిణ ఆఫ్రికాల్లో భారీ స్థాయిలో ట్రయల్స్ నిర్వహించారు. -
సెక్రటరీతో సెక్స్ టాయ్స్ ; మంత్రి వికృతపర్వం
లండన్ : ఘనతవహించిన మంత్రివర్యులొకరు.. మహిళా సెక్రటరీ చేత సెక్స్ టాయ్స్ కొనిపించడమేకాక లైంగికంగా వేధించిన వ్యవహారం ప్రస్తుతం బ్రిటన్ను కుదిపేస్తోంది. థెరిసా మే కేబినెట్లో అత్యంత కీలకమైన ‘బ్రెగ్జిట్’ మంత్రిగా కొనసాగుతున్న మార్క్ గార్నియర్‌పై ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించినట్లు బ్రిటిష్ కేబినెట్ కార్యాలయం ప్రకటించింది. ప్రపంచాన్ని కుదిపేస్తోన్న ‘మీ టూ(metoo) క్యాంపెయిన్‌లో భాగంగా బాధితురాలు కరోలిన్ ఎడ్మండ్సన్ తన చేదు అనుభవాన్ని వెల్లడించారు. భార్య కోసం వైబ్రేటర్ తెమ్మన్నాడు : ‘‘మార్క్ గార్నియర్ తొలిసారి బ్రిటన్ పార్లమెంట్ మెంబర్‌గా ఎన్నికైనప్పుడు(2010లో) ఆయనకు సెక్రటరీగా పనిచేశాను. ఓసారి నన్నొక షాప్ దగ్గరికి తీసుకెళ్లిన ఆయన.. చేతిలో బలవంతంగా డబ్బులు పెట్టి ‘లోపలికెళ్లి రెండు వైబ్రేటర్లు కొనుక్కురా, ఒకటి మా ఆవిడకి, రెండోది నా నియోజకవర్గంలోని ఆఫీసులో ఉండే మహిళకి’’ అంటూ ఆదేశించారు. చేసేదేమీలేక లోపలికెళ్లి ఆ సెక్స్‌టాయ్స్‌ను కొనుకొచ్చి ఆయనకిచ్చేశాను. మరో సందర్భంలో.. ఓ మద్యం పార్టీలో నలుగురిముందూ నన్ను లైంగికదుర్భాషలాడారు. ఆ తర్వాత కొన్నాళ్లకు అతని వద్ద ఉద్యోగం మానేశాను’’ అని కరోలిన్ వెల్లడించారు. అవును, తెమ్మన్నాను కానీ.. : తన మాజీ సెక్రటరీ కరోలిన్ చేసిన ఆరోపణలపై మంత్రి గార్నియర్ స్పందించారు. ఆమె చెప్పిన విషయం అబద్ధంకాదంటూనే తాను సచ్ఛీలుడినని చెప్పుకునే ప్రయత్నం చేశారు. ‘‘అవును. షాప్ నుంచి సెక్స్‌టాయ్స్ తెమ్మని ఆమెను(మహిళా సెక్రటరీని) పురమాయించిన మాట నిజమే. అయితే ఆమె పట్ల నాకు ఎలాంటి దురుద్దేశం లేదు. నిజానికి నేనప్పుడు ఆమెతో ప్రమాదరహితంగానే ప్రవర్తించా’’ అని వివరణ ఇచ్చారు. ప్రధాని స్పందన.. విచారణ వేగవంతం : ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కరోలిన్ వెల్లడించిన విషయాలు బ్రిటన్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి తన కేబినెట్ మంత్రే కావడంతో ప్రధాని థెరిసా మే తక్షణం స్పందించారు. దీనిపై దర్యాప్తు చేయాలని బ్రిటన్ కేబినెట్ కార్యాలయాన్ని ఆదేశించారు. నాటి ఘటనలో మార్క్ గార్నియర్.. పార్లమెంట్ సభ్యుడిగా పాటించాల్సిన నిబంధనలను ఉల్లంఘించారని నిర్ధారణ అయితే గనుక పదవిని కోల్పోయే అవకాశం ఉంది. #metoo : ప్రముఖ హాలీవుడ్ నటి అలిసా మిలానో ‘మీ టూ’ అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. మహిళలపై జరుగుతున్న వేధింపులు, అత్యాచారాలకు వ్యతిరేకంగా గళమెత్తాలని ఆమె ఇచ్చిన పిలుపును అందుకుని సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు లక్షలాది మంది స్పందిస్తున్నారు. దాదాపు అన్ని దేశాల మహిళలు #metoo అంటూ చేదు అనుభవాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలో అమెరికా మాజీ అధ్యక్షడు జార్జ్‌బుష్(సీనియర్), ఇప్పటి బ్రిటన్ మంత్రి మార్క్ గార్నియర్, పలు దేశాలకు చెందిన రాజకీయ, సినీ ప్రముఖుల వికృతపర్వాలు వెలుగులోకివచ్చాయి. దాదాపు అన్ని ఘటనల్లోనూ పురుష పుంగవులు.. తమకెలాంటి దురుద్దేశాలు లేవని చెప్పుకుంటుండటం గమనార్హం. -
మూడొందలు కాదు.. ఐదొందలు..
మిఖాయిల్ గోర్బచెవ్గారు అధ్యక్షుడిగా ఉన్నకాలంలో బ్రిటిష్ మంత్రి ఒకరు సోవియట్ పర్యటనకు విచ్చేశారు. సోవియట్ లాంఛనాల మేరకు బ్రిటిష్ మంత్రిగారికి అతిథి మర్యాదలన్నీ ఘనంగా చేశారు. అధ్యక్షుడు గోర్బచెవ్ నివాసంలో విందుభోజనం కూడా ఏర్పాటు చేశారు. విందు సందర్భంగా పిచ్చాపాటీ మాటల సందర్భంగా రష్యన్ వంటకాల ప్రాశస్త్యం ప్రస్తావనకు వచ్చింది. రష్యన్లు బంగాళ దుంపలతో కనీసం మూడొందల రకాల వంటకాలు చేయగలరని బ్రిటిష్ మంత్రిగారితో గోర్బచెవ్ గారి సతీమణి రైసా గొర్బచెవ్ చెప్పారు. ‘టంగుటూరు మిరియాలు తాటికాయలంత’ చందంగా ఉన్న ఈ మాటలను బ్రిటిష్ మంత్రిగారు నమ్మలేదు. ఆయన బ్రిటన్‌కు తిరిగి వెళ్లిన కొద్దిరోజులకు రైసా గోర్బచెవ్ నుంచి కానుకగా ఆయనకు ఒక వంటల పుస్తకం అందింది. దాంతోనే పంపిన లేఖలో ఇలా ఉంది. ‘మీకు నేను పొరపాటుగా చెప్పాను.. బంగాళ దుంపలతో మూడొందలు కాదు, ఐదొందల రకాల వంటకాలు చేస్తారు.