brocher
-
దాసరి గుర్తుండిపోతారు
రాక్‌స్టార్ ఈవెంట్స్, కింగ్ మీడియా ఈవెంట్స్ సంయుక్తంగా దర్శకరత్న దాసరి నారాయణరావు పేరిట ప్రతి యేటా అవార్డులు ప్రదానం చేయనున్నారు. ఎన్ఆర్ఐలు జై శంకర్, కళ్యాణ్, సాయిప్రసాద్ యండమూరి, నాగ రాజు, నవీన్‌తో పాటు వారి స్నేహితులు కలిసి అక్టోబర్ 26న శిల్పకళా వేదికలో ‘దాసరి అవార్డ్స్’ కార్యక్రమం నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన బ్రోచర్‌ను దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, దర్శకుడు రేలంగి నరసింహారావు విడుదల చేశారు. రేలంగి నరసింహారావు మాట్లాడుతూ– ‘‘మా గురువు దాసరి నారాయణరావుగారు మరణించినా కూడా ఇప్పటికీ ఆయనకి అభిమానులు ఉండటం నిజంగా గర్వించదగ్గ విషయం. ఆయన పేరిట అవార్డ్స్‌ను ప్రదానం చేయడం ఇంకా ఆనందదాయకం. అక్టోబర్ 25న దాసరి పద్మగారి జయంతి కాబట్టి ఈ మహోన్నత కార్యక్రమాన్ని అక్టోబర్ 26న కాకుండా 25న జరిపితే బాగుంటుందనేది నా ఉద్దేశం. ప్రతి నెలా కొంతమంది పేద ఆర్టిస్టులకు చెక్కులు ఇవ్వడం, ప్రతియేటా మే 4న తన పుట్టినరోజును పురస్కరించుకొని పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడమంటే దాసరిగారికి చాలా ఇష్టం. దీనిని∙ఆయన ఓ బాధ్యతగా భావించేవారు. ఆ కార్యక్రమాలను కూడా కళ్యాణ్, నాగరాజు, జై శంకర్ తదితరులు ప్రతి యేటా నిర్వర్తిస్తామని మాటిచ్చారు’’ అన్నారు. ఈ సమావేశంలో ఆర్గనైజర్లు (ఎన్ఆర్ఐ) జై శంకర్, కళ్యాణ్, సాయి ప్రసాద్ యండమూరి, నాగరాజు, నవీన్ పాల్గొన్నారు. -
7న డా.రామినేని ఫౌండేషన్ పురస్కారాలు ప్రదానం
మొగల్రాజపురం (విజయవాడ తూర్పు): డాక్టర్ రామినేని ఫౌండేషన్ పురస్కారాలు ఈ నెల 7న మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌లో అందజేస్తామని ఫౌండేషన్ చైర్మన్ రామినేని ధర్మ ప్రచారక్, కన్వీనర్ పాతూరి నాగభూషణం తెలిపారు. విజయవాడలోని ఓ హోటల్లో గురు వారం ఫౌండేషన్ బ్రోచర్‌ను ఆవిష్క రించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్‌కు విశిష్ట పురస్కారం, మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు, చిత్ర దర్శకుడు నాగ అశ్విన్‌రెడ్డి, మెజీషియన్ చొక్కాపు వెంకట రమణకు విశేష పురస్కారాలు అందజేస్తామని తెలిపారు. ముఖ్య అతిథులుగా ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్, బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్‌తో పాటు రాష్ట్ర మంత్రులు హాజరవుతారని చెప్పారు. -
ప్రభుత్వ కార్యక్రమమా...పార్టీ కరపత్రమా?
* దుర్గి మిర్చి యార్డు ఆహ్వాన పత్రికకు పార్టీ రంగు * ప్రొటోకాల్‌నూ పక్కన పెట్టిన టీడీపీ నాయకులు * వెల్లువెత్తుతున్న విమర్శలు మాచర్ల : ప్రొటోకాల్‌ను తుంగలో తొక్కడం, ప్రభుత్వ కార్యక్రమాలకు పార్టీ రంగు పులమడం లాంటి చర్యలకు పాల్పడుతున్న అధికారపార్టీ నాయకుల చర్యలతో జనం ముక్కున వేలేసుకుంటున్నారు. ప్రభుత్వ సంస్థ అయిన మాచర్ల మార్కెట్ యార్డు ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన దుర్గి మినీ మిర్చియార్డు శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ, మాచర్ల పేరుతో కరపత్రాలను ప్రచురించి ఆహ్వాన పత్రికలు పంచుతున్నారు. వీటిని తమ పార్టీ రంగు అయిన పసుపు రంగులో ముద్రించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి పి. పుల్లారావు ఫొటోలను పెట్టి, 22వ తేదీ గురువారం మధ్యాహ్నం 2గంటలకు జరిగే భూమిపూజకు హాజరు కావాలని యార్డు చైర్మన్ మల్లికార్జున రావు పేరుతో కరపత్రాలు ప్రచురించారు. ఈ కరపత్రంలో ఎక్కడా కూడా స్థానిక ఎమ్మెల్యే పేరును ప్రస్తావించలేదు. గతంలో వేసిన శిలాఫలకంలో కూడా ఎమ్మెల్యే పేరుకు ప్రాధాన్యత ఇవ్వని విషయం తెలిసిందే. యార్డు డబ్బులు ఖర్చు పెట్టి ప్రచురించిన కరపత్రాలకు పార్టీ రంగు పులమడం, పార్టీ కార్యక్రమంలాగా ప్రచారం నిర్వహించడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుల నుంచి వసూలయ్యే పన్నుల ద్వారా ఆదాయం పొందే యార్డు అధికారులు సైతం అదేదో తెలుగుదేశం పార్టీ ఫండ్‌లాగా భావించి ప్రొటోకాల్ ఉల్లంఘించి కరపత్రాలు ప్రచురించడంపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు, ప్రొటోకాల్ ఉల్లంఘన, ప్రభుత్వ నగదు దుర్వినియోగం చేస్తున్న అధికారుల తీరును వివిధ శాఖల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లనున్నట్టు ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. -
4న బాలోత్సవ్–2016 బ్రోచర్ ఆవిష్కరణ
కొత్తగూడెం అర్బన్: ఈ నెల 4వ తేదిన బాలోత్సవ్–2016 బ్రోచర్ ఆవిష్కరించనున్నట్లు బాలోత్సవ్ కన్వీనర్ వాసిరెడ్డి రమేష్‌బాబు తెలిపారు. శుక్రవారం స్థానిక కొత్తగూడెం క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 25 సంవత్సరాల పండుగ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమానికి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్, పద్మశ్రీ కొలకలూరి ఎనాక్ హాజరవుతారని చెప్పారురు. 10, 11వ తేదీల్లో 200 మంది విద్యార్థులతో కథలు, కవితలపై వర్క్‌షాపు ఏర్పాటు చేస్తున్నామని, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రల కవులు హాజరవుతారన్నారు. ఈ సంవత్సరం బాలోత్సవ్ నాలుగు రోజుల పాటు జరుగనుందని తెలిపారు. మల్సూర్, క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.