brothel houses
-
తాలిబన్ల పైశాచికత్వం: ఇకపై పశు వ్యభిచారం
ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిఘటన లేకుండానే అఫ్గనిస్థాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు.. అధికారం చేపట్టకున్నా దమనకాండను ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో మహిళల హక్కులకు భంగం కలిగించమంటూ ప్రకటిస్తూనే.. అణచివేత ధోరణిని మొదలుపెట్టారు. తాజాగా కాబూల్‌లోని డజన్లకొద్దీ వేశ్య గృహాలను దగ్గరుండి మరీ ఖాళీ చేయించిన తాలిబన్లు.. ఆ స్థానంలో జంతువుల్ని ఉంచారు. దీంతో జంతు పరిరక్షణ సంఘాలు మండిపడుతున్నాయి. ఒంటెలు, గొర్రెలు, కుక్కలు.. ప్రస్తుతం కాబూల్‌లోని పాతిక వేశ్యగృహాల్లో ఇవే కనిపిస్తున్నాయి. 1990 సమయంలో తమ పాలనలో వేశ్య వృత్తిని తాలిబన్లు అణిచివేశారు. బదులుగా లైంగిక వాంఛల్ని తీర్చుకోవడానికి జంతువుల్ని వేశ్య గృహాల్లో ఉంచేవాళ్లు. వాళ్ల దృష్టిలో వేశ్య వృత్తిలో మహిళలు కొనసాగడానికి వీల్లేదు. జంతువులతో శృంగారంలో పాల్గొనేందుకు మాత్రం తాలిబన్లు అనుమతి ఇస్తారు. చదవండి: అఫ్గన్ సంక్షోభం-హెల్ప్‌లైన్ నంబర్లు ప్రకటించిన భారత ప్రభుత్వం అఫ్గన్‌లో అమెరికా సైన్యాల మోహరింపు, ప్రభుత్వ పాలన సమయంలో మహిళలు స్వేచ్ఛగా జీవించారు. చట్టవిరుద్ధం-కఠిన శిక్షలు అమలులో ఉన్నప్పటికీ.. వేలమంది అఫ్గన్లు వేశ్య వృత్తిలో కొనసాగారు. కాబూల్, మజర్ ఏ షరీఫ్, హెరత్, జలాలాబాద్, జోవ్జాన్ ప్రావిన్స్‌లో కార్యకలాపాలు ఇంతకాలం యదేఛ్చగా సాగాయి. కొన్ని చోట్ల పిల్లలను సెక్స్ బానిసలుగా మార్చేశారు కూడా. అయితే తాలిబన్లు మాత్రం వేశ్య వృత్తిని.. ఇస్లాం వ్యతిరేక వ్యాపారాల్లో ఒకటిగా భావిస్తుంటారు. బదులుగా జంతువులతో పాల్గొని ఒత్తిడి తీర్చుకోవాలంటూ తమ గ్రూపులకు సలహా ఇస్తుంటారు కూడా. చదవండి: పదేళ్లు మగాడి వేషంలో.. ఇదిలా ఉంటే ఈ పరిణామాలపై మానవ హక్కుల సంఘం రీజినల్ డైరెక్టర్ మార్గరేట్ స్మిత్ తీవ్రంగా స్పందించారు. ‘‘కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు ఉంది తాలిబన్ల తీరు. జంతువుల కంటే హీనంగా ఆడవాళ్లను అణిచివేస్తున్నారంటూ తాలిబన్లపై ఆమె మండిపడ్డారు. ‘‘వాళ్ల(తాలిబన్ల) దృష్టిలో ఆడవాళ్లంటే పిల్లలు కనే యంత్రాలు. మూగజీవాల్ని లైంగిక వాంఛ తీర్చుకునేందుకు ఉపయోగించుకుంటారు. చూస్తుంటే.. ఆడవాళ్ల కంటే మూగ జీవాలకే వాళ్లు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఉంది’’ అంటూ సెటైర్లు పేల్చారు ఆమె. చదవండి: షరియా.. ఉల్లంఘిస్తే ఉరే! -
యాదాద్రి ఉదంతంపై బీజేపీ నేత కిషన్‌రెడ్డి ఫైర్
-
మనుషులు కాదు..రాక్షసులు
-
వేశ్యాగృహాలను మూసివేయండి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలోని జీబీ రోడ్డులో ఉన్న 125 వేశ్యాగృహాలను మూసివేయాలని ఢిల్లీ మహిళా కమిషన్ వాటి నిర్వాహకులకు సమన్లు ఇచ్చింది. వివిధ రకాల ఏజెన్సీలు ఒకదాని కొకటి సంబంధం లేకుండా పొంతనలేని సమాధానాలివ్వడంతో అసలైన నిర్వాహకు లను గుర్తించడం కమిషన్‌కు చాలా కష్టతరమైంది. దీంతో వీరిని సెప్టెంబర్ 21 నుంచి 24 మధ్య తమ వ్యక్తిగత, నివాస ధ్రువీకరణ పత్రాలతో కమిషన్ ముందు హాజరు కావాల్సిందిగా ఆదేశించినట్లు ఢిల్లీ మహిళా కమిషన్ అధికారులు తెలిపారు. కొందరు నిర్వాహకులు సమన్లు తీసుకోవడానికి నిరాక రించడంతో వేశ్యాగృహాల గోడలకు వాటిని అంటించామని వారు పేర్కొన్నారు. ఇంతకుముందే కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్, ఢిల్లీ పోలీస్ డిపార్ట్ మెంట్లోని సీనియర్ అధికారులు, ఉత్తరఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, జిల్లా మేజిస్ట్రేట్, ఢిల్లీ జల్ బోర్డు, అగ్ని మాపక విభాగం, కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థల్లోని వారితో ఓ కమిటీ దీని కోసమే ఏర్పాటయింది. ఢిల్లీ మహిళా కమిషన్ లీగల్ కౌన్సిలర్ ప్రిన్సీ గోయెల్, మొబైల్ హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ కిరణ్ నేగిల ఆధ్వర్యంలోని బృందం ఈ సమన్లు అందజేసింది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి మైనర్ బాలికలు, యువతులు, మహిళలను జీబీ రోడ్డులోని వేశ్యాగృహాలకు అక్రమంగా తరలించి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారని స్వాతి మలివాల్ ఆరోపించారు. ఇక్కడ కొన్ని సందర్భాల్లో అత్యాచారాలు కూడా జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నా రు. ఇప్పటివరకు ఎన్ని దాడులు జరిగినా ఇక్కడి వేశ్యాగృహాల నిజమైన యజమానులు బయట పడలేదని, కొందరు నిర్వాహకులను మాత్రం పోలీసులు అరెస్టు చేశారని చెప్పారు. పార్లమెంటుకు కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే వ్యభిచారం జరుగుతుండటం సిగ్గు చేటని, దీనిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు. -
మోసగాడికి పదేళ్ల జైలు శిక్ష
న్యూఢిల్లీ: బాలికను అపహరించి, వ్యభిచార గృహానికి విక్రయిస్తూ పట్టుబడ్డ ఇశ్రాఫుల్ అనే వ్యక్తికి ఢిల్లీ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. వ్యభిచార గృహాన్ని నడుపుతున్న మరో మహిళకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ‘పశ్చిమ బెంగాల్‌కు చెందిన బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఇశ్రాఫుల్, ఢిల్లీకి తీసుకువచ్చి వ్యభిచార గృహంలో విక్రయించాడు. దీనికి సెక్షన్ 366(పెళ్లి చేసుకుంటానని మోసం చేసి మహిళను అపహరించడం) ప్రకారం బాలిక సాక్షమే ఆధారం. దోషికి పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.3వేలు జరిమానా విధిస్తున్నాం’ అని అదనపు సెషన్స్ కోర్టు జడ్జి కావేరి బవేజా తీర్పునిచ్చారు. వ్యభిచార గృహం నుంచి విడిపించిన పది మందిలో ఒకామె కోర్టు విచారణ సమయంలో ఇశ్రాఫుల్ గుర్తుపట్టింది. దీన్ని కోర్టు తీర్పు ఇవ్వటంలో ముఖ్య సాక్షంగా పరిగణంచింది. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి గుర్తు తెలియని మహిళ పూజ అనే వ్యభిచార గృహాన్ని నడిపే వ్యకి ్తకి విక్ర యించిందని మరో అమ్మాయి కోర్టుకు విన్నవించింది. వ్యభిచారానికి నిరాక రించడంతో కొట్టి, బలవంతంగా చేయించిందని బాధితురాలు చెప్పింది. ‘గత 2012 జూన్ 25న జీబీ రోడ్‌లోని రెడ్‌లైట్ ఏరియాలో పోలీసుల రైడ్ చేశారు. పది మంది బాధితులను విడిపించి, వ్యభిచార గృహం నడుపుతున్న పూజ, పద్మ, చంద, రజియా అనే నలుగురు మహిళలను అరెస్టు చేశారు’ అని ప్రాసిక్యూషన్ కోర్టుకు విన్నవించింది. పూజ అనే మహిళకు మూడేళ్ల జై లు శిక్ష విధించిన కోర్టు, చంద, రజియాలపై నేరం రుజువు చేసేందుకు సాక్షాలు లేవని పేర్కొంది. వ్యభిచార గృహంలో స్వీపర్‌గానే చంద తన కుమారుడితో కలసి ఉంటోందని, వారిద్దరికీ హెచ్ఐవీ సోకిందని కోర్టు తెలిపింది. సీఆర్పీసీ ప్రకారం బాధితులకు డీఎల్ఎస్ఏ నష్ట పరిహారం చెల్లిస్తుందని చెప్పింది. ఈ కేసులో ఆరుగురు బాధితులతో సహా మొత్తం 12 మంది సాక్షులను, ముగ్గురు డాక్టర్లు, ముగ్గురు పోలీసులను విచారించింది. అయితే నిందితులు మాత్రం తామే తప్పు చేయలేదని వాదించారు. -
వ్యభిచార గృహాలపై ఎస్ఓటీ దాడి
సాక్షి, సిటీబ్యూరో: నగర శివార్లలో గుట్టు చప్పుడు కాకుండా నడుస్తున్న వ్యభిచార గృహాలపై సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు దాడులు చేశారు. హయత్‌నగర్, సరూర్‌నగర్, మల్కాజిగిరి పోలీసు స్టేషన్ పరిధిలలో ఈ దాడులు చేశారు. మొత్తం 12 మందిని అరెస్టు చేశారు. వీరిలో ఎనిమిది మంది మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. కాకినాడ, విజయవాడ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి ఇక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నారని పోలీసుల విచారణలో తేలింది. హయత్‌నగర్‌లో ఇద్దరు మహిళలు, విటుడు, సరూర్‌నగర్‌లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు, మల్కాజిగిరిలో నలుగురు మహిళలు పట్టుబడ్డారు. నిందితులు వ్యభిచారం కోసం వినియోగిస్తున్న మూడు ఇళ్లనూ సీజ్ చేస్తామని నోటీసులు జారీ చేశారు. ఎస్ఓటీ అదనపు డీసీపీ రాంచంద్రారెడ్డి ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ దాడుల్లో ఎస్ఓటీ ఇన్స్పెక్టర్లు పుష్పన్‌కుమార్, ఉమేందర్, ఎస్ఐలు ఆంజనేయులు, రాములు పాల్గొన్నారు. -
40 మంది ఆంధ్రప్రదేశ్ యువతులను రక్షించిన సిఐడి
పూణే: సిఐడి పోలీసులు మహారాష్ట్రలోని పూణేలో వ్యభిచారగృహాలపై దాడి చేసి పలువురు యువతులను రక్షించారు. వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 40 మంది యువతులు ఉన్నారు. వారికి విముక్తి కల్పించారు. సీఐడీ ఎస్పి రమణ్ కుమార్ నేతృత్వంలో ఈ దాడులు జరిగాయి. అమ్మాయిలను తరలిస్తున్న 8 మంది నిర్వాహకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యభిచార గృహాలలో మగ్గుతున్న 40 మంది యువతులను హైదరాబాద్ పంపినట్లు తెలిసింది. -
న్యూ ఇయర్.. వ్యభిచార గృహాలపై దాడి, 10 మంది అరెస్ట్
విశాఖపట్నంలో వ్యభిచార ముఠా గుట్టు రట్టయ్యింది. నూతన సంవత్సర వేడుకల్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు సోమవారం సాయంత్రం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. విశాఖ బీచ్ రోడ్డులో పోలీసులు వ్యభిచార గృహంపై దాడి చేసి నలుగురు యువతులతో పాటు ఇద్దరు విటులను అరెస్ట్ చేశారు. ఇక నగరంలో మందు పార్టీలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. హైదరాబాద్ నగరంలో కొత్త ఏడాదిని పురస్కరించుకుని పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇక తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ రాయుడుపాలెంలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. ముగ్గురు మహిళలు, విటుడ్ని అరెస్టు చేశారు.