న్యూ ఇయర్.. వ్యభిచార గృహాలపై దాడి, 10 మంది అరెస్ట్ | Police raid on brothel houses, 10 arrested | Sakshi
Sakshi News home page

న్యూ ఇయర్.. వ్యభిచార గృహాలపై దాడి, 10 మంది అరెస్ట్

Published Mon, Dec 30 2013 10:38 PM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

Police raid on brothel houses, 10 arrested

విశాఖపట్నంలో వ్యభిచార ముఠా గుట్టు రట్టయ్యింది. నూతన సంవత్సర వేడుకల్ని దృష్టిలో ఉంచుకుని పోలీసులు సోమవారం సాయంత్రం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. విశాఖ బీచ్ రోడ్డులో పోలీసులు వ్యభిచార గృహంపై దాడి చేసి నలుగురు యువతులతో పాటు ఇద్దరు విటులను అరెస్ట్ చేశారు. ఇక నగరంలో మందు పార్టీలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.

హైదరాబాద్ నగరంలో కొత్త ఏడాదిని పురస్కరించుకుని పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఇక తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ రాయుడుపాలెంలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. ముగ్గురు మహిళలు, విటుడ్ని అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement