మోసగాడికి పదేళ్ల జైలు శిక్ష | Delhi: Man gets 10 years in jail for selling a girl to brothel | Sakshi
Sakshi News home page

మోసగాడికి పదేళ్ల జైలు శిక్ష

Published Thu, Feb 19 2015 11:21 PM | Last Updated on Sat, Sep 2 2017 9:35 PM

Delhi: Man gets 10 years in jail for selling a girl to brothel

న్యూఢిల్లీ: బాలికను అపహరించి, వ్యభిచార గృహానికి విక్రయిస్తూ పట్టుబడ్డ ఇశ్రాఫుల్ అనే వ్యక్తికి ఢిల్లీ కోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది. వ్యభిచార గృహాన్ని నడుపుతున్న మరో మహిళకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ‘పశ్చిమ బెంగాల్‌కు చెందిన బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఇశ్రాఫుల్, ఢిల్లీకి తీసుకువచ్చి వ్యభిచార గృహంలో విక్రయించాడు. దీనికి సెక్షన్ 366(పెళ్లి చేసుకుంటానని మోసం చేసి మహిళను అపహరించడం) ప్రకారం బాలిక సాక్షమే ఆధారం. దోషికి పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.3వేలు జరిమానా విధిస్తున్నాం’ అని అదనపు సెషన్స్ కోర్టు జడ్జి కావేరి బవేజా తీర్పునిచ్చారు.
 
 వ్యభిచార గృహం నుంచి విడిపించిన పది మందిలో ఒకామె కోర్టు విచారణ సమయంలో ఇశ్రాఫుల్ గుర్తుపట్టింది. దీన్ని కోర్టు తీర్పు ఇవ్వటంలో ముఖ్య సాక్షంగా పరిగణంచింది. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి గుర్తు తెలియని మహిళ పూజ అనే వ్యభిచార గృహాన్ని నడిపే వ్యకి ్తకి విక్ర యించిందని మరో అమ్మాయి కోర్టుకు విన్నవించింది. వ్యభిచారానికి నిరాక రించడంతో కొట్టి, బలవంతంగా చేయించిందని బాధితురాలు చెప్పింది. ‘గత 2012 జూన్ 25న జీబీ రోడ్‌లోని రెడ్‌లైట్ ఏరియాలో పోలీసుల రైడ్ చేశారు.
 
 పది మంది బాధితులను విడిపించి, వ్యభిచార గృహం నడుపుతున్న పూజ, పద్మ, చంద, రజియా అనే నలుగురు మహిళలను అరెస్టు చేశారు’ అని ప్రాసిక్యూషన్ కోర్టుకు విన్నవించింది. పూజ అనే మహిళకు మూడేళ్ల జై లు శిక్ష విధించిన కోర్టు, చంద, రజియాలపై నేరం రుజువు చేసేందుకు సాక్షాలు లేవని పేర్కొంది. వ్యభిచార గృహంలో స్వీపర్‌గానే చంద తన కుమారుడితో కలసి ఉంటోందని, వారిద్దరికీ హెచ్‌ఐవీ సోకిందని కోర్టు తెలిపింది. సీఆర్‌పీసీ ప్రకారం బాధితులకు డీఎల్‌ఎస్‌ఏ నష్ట పరిహారం చెల్లిస్తుందని చెప్పింది. ఈ కేసులో ఆరుగురు బాధితులతో సహా మొత్తం 12 మంది సాక్షులను, ముగ్గురు డాక్టర్లు, ముగ్గురు పోలీసులను విచారించింది. అయితే నిందితులు మాత్రం తామే తప్పు చేయలేదని వాదించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement