హైదరాబాద్‌లో బీఆర్పీ పైప్స్ మరో యూనిట్
⇒ ఏడాదిలో కొత్తగా 20 ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు
⇒ బ్రాండ్ అంబాసిడర్‌గా సుమ కనకాల
ßæదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పైప్స్, ఫిట్టింగ్స్ తయారీలో ఉన్న బీఆర్పీ పైప్స్ హైదరాబాద్‌లో మరో యూనిట్‌ను ఏర్పాటు చేసింది. దీంతో ప్లాంటు వార్షిక సామర్థ్యం 12,000 టన్నులకు చేరుకుంది. ఈ ప్లాంటు కోసం కంపెనీ ఇప్పటి వరకు రూ.20 కోట్లు వెచ్చించింది. 18,000 టన్నుల వార్షిక సామర్థ్యం గల అహ్మదాబాద్ ఫ్యాక్టరీకి రూ.35 కోట్లు ఖర్చు చేశారు. హైదరాబాద్ యూనిట్ రాకతో కొత్తగా 100 మందికి ఉపాధి లభించిందని బీఆర్పీ పైప్స్ ఎండీ ప్రకాశ్ పటావరి తెలిపారు. కంపెనీ నూతన బ్రాండ్ అంబాసిడర్‌గా టీవీ యాంకర్ సుమ కనకాలను ప్రకటించిన సందర్భంగా మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్‌లో బీఆర్పీ నెలకొల్పిన సీపీవీసీ యూనిట్ తెలుగు రాష్ట్రాల్లో రెండవదన్నారు. అన్ని ఉత్పత్తులకు లైఫ్‌టైమ్ వారంటీ ఉందన్నారు. ప్రస్తుతం కంపెనీకి హైదరాబాద్, గువహటి, వైజాగ్‌లో ఎక్స్‌క్లూజివ్ స్టోర్లున్నాయి. పైపులు, ట్యాప్స్, బాల్ వాల్వŠస్, ఇతర ఫిట్టింగ్స్‌ను కంపెనీ తయారు చేస్తోంది. బాల్ వాల్వస్ అమ్మకాల్లో దేశంలో టాప్–1లో నిలిచామని కంపెనీ డైరెక్టర్ వికాస్ పటావరి తెలిపారు. ఏటా 10 లక్షలకుపైగా బాల్ వాల్వ్స్ విక్రయిస్తున్నట్టు చెప్పారు. బీఆర్పీషాపే.కామ్ పేరుతో దేశంలో ఆన్లైన్లో ఎలక్ట్రికల్, ప్లంబింగ్ ఉత్పత్తుల అమ్మకాలను ప్రారంభించిన తొలి కంపెనీ ఇదే. కంపెనీ టర్నోవరు 2016–17లో రూ.75 కోట్లు.