భీమవరంలో వ్యక్తి దారుణ హత్య
పశ్చిమగోదావరి: పాత కక్షలతో ఒక వ్యక్తిని దారుణంగా కత్తులతో నరికి చంపిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. భీమవరం పట్టణానికి చెందిన పసుపులేటి రామకృష్ణ(58) ఇంట్లో నిద్ర పోతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో నుంచి బయటకు తీసుకొచ్చి హతమార్చినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ హత్యకు పాత కక్షలే కారణమా ? లేక వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా ? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
(భీమవరం)