bsnl offers
-
అతి తక్కువ ధరలో రీచార్జ్ ప్లాన్స్.. నెలంతా అన్లిమిటెడ్!
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) అతి తక్కువ ధరలో అద్భుతమైన ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జియో, ఎయిర్ టెల్ వంటి బడా కంపెనీలకు పోటీగా తమ వినియోగదారులకు తక్కువ ధరలోనే డేటా, కాల్స్, ఎస్ఎంఎస్లను అందిస్తోంది. నెలంతా కేవలం రూ. 200 కంటే తక్కువ ధరలతో రీఛార్జ్ ప్లాన్స్ బీఎస్ఎన్ఎల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ స్పెషల్ ప్లాన్స్ వివరాలేంటో తెలుసుకుందాం.. రూ. 184 ప్లాన్ బీఎస్ఎన్ఎల్ రూ . 184 ప్లాన్ కింద కస్టమర్లకు నెలంతా అన్లిమిటెడ్ కాలింగ్, 100 ఎస్సెమ్మెస్‌లతో పాటు 1జీబీ రోజువారీ డేటా అందిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజుల పాటు ఉంటుంది. తక్కువ సంఖ్యలో నెట్ వినియోగించే కస్టమర్లకు ఈ ప్లాన్ అనువుగా ఉంటుంది. రూ. 185 ప్లాన్ రూ.184 ప్లాన్ ప్రయోజనాలనే రూ. 185 ప్లాన్ కూడా అందిస్తోంది. రోజూ 1జీబీ డేటా, 100 ఎస్సెమ్మెస్‌లతో పాటు అన్లిమిటెడ్ కాలింగ్ సదుపాయాలు ఉంటాయి. అయితే రోజువారీ డేటా ఉపయోగించిన తర్వాత ఈ ప్లాన్ కింద కస్టమర్లకు 40Kbps వేగంతో ఇంటర్నెట్ లభిస్తుంది. రూ. 186 ప్లాన్ రోజూ ఎక్కువ డేటాను ఉపయోగించేవారికి ఈ రూ. 186 ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ అందిస్తోంది. ఈ ప్లాన్‌లో 1జీబీ రోజువారీ డేటా, రోజూ 100 ఎస్సెమ్మెస్‌లు, అన్ లిమిటెడ్ కాలింగ్ లభిస్తాయి. దీని వ్యాలిడిటీ 28 రోజుల పాటు ఉంటుంది. ఇదీ చదవండి: GST On X: ట్విటర్ నుంచి డబ్బులు వస్తున్నాయా? జీఎస్టీ తప్పదు! -
బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు బంపర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. వాయిస్, డేటాతో కూడా రూ.429 సెంట్రిక్ ప్లాన్‌ను మంగళవారం లాంచ్ చేసింది. ఈ ప్లాన్ కింద 90 రోజుల పాటు తన ప్రీపెయిడ్ మొబైల్ సర్వీసు కస్టమర్లకు రోజుకు 1జీబీ డేటాను, అపరిమిత వాయిస్ కాల్స్‌ను అందించనున్నట్టు తెలిపింది. ఏ నెట్‌వర్క్‌కైనా ఈ ఉచిత లోకల్/ఎస్టీడీ కాల్స్‌ను వాడుకోవచ్చు. కేరళ మినహా మిగతా ప్యాన్-ఇండియా బేసిస్‌లో ఈ 90 రోజుల ప్లాన్‌ను లాంచ్చేస్తున్నట్టు బీఎస్ఎన్ఎల్ ఓ ప్రకటనలో తెలిపింది. 90 రోజుల వరకు వాలిడిటీలో ఉండే ఈ ప్యాక్‌లో నెలవారీ ఖర్చు 143 రూపాయలు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ప్లాన్లకు ఇది గట్టిపోటీని ఇవ్వగలదు. మార్కెట్ దిగ్గజం ఎయిర్టెల్ కూడా 149 రూపాయలతో ఓ ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీని కింద 28 రోజుల పాటు ఎయిర్టెల్ టూ ఎయిర్టెల్ కాల్స్ మాత్రమే యూజర్లు అపరిమితంగా వాడుకోవచ్చు. దీంతో పాటు 2జీబీ 4జీ డేటాను మాత్రమే అందిస్తోంది. ప్రస్తుతం రిలయన్స్ జియో నుంచి తీవ్ర పోటీ వస్తున్న క్రమంలో టెలికాం కంపెనీలు కొత్త కొత్త ప్లాన్లను తీసుకొస్తున్నాయి. ఎయిర్టెల్ కూడా అచ్చం జియో మాదిరే రూ.399 ప్లాన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చి, రిలయన్స్ తో యుద్ధానికి దిగింది. -
ప్రగతి పథంలో బీఎస్ఎన్ఎల్
అనంతపురం రూరల్ : బీఎస్ఎన్ఎల్ ప్రగతిపథంలో పయనిస్తోందని ఆ సంస్థ జనరల్ మేనేజర్ వెంకటనారాయణ అన్నారు. 19శాతం అదనపు ఆదాయం సాధించడం ద్వారా అనంతపురం జిల్లాను తెలుగు రాష్ట్రాల్లో రెండో స్థానంలో నిలుపగలిగామన్నారు. ఆ దిశగా కృషి చేసిన ఉద్యోగులను అభినందించారు. శనివారం బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతేడాది జిల్లాలో రూ.79 కోట్లు ఆదాయం రాగా, ఈ ఏడాది రూ.94కోట్లు వచ్చిందన్నారు. 2016 - 17లో టెలికాం రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పులను, పోటీని ధీటుగా ఎదుర్కొని వినియోగదారులకు మెరుగైన సేవలు అందించామన్నారు. బీఎస్ఎన్ఎల్ వినియోగదారలు ఇతర నెట్వర్కుల్లోకి మారకుండా మంచి ఆఫర్లను ప్రవేశపెట్టి ఇతర నెట్‌వర్క్‌ల కస్టమర్లను సైతం ఆకట్టుకున్నామన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా దాదాపు 7లక్షలకు పైగా ల్యాండ్ లైన్, బ్రాడ్‌బ్యాండ్, జీఎస్ఎమ్ వినియోగదారులను కలిగి జిల్లాలో ప్రథమస్థానంలో ఉన్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ 3జీ సేవలు అందిస్తున్నామన్నారు. వేగంతో కూడిన సేవలను అందించడం కోసం ఈ ఏడాది అదనంగా 169 3జీ టవర్లను ఏర్పాటు చేశామన్నారు. బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వేగంగా కసరత్తు చేస్తున్నామని, వచ్చే ఆగస్టులోపు జిల్లా వ్యాప్తంగా 4జీ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. ఇన్స్టలేషన్ చార్జీలు మినహాయింపు బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్, బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లు తీసుకునే వినియోగదారులకు, పాత కనెక్షన్లను పునరుద్ధరించుకునే వినియోగదారులకు రూ.800 ఇన్స్టలేషన్ చార్జీలను మినహాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఆఫర్ జూన్ 30వరకు ఉంటుందని, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
బ్రాడ్‌బాండ్‌లో బంఫర్ ఆఫర్
ముంబై: రిలయన్స్ జియోకు పోటీగా ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్ తో ముందుకు వచ్చింది. కొత్త కస్టమర్ల కోసం రూ.249కే బ్రాడ్‌బాండ్‌లో బంఫర్ ఆఫర్ ప్రకటించింది. నెలకు కేవలం రూ.249 చెల్లిస్తే 300 జీబీ వరకు ఉచితంగా డేటా అందిస్తున్నట్టు తమ వెబ్సైట్లో పేర్కొంది. ఈ ఆఫర్ వచ్చే ఆరు నెలల పాటు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఆ తర్వాత 499 ప్లాన్‌కు మారుతుందని బీఎస్ఎన్ఎల్ వెల్లడించింది. ఆఫర్లో భాగంగా వినియోగదారులు ప్రతి రోజు 10జీబీ డేటా వరకు ఉపయోగించుకోవచ్చు. దీన్ని 2ఎంబీపీఎస్ వేగంతో అందిస్తుంది.10జీబీ తర్వాత ఈ వేగం 1 ఎంబీపీఎస్‌కు పడిపోతుంది. ఈ కొత్త ఆఫర్ జమ్మూకశ్మీర్, అండమాన్ నికోబర్ ప్రాంతాల్లో మినహా దేశంలోని అన్ని సర్కిళ్లలో అందుబాటులోకి వచ్చింది. ఇదే ప్లాన్‌లోనే రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు దేశ వ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కు అయినా ఉచితంగా ఫోన్ కాల్స్ చేసుకోవచ్చు. ఆదివారం అన్ని సమయాల్లోనూ ఉచిత కాల్స్ చేసుకునే మరో సదుపాయం కల్పించింది. ఈ పథకంలో అదనంగా ఇతర ఏ చార్జీలు వసూలు చేయబోమని బీఎస్ఎన్ఎల్ స్పష్టం చేసింది. సెక్యూరిటీ డిపాజిట్ కింద ఒక్క నెల అడ్వాన్స్‌గా రూ.249 చెల్లించి కనెక్షన్ పొందవచ్చని తెలిపింది. -
జియోకు ధీటుగా బీఎస్ఎన్ఎల్ ఆఫర్లు
అనంతపురం రూరల్ : బీఎస్ఎన్ఎల్ సంస్థ జియోకు ధీటుగా ఆఫర్లను ప్రవేశపెట్టింది. కేవలం రూ.6కే 1జీబీ 3జీ డేటాను అందిస్తున్నట్లు సంస్థ జనరల్ మేనేజర్ వెంకటనారాయణ గురువారం తెలిపారు. రూ.339తో రీచార్జ్ చేసుకున్న ప్రీపెయిడ్ వినియోగదారులకు నెలరోజుల వ్యాలిడిటీతో రోజుకు 2జీబీ డేటా ఉచితమని, బీఎస్ఎన్ఎల్ టు బీఎస్ఎన్ఎల్ కాల్స్ అన్లిమిటెడ్ అని తెలిపారు. అలాగే ప్రతిరోజూ 25నిమిషాల పాటు ఇతర నెట్‌వర్క్‌లకు కూడా ఉచితంగా ఫోన్ చేసుకోవచ్చన్నారు. వీటితోపాటు బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ నుంచి ఇతర నెట్వర్కులకు సంబంధించిన మూడు నెంబర్లకు రూ.49లతో నెలరోజులపాటు అన్‌లిమిటెడ్‌గా మాట్లాడుకునే సదుపాయాన్ని కల్పిస్తోందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఇన్స్టాలేషన్ చార్జీల మినహాయింపు ఈనెల 31వరకు ల్యాండ్‌లైన్, బ్రాడ్‌బ్యాండ్, ఫైబర్టూహోం కనెక్షన్లు తీసుకునే వినియోగదారులకు ఇన్స్టాలేషన్ చార్జీలను మినహాయిస్తున్నట్లు జనరల్ మేనేజర్ తెలిపారు. వీటితోపాటు పాత కనెక్షన్లు పునరుద్ధరించుకునే అవకాశాన్ని సైతం సంస్థ కల్పిస్తోందన్నారు.