బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌ | BSNL launches unlimited voice and 1 GB per day data plan for Rs 429 | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌

Published Tue, Sep 5 2017 2:43 PM | Last Updated on Sun, Sep 17 2017 6:26 PM

బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌

బీఎస్‌ఎన్‌ఎల్‌ కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌

సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ తన కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. వాయిస్‌, డేటాతో కూడా రూ.429 సెంట్రిక్‌ ప్లాన్‌ను మంగళవారం లాంచ్‌ చేసింది. ఈ ప్లాన్‌ కింద 90 రోజుల పాటు తన ప్రీపెయిడ్‌ మొబైల్‌ సర్వీసు కస్టమర్లకు రోజుకు 1జీబీ డేటాను, అపరిమిత వాయిస్‌ కాల్స్‌ను అందించనున్నట్టు తెలిపింది. ఏ నెట్‌వర్క్‌కైనా ఈ ఉచిత లోకల్‌/ఎస్‌టీడీ కాల్స్‌ను వాడుకోవచ్చు. కేరళ మినహా మిగతా ప్యాన్‌-ఇండియా బేసిస్‌లో ఈ 90 రోజుల ప్లాన్‌ను లాంచ్‌చేస్తున్నట్టు బీఎస్‌ఎన్‌ఎల్‌ ఓ ప్రకటనలో తెలిపింది. 90 రోజుల వరకు వాలిడిటీలో ఉండే ఈ ప్యాక్‌లో నెలవారీ ఖర్చు 143 రూపాయలు.
 
ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ప్లాన్లకు ఇది గట్టిపోటీని ఇవ్వగలదు. మార్కెట్‌ దిగ్గజం ఎయిర్‌టెల్‌ కూడా 149 రూపాయలతో ఓ ప్లాన్‌ను తీసుకొచ్చింది. దీని కింద 28 రోజుల పాటు ఎయిర్‌టెల్‌ టూ ఎయిర్‌టెల్‌ కాల్స్‌ మాత్రమే యూజర్లు అపరిమితంగా వాడుకోవచ్చు. దీంతో పాటు 2జీబీ 4జీ డేటాను మాత్రమే అందిస్తోంది. ప్రస్తుతం రిలయన్స్‌ జియో నుంచి తీవ్ర పోటీ వస్తున్న క్రమంలో టెలికాం కంపెనీలు కొత్త కొత్త ప్లాన్లను తీసుకొస్తున్నాయి. ఎయిర్‌టెల్‌ కూడా అచ్చం జియో మాదిరే రూ.399 ప్లాన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చి, రిలయన్స్‌ తో యుద్ధానికి దిగింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement