BT roads
-
అభివృద్ధి దారులు.. వేగంగా రోడ్ల నిర్మాణం
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో రహదారులను వేగంగా అభివృద్ధి చేస్తోంది. ఇందుకోసం రూ.కోట్ల నిధులను వెచ్చిస్తోంది. పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా నాణ్యాతా ప్రమాణాలను పాటిస్తూ బీటీ, సీసీరోడ్లు నిర్మిస్తోంది. నెల్లూరు(బారకాసు): వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జిల్లాలో అభివృద్ధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రధానంగా రోడ్ల మరమ్మతులు, కొత్త రహదారుల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి ప్రజలు వినతులు ఇస్తున్నా గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ప్రమాదాలు జరుగుతున్నా స్పందించలేదు. ప్రస్తుతం పరిస్థితి మారింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఆర్అండ్బీ రోడ్లకు మహర్దశ పట్టింది. గతంలో ప్రతిపాదనలకే పరిమితం కాగా నేడు ఎన్నో కార్యరూపం దాల్చుతున్నాయి. ఎక్కడెక్కడంటే.. ఆర్అండ్బీ శాఖ నెల్లూరు డివిజన్ పరిధిలోని నెల్లూరు సిటీ, రూరల్, సర్వేపల్లి, ఆత్మకూరు, కోవూరు నియోజకవర్గాల్లో దెబ్బతిన్న రోడ్లను బాగు చేసేందుకు, కొత్తగా రోడ్ల నిర్మాణాలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. వీటితో ఇప్పటికే ఆయా నియోజకవర్గాలకు సంబంధించి మొత్తం ఎనిమిది పనులను పూర్తి చేశారు. మిగిలిన నిర్మాణాలను జూన్ నెలాఖరులోపు పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఇప్పటికే పూర్తి నెల్లూరు డివిజన్ పరిధిలో నెల్లూరు – కృష్ణపట్నం రోడ్డు (మాదారాజుగూడురు నుంచి బ్రహ్మదేవి వరకు), పొదలకూరు – రాపూరు రోడ్డు, నెల్లూరుపాళెం – ఆత్మకూరు, ఆత్మకూరు – సోమశిల, ఈపూరు ఫిషరీస్ రోడ్డు, నెల్లూరు – అనికేపల్లి (వయా గొలగముడి), మొగళ్లపాళెం – సౌత్‌మోపూరు, ములుముడి – తాటిపర్తి రోడ్డు పనులు పూర్తయ్యాయి. గడువులోగా పూర్తికి చర్యలు నెల్లూరు డివిజన్ పరిధిలోని రోడ్లు నిర్మాణాల పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఎనిమిది చోట్ల పనులు పూర్తి చేశాం. మిగిలిన వాటిని నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపపట్టాం. కిందిస్థాయి అధికారులతో సమీక్షిస్తూ పనుల పురోగతి తెలుసుకుంటున్నాం. ఇప్పటి వరకు ఎక్కడా కూడా సమస్యల్లేవు. సకాలంలో పనులు పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లు కూడా ఎంతో సహకరిస్తున్నారు. – రామాంజనేయులు, ఈఈ, నెల్లూరు డివిజన్, అర్అండ్బీ -
ప్రాజెక్టు పనులకు గ్రహణం !
బాల్కొండ (నిజామాబాద్): ఉత్తర తెలంగాణ జిల్లాలకు ప్రయోజనం చేకూర్చే శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ అభివృద్ధికి దశాబ్ద కాలం తరువాత గతేడాది భారీగా నిధులు మంజూరయ్యాయి. నిధులున్నా పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. గతేడాది ఆగస్టులో సీఎం కేసీఆర్ ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకం శంకు స్థాపన కోసం ప్రాజెక్ట్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఎస్సారెస్పీలో పలు అభివృద్ధి పనుల కోసం రూ. 26 కోట్లు, లక్ష్మి కాలువ ఆధు నికీకరణకు రూ. 20 కోట్లు మంజూరు చేశారు. నవంబర్ వరకు టెండర్ల ప్రక్రియ పూర్తికాగా, ఇప్పటికీ 80 శాతం పనులు ప్రారంభం కాలేదు. అధికారులేమో పనులు ప్రారంభించాలని కాం ట్రాక్టర్లకు నోటీసులిచ్చి చేతులు దులుపుకున్నా రు. పనులు సకాలంలో ప్రారంభించని వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. లక్ష్మి కాలువ అంతే.. శ్రీ రాంసాగర్ ప్రాజెక్ట్ లక్ష్మికాలువ ఆధునికీకరణ కోసం రూ. 20 కోట్లు గతేడాది మంజూరు కాగా పనులను మేలో ప్రారంభించారు. కాలువపై అక్కడక్కడా వంతెనల నిర్మాణం, లక్ష్మి లిఫ్టు వద్ద రిటైనింగ్ వాల్ పనులను పూర్తి చేశారు. ప్రస్తుతం కాలువ ద్వారా నీటి విడుదల కొనసాగుతుండటంతో పనులు నిలిపి వేశారు. ప్రాజెక్ట్ నుంచి నవంబర్ 15 వరకు నీటి విడుదల కొనసాగుతుంది. రబీలో నీటి సరఫరా చేసే అవకాశం ఉండటంతో వేసవి వరకు పనులు అటకెక్కినట్లే. ఆనకట్ట ప్రాటెక్షన్ వాల్.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఆనకట్టకు ఇరువైపులా ప్రాటెక్షన్ వాల్ నిర్మించడానికి రూ. 8 కోట్ల 31 లక్షల 70 వేలు మంజూరు అయ్యాయి. ఇది వరకే కుడి వైపు కిలోమీటర్, ఎడమ వైపు కిలో మీటర్ మేర సెఫ్టీ వాల్ ఉంది. దానిని పూర్తిగా నిర్మించా లని ప్రభుత్వం నిర్ణయించింది. టెండర్ ప్రక్రియ పూర్తయినా వరకు పనులు ప్రారంభించ లేదు. రివిట్ మెంట్.. ఎస్సారెస్పీ ఆనకట్ట రివిట్ మెంట్ మరమ్మతుల కోసం రూ. 5 కోట్ల 34 లక్షల 70 వేలు మంజూ రు అయ్యాయి. రివిట్ మెంట్ పనులను వేసవి కాలంలో ప్రారంభించి ఎట్టకేలకు చివరి దశకు తీసుకు వచ్చారు. ప్రస్తుతం ఆనకట్టపై పెరిగిన చెట్లను తొలిగించే పనులు చేపడుతున్నారు. ప్రారంభం కాని బీటీ రోడ్డు.. ప్రాజెక్ట్ ఆనకట్ట కుడి, ఎడమలు కలిపి 13.5 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. పూర్తిగా గుంతల మయంగా మారింది. బీటీ తొలగిపోయి మొత్తం మట్టి రోడ్డు ఏర్పడింది. బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.4 కోట్ల 64 లక్షల 30 వేలు మంజూరయ్యాయి. పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. ప్రాజెక్ట్ ప్రధాన రోడ్డు మరమ్మతులు.. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ జాతీయ రహదారి 44 నుంచి ప్రాజెక్ట్ వరకు గల మూడు కిలోమీటర్ల రోడ్డు తారు కొట్టుకు పోయింది. ఆ రోడ్డు మరమ్మతులకు రూ. కోటి 94 లక్షల 30 వేలు మంజూరయ్యాయి. పనులు ప్రారంభమైన రెండు రోజులకే నిలిచిపోయాయి. నోటీసులు ఇచ్చాం : ప్రాజెక్ట్ వద్ద చేపట్ట వలిసిన పనులు ప్రారంభించక పోవడంపై కాంట్రాక్టర్‌కు పలు మార్లు నోటీసులు ఇచ్చాం. పనులు ప్రారంభించ కుంటే ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళుతాం. – శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఈ, ఎస్సారెస్పీ -
రామారెడ్డి రోడ్డుకు మహర్దశ
సదాశివనగర్(ఎల్లారెడ్డి):సదాశివనగర్ – రామారెడ్డి రోడ్డుకు మహర్దశ వచ్చింది. రూ. 13 కోట్లతో రోడ్డు పనులు చురుకుగా సాగుతున్నాయి. గతంలో ఈ సింగిల్ రోడ్డుగా ఉండగా ప్రస్తుతం డబుల్ బీటీ రోడ్డు వేస్తుండడంతో వేస్తుండడంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సదాశివనగర్ నుంచి మాచారెడ్డి చౌరస్తాకు వెళ్లడానికి గతంలో ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. దీంతో సదాశివనగర్ నుంచి రామారెడ్డి వరకు బీటీ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 13 కోట్లు మంజూరు చేసింది. దీంతో పనులు చకాచకా కొనసాగుతున్నాయి. గతంలో అధికారుల, పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఈ రోడ్డు పూర్తిగా గుంతలమయంగా ఉండేది. ఈ రోడ్డు మీదుగా గుండా సదాశివనగర్ నుంచి రామారెడ్డి మీదుగా మాచారెడ్డి చౌరస్తా వరకు వెళ్లడానికి దారి సులువుగా ఉంటుంది. రామారెడ్డి మండలంలో గల ప్రధాన దేవాలయం శ్రీ కాలభైరవ స్వామిని దర్శించుకోవడానికి భక్తులకు ఈ రోడ్డు గుండానే వెళ్తుంటారు. రోడ్డు అధ్వానంగా ఉండడం వల్ల గతంలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం రోడ్డుకు నిధులు మంజూరు కావడం, పనులు వేగంగా కొనసాగుతుండడంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పనున్నాయి. అలాగే మండలంలోని తిర్మన్‌పల్లి, మర్కల్ గ్రామాలకు బీటీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరవడంతో పనులు కొనసాగుతున్నాయి. వీటితో పాటు మండలంలోని మరిన్ని గ్రామాలకు రోడ్ల నిర్మాణానికి ఎంఆర్ఆర్ గ్రాంట్ కింద నిధులు మంజూరవడంతో రోడ్ల నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. దీంతో మండలంలోని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీటీ రోడ్లకు మరమ్మతులు సదాశివనగర్ మండలంలో ఎంఆర్ఆర్ గ్రాంట్ కింద జాతీయ రహదారి నుంచి అడ్లూర్ ఎల్లారెడ్డి వరకు రూ. 24 లక్షలు, గర్గుల్ నుంచి రంగంపేట్ వరకు రూ. 64 లక్షల 50 వేలు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి గోకుల్‌తండాకు రూ. 47లక్షలు, రామారెడ్డి పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి గర్గుల్ నుంచి కన్నాపూర్‌కు రూ. 77లక్షలు, కన్నాపూర్ రోడ్డు నుంచి రెడ్డిపేట్ రోడ్డుకు రూ. 45లక్షలు, జాతీయ రహదారి నుంచి సదాశివనగర్ వరకు రూ. 36లక్షలు, జాతీయ రహదారి నుంచి మర్కల్–తిర్మన్‌పల్లి గ్రామం వరకు రూ. 22లక్షలు, జాతీయ రహదారి నుంచి కుప్రియాల్ వరకు రూ. 36 లక్షలతో మరమ్మతు పనులు చేపడుతున్నారు. అలాగే జాతీయ రహదారి నుంచి మోషంపూర్ వయా అడ్లూర్ ఎల్లారెడ్డి వరకు రూ. 66లక్షలు, అడ్లూర్ఎల్లారెడ్డి నుంచి అడ్లూర్‌కు రూ. 55లక్షలు, జాతీయ రహదారి నుంచి ధర్మారావ్‌పేట్ వరకు రూ. 47లక్షలు, జాతీయ రహదారి నుంచి మల్లుపేట్ వరకు రూ. 6లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి రంగంపేట్ వయా పోసానిపేట్ వరకు రూ. 40లక్షలు, పద్మాజివాడి రోడ్డు నుంచి భూంపల్లి వయా లింగంపల్లి వరకు రూ. 26లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి మోడెగాం వరకు రూ. 16లక్షల 50వేలు నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో ఆయా గ్రామాల్లో రోడ్డు పనులు నిర్వహిస్తున్నారు. -
తండా రోడ్లకు మహర్దశ..
సాక్షి, హైదరాబాద్: గతుకుల ప్రయాణం ఇక గతించనుంది. కాలిబాటలు కనుమరుగు కానున్నాయి. తండాతండాకు బీటీ రోడ్డు దర్శనమివ్వనుంది. గిరిజన ఆవాసాల్లో రవాణా వ్యవస్థను మెరుగుపర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టంలోనూ ఈ అంశానికి ప్రాధాన్యత ఇచ్చింది. రాష్ట్రంలో 12,905 గిరిజన తండాలుండగా వీటిలో 4,673 తండాలకు తారురోడ్డు సౌకర్యం లేదు. ఇందులో సగం తండాలకు మెటల్ రోడ్లు ఉన్నా సకాలంలో మరమ్మతులు చేపట్టకపోవడంతో కాలిబాటలుగానే మిగిలిపోయాయి. ఈ క్రమంలో 2017–18 వార్షిక సంవత్సరంలో వీలైనన్ని ఎక్కువ తండాలకు రోడ్లు నిర్మించాలని సంకల్పించిన గిరిజన సంక్షేమ శాఖ ప్రస్తుతానికి 721 ఆవాసాలను గుర్తించి నిర్మాణ పనులకు అంచనాలు ఖరారు చేసింది. ప్రాధాన్యతాక్రమంలో నిర్మాణం... : ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద ప్రతి గిరిజన ఆవాసానికి మౌలిక వసతులు కల్పించేలా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. తండాలవారీగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. జనాభా ఎక్కువగా ఉండి, రవాణా వసతి అదమంగా ఉన్న తండాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో ఐటీడీఏ పరిధిలో 487, మైదాన ప్రాంతాల్లో 234 ఆవాసాలున్నాయి. ఈ ఆవాసాల రోడ్ల కోసం ప్రభుత్వం రూ.450.17 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ నిధులతో 761.21 కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించనుంది. వీటిని తండా నుంచి ప్రధాన రహదారులకు అనుసంధానం చేస్తారు. ఇప్పటికే ఖరారైన పనుల టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఈ నెల చివరల్లోగా పనులు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని 4,763 ఆవాసాలను ప్రధాన రహదారులతో అనుసంధానం చేయాల్సిన అవసరముంది. గతేడాది చివర్లో గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీర్లు సుమారు 7,988 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు నిర్మించాల్సి ఉందని తేల్చారు. -
గుంతలు.. గతుకులే
సాక్షి, హైదరాబాద్: నీటమునిగిన బస్తీలు.. బురదమయంగా కాలనీలు.. గతుకులు పడి రాళ్లు తేలిన రహదారులు.. దెబ్బతిన్న మ్యాన్‌హోళ్లు.. బుధవారం నాటి కుంభవృష్టి నుంచి నగరం ఇంకా తేరుకోలేదని చెప్పడానికి సాక్ష్యాలివన్నీ. గురువారం సైతం కొన్ని ప్రాంతాల్లో వర్షం కురవడంతో బుధవారం నాటి పరిస్థితే కనిపించింది. దీంతో నగరవాసులు బిక్కుబిక్కుమంటూ గడిపారు. అనేక ప్రాంతాల్లో రహదారులు, మ్యాన్‌హోళ్లు దెబ్బతిన్నాయి. బీటీ రహదారులు బాగా దెబ్బతినగా.. ఇటీవలే వేసిన తారు రోడ్లు సైతం వర్షం దెబ్బకు నామరూపాలు లేకుండాపోయాయి. అసలే అధ్వానంగా ఉన్న రహదారులు కాస్తా.. వర్షానికి దారుణంగా దెబ్బతినడంతో నగరవాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. నగరంలో బుధ, గురువారాల్లో కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న రహదారుల నష్టం దాదాపు రూ.10 కోట్లు ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. వర్ష బీభత్సానికి అనేక ప్రాంతాల్లో ప్రజలు ఇంకా కోలుకోలేదు. ఇళ్లలోకి నీరుచేరి బియ్యం, ఆహార పదార్థాలు తడిసిపోయి పనికిరాకుండా పోయాయి. కొన్ని ఇళ్లల్లో ఇప్పటికీ నాలుగు అడుగుల మేర వర్షపు నీరు నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో పరిస్థితులు దుర్భరం.. * మూసీ పరీవాహక ప్రాంతంలోని సంజయ్‌నగర్‌లో ఆరు ఇళ్లు నేలమట్టం కావడంతో అందరూ రోడ్డునపడ్డారు. * నల్లకుంట సత్యానగర్ బస్తీలో ఇళ్లలోకి నీరుచేరి నిత్యావసరాలు పనికిరాకుండా పోయాయి. రెండు రోజులుగా తాగు నీరందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. * లోతట్టు ప్రాంతమైన బతుకమ్మ కుంట, గోల్నాక, ప్రేమనగర్‌తో పాటు మూసీ పరీవాహక ప్రాంతాల్లోని చిరు వ్యాపారుల దుకాణాల్లోకి నీరు చేరింది. * కంటోన్మెంట్ ఐదో వార్డు ఏఓసీ గేటు మహేంద్రహిల్స్ చెక్ పోస్టు సమీపంలోని ప్రధాన రోడ్డు, జూబ్లీ బస్టాండ్ సమీపంలో రోడ్డు కోతకు గురైంది. పెద్ద గుంతలు ఏర్పడటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. * బండ్లగూడ ప్రధాన రహదారిపై నిర్మాణంలో ని కల్వర్ట్ వద్ద వర్షపు నీరు పొంగి పొర్లుతోంది. పల్లె చెరువు నుంచి వరద ఉధృతి తీవ్రంగా ఉండటమే దీనికి కారణం. వరద తాకిడికి రోడ్డు గోతులమయమైంది. * కేపీహెచ్‌బీ కాలనీలోని రోడ్లు గుంతలమయమయ్యాయి. మోకాలు లోతు నీరు నిల్వ ఉండటంతో వాహనదారులు, పాదచారులు గుంతల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నారు. * గండిపేట కట్ట రెండు రోజులుగా చీకట్లో మగ్గుతోంది. దానిపై ఉన్న ట్రాన్స్ఫార్మర్ బుధవారం వర్షానికి కాలిపోవటంతో చెరువు కట్ట, లేక్ పోలీస్‌స్టేషన్ అంధకారంలో మునిగాయి. తగ్గని హుస్సేన్ సాగర్ ఉధృతి హుస్సేన్‌సాగర్‌లో నీటిమట్టం తగ్గకపోవడంతో తూము ద్వారా నీటిని దిగువ ప్రాంతాలకు వదులుతూనే ఉన్నారు. పూర్తిస్థాయి నీటిమట్టం 513.41 మీటర్లు కాగా.. గురువారం 513.42 మీటర్ల మేర నీరు ఉంది. దీంతో 1,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు జీహెచ్ఎంసీ లేక్స్ డివిజన్ ఎస్ఈ శేఖర్‌రెడ్డి తెలిపారు.